Just In
Don't Miss!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రేష్మి వల్గర్‌గా చేసిందంటూ.... చలాకీ చంటి డైలాగ్!
హైదరాబాద్: యాంకర్ రేష్మి... బుల్లితెరపై యాంకరింగ్ మొదలు పెట్టినప్పటి నుండి తన హాట్ అండ్ సెక్సీ ఆటిట్యూడ్ తో బాగా పాపులర్ అయింది. అలాంటి రష్మికి సినిమా ఛాన్స్ వస్తే ఏ రేంజిలో రెచ్చిపోతుందో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఆ మధ్య రిలీజైన్ 'గుంటూరు టాకీస్'.
తొలి సినిమాలో రష్మికి నటన పరంగా నిరూపించుకునే అవకాశం లేక పోవడం...అందాల ఆరబోత పరంగా తన టాలెంట్ చూపించింది. ఈ సినిమా చూడటానికి వచ్చిన జనాల్లో సగం మంది రష్మి అందాలు చూడటానికే వచ్చారంటే అతిశయోక్తి కాదేమో!
ఈ సినిమా తర్వాత రష్మికి సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. అందులో తనకు తగిన పాత్రలు, కెరీర్లో పైకొచ్చే విధంగా ఉండే సినిమాలు ఎంచుకుంటూ దూసుకెలుతోంది. త్వరలో రష్మి 'తను వచ్చెనంట' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
జాంబీ కాన్సెప్టును తొలిసారిగా తెలుగులో చూపించబోతున్నారు. జాంబీ కాన్సెప్టుతో పాటు కామెడీని కూడా జోడించి ఆసక్తికరంగ తెరకెక్కించారు. దీంతో పాటు సినిమాకు వచ్చిన వారికి రష్మి అందాల ఆరబోత బోనస్. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.

చలాకీ చంటి డైలాగ్
సినిమాలో జబర్దస్త్ ఫేం చలాకీ చంటి కూడా ఓ కీలకమైన పాత్ర చేసాడు. సినిమాలో రష్మి పాత్రపై చలాకీ చంటి డైలాగ్ విసురుతూ నేను చాలా జాంబీ సినిమాలు చూసాను కానీ నీ అంత వల్గర్ గా ఎవరూ చేయలేదంటూ కామెంట్ చేస్తాడు. టీజర్ లో ఇలాంటి డైలాగులు పెట్టడం ద్వారా సినిమాలో ప్రేక్షకులు ఊహించని వల్గర్ సన్నివేశాలు ఉంటాయని చెప్పకనే చెప్పారు.

జంబీ సినిమాలు
జాంబీ సినిమాలు ఎక్కువగా వచ్చేవి హాలీవుడ్లోనే...జాంబీ సినిమాలంటేనే వల్గర్, చూసే వారికి వాంతి వచ్చేలా సన్నివేశాలు ఉంటాయి.

తెలుగులో అంత ఉంటుందా?
అయితే తెలుగులో హాలీవుడ్ రేంజి వల్గారిటీ వర్కౌట్ కాదు. తెలుగు సినిమా నేటివిటీకి తగిన విధంగా వల్గారిటీని కుదించినట్లు స్పష్టమవుతోంది.

అందం
సినిమాలో రష్మి అందం కూడా హైలెట్ కాబోతోంది. ఇప్పటికే కొన్ని సీన్లు యువతలో ఆసక్తిని పెంచుతున్నాయి.
టీజర్
తను వచ్చునంట చిత్రానికి సంబంధించిన టీజర్