»   »  'బాహుబలి' ఐటం గర్ల్ ఇప్పుడు కళ్యాణ్ రామ్ సినిమాలో

'బాహుబలి' ఐటం గర్ల్ ఇప్పుడు కళ్యాణ్ రామ్ సినిమాలో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'బాహుబలి' చిత్రం లో ఐటం గర్ల్ నోరా ఫతేహా స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రేజ్ తో ఇప్పుడామె మరో సాంగ్ కమిటైంది. కళ్యాణ్ రామ్ తాజా చిత్రం షేర్ లోనూ ఓ సాంగ్ చేస్తోంది. ఆ సాంగ్ షూటింగ్ రీసెంట్ గా జరిగింది. ఈ విషయమై ఆమె చాలా ఉత్సాహంగా ఉంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

టెంపర్ సినిమాలోని ఐటమ్ సాంగ్ తో టాలీవుడ్ లో అడుగుపెట్టిన విదేశీ గుమ్మ నోరా ఫతేహీ. ప్రస్తుతం టిన్సెల్ టౌన్ లో హాట్ ప్రాపర్టీగా మారిపోయింది. ఇంతకు ముందు బాలీవుడ్ లో తన ప్రతాపం చూపించిన ఈ మోరాకో బ్యూటీ తెలుగు నాట ఒకే ఒక్క పాటతో దుమ్మురేపుతోంది. ఇట్టాగే రెచ్చిపోదాం అంటూ ఓ రేంజ్ లో కుర్రకారును ఊపేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాహుబలిలో స్పెషల్ సాంగ్ చేసేసింది.

Nora Fatehi joins Kalyan Ram's ‘Sher’

షేర్ విషయానికి వస్తే.,..

ఈ ఏడాది మొదట్లో వచ్చిన పవర్ఫుల్ పోలీస్ ఎంటర్ టైనర్ ‘పటాస్' తో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో కళ్యాణ్ రామ్ తన తదుపరి సినిమా షూటింగ్ ‘షేర్'ని శరవేగంగా ఫినిష్ చేస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకూ టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలోని సాంగ్స్ ని ఇప్పుడు షూట్ చేస్తున్నారు. ఇటీవలే ఓ సాంగ్ షూట్ ని పూర్తి చేసిన ఈ చిత్ర టీం ఈ రోజు నుంచి మరో సాంగ్ షూటింగ్ ని మొదలు పెట్టారు.

పటాస్ సినిమాలో లాగానే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉంటూనే ఓ డిఫరెంట్ పాయింట్ తో ఈ సినిమా ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది. కళ్యాణ్ రామ్ సరసన అందాల భామ సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని కొమర వెంకటేష్ నిర్మిస్తున్నారు. షేర్ లో మరోసారి కళ్యాణ్ రామ్ పూర్తి మాస్ లుక్ లో కనిపించనున్నాడు. ఇది కాకుండా కళ్యాణ్ రామ్ రవితేజ హీరోగా నిర్మించిన ‘కిక్ 2′ సినిమా త్వరలో రిలీజ్ కి సిద్దమవుతోంది.

Nora Fatehi joins Kalyan Ram's ‘Sher’

బాహుబలిలో ఐటం సాంగ్ చేస్తున్నప్పుడు

'బాహుబలి' చిత్రం కోసం ఆమెపై స్పెషల్ సాంగ్ చేసారు. ఆ సాంగ్ లో ఊహించని విధంగా ఇబ్బంది ఎదురైంది. ఆమె జారిపడింది. యూనిట్ అందరి ఎదురుగా పడటంతో ఆమెకు సిగ్గు పోయినంత పనైంది. ఆమె టాప్...కెమెరా ముందు పైకి లేచిపోయింది. అయితే అదే మయంలో తమన్నా వచ్చి...ఆమెను ఆ సిట్యువేషన్ నుంచి రక్షించింది.

Nora Fatehi joins Kalyan Ram's ‘Sher’

ఈ విషయాన్ని ఈ మెరాకో ఐటం గర్ల్ బాలీవుడ్ మీడియాతో ఖరారు చేసి చెప్పింది. ఆమె మాట్లాడుతూ..అది ఓ భయంగొలిపే అనుభవం. తమన్నా కు ధాంక్స్ చెప్పుకుంటున్నాను...ఆ సమయంలో నన్ను సేవ్ చేసినందుకు అన్నారామె.

English summary
Moroccan beauty Nora Fatehi became a overnight star in Tollywood. After younger brother Tarak sizzled with this hottie, now Kalyan Ram is taking turn to groove alongside her. She will be seen in Kalyan Ram’s upcoming “Sher” and song shoot is underway in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu