»   » నాన్ బెయిలబుల్ వారెంట్ : 22 రోజులుగా పరారీలో బాలీవుడ్ నటి

నాన్ బెయిలబుల్ వారెంట్ : 22 రోజులుగా పరారీలో బాలీవుడ్ నటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగించే తారగా పేరున్న రాఖీ సావంత్ తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.ఆ మధ్య నరేంద్రమోడీ ఫోటోలున్న డ్రెస్ ధరించి ఆయన అభిమానుల ఆగ్రహానికి గురయ్యాక కూడా ఆమె వైఖరి మారలేదు.అసలు అవకాశాలే లేక పోవటం, ఇదివరకున్నంత పబ్లిసిటీ రాకపోవటం తో ఇక వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలో, చేష్టలో చేస్తూ వార్తల్లో నిలిచే ప్రయత్నాల్లో ఉంది. అలా వెనకా ముందూ ఆలోచించకుండా ఏదేదో మాట్లాడి ఇప్పుడు చిక్కుల్లో పడింది.

ఆమె పై ఫిర్యాదు

ఆమె పై ఫిర్యాదు

ఇంతకీ ఇప్పుడు వచ్చిన కొత్త కష్టం ఏమిటంటే ఈ బాలీవుడ్ ఐటెమ్ గర్ల్ రాఖీ సావంత్ కు లుధియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2016 లో ఓ ప్రయివేటు టీవీ చానల్ ప్రోగ్రామ్ లో హిందువుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడిందని.. ఒక వర్గప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బ తినేలా ప్రవర్తించిందనీ ఆమె పై ఫిర్యాదు చేయబడింది.

 కోర్టుకు హాజరు కాలేదు

కోర్టుకు హాజరు కాలేదు

రామాయణ మహా కావ్యాన్ని రచించిన మహర్షి శ్రీ వాల్మీకిని అవమాన పరిచేవిధంగా వ్యాఖ్యానించిందని కోర్టులో కేసు వేశారు ఆ జాతి ప్రజలు. కోర్టులో కేసు వేసినప్పటి నుంచి రాఖీసావంత్ కు సమన్ లు పంపుతోంది లుధియానా కోర్టు. ఎన్ని సమన్ లు పంపించినా.. ఆమె కోర్టుకు హాజరు కాలేదు.

 అరెస్టు వారెంట్

అరెస్టు వారెంట్

మార్చి 9న రాఖీసావంత్ కు అరెస్టు వారెంట్ జారీ చేసింది న్యాయస్థానం. ఆమె ఎక్కడున్నా అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చాలని పోలీసులకు ఆదేశాలిచ్చింది. ఆమెను పట్టుకునేందుకు రెండు పోలీస్ బృందాలు ముంబయికి వెళ్లాయి. అయితే గతంలోనూ రాఖీ సావంత్ పై జుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు మార్చి 9న అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

అక్కడినుంచి తప్పుకుంది

అక్కడినుంచి తప్పుకుంది

గతంలో కోర్టు ఆదేశం మేర ఇద్దరు పోలీసు అధికారుల బృందం రాఖీసావంత్ ను అరెస్టుచేసేందుకు ముంబయి వెళ్లింది. ముంబయి అడ్రెస్ లో ఉన్న రాఖీ ఇంటికి వెళ్ళిన పోలీసులకు ఆమె కనిపించక పోవటం తో తిరిగి వచ్చారు. పోలీసులు రావటానికి ముందే ఆమె అక్కడినుంచి తప్పుకుంది.

పోలీసులు రెడీగా ఉన్నారు

పోలీసులు రెడీగా ఉన్నారు

దాదాపు గత 22 రోజులుగా రాఖీసావంత్ కనిపించడం లేదు. కనిపించగానే అరెస్టు చేసేందుకు పోలీసులు రెడీగా ఉన్నారు. ఇలా కోర్టులో హాజరుకాకుండా.. పోలీసులకు దొరకకుండా ఎన్ని రోజులు తప్పించుకుంటుందో చూడాలి మరి. పాపం అసలే అవకాశాలు లేక సన్నీ లియోన్ ని తిట్టుకుంటే ఊరుకున్నారు గానీ మరీ అదే కోపాన్ని అందరి మీదా చూపిస్తే ఎలా రాఖీ..?

English summary
A local court here has issued an arrest warrant against Bollywood actress Rakhi Sawant for allegedly making objectionable remarks against sage Valmiki
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu