»   »  యాంకర్ నిర్వాకం: ఒకేసారి ఇద్దరు మగాళ్లతో డేటింగ్, ఒప్పుకుంది!

యాంకర్ నిర్వాకం: ఒకేసారి ఇద్దరు మగాళ్లతో డేటింగ్, ఒప్పుకుంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తప్పు చేసినా దాన్ని తప్పు అని కొందరు అస్సలు ఒప్పుకోరు. వారి దృష్టిలో అది రైటే. పైగా దానికి తమదైన రీతిలో కొత్త నిర్వచనాలు కూడా చెబుతారు. ఈ కోవలో ఉండే సెలబ్రిటీల్లో భారత సంతతికి చెందిన ఇంటర్నేషనల్ మోడల్, టీవీ యాంకర్ పద్మా లక్ష్మి ఒకరు.

మోడల్ కమ్ సెలబ్రిటీ టీవీ యాంకర్ పద్మాలక్ష్మి వయసులో ఉన్నపుడు తన హాట్ అండ్ సెక్సీ అందాలతో కుర్రకారులో సెగలు పెట్టించింది. ఇక అమ్మడు ఎఫైర్ల గురించి ఓ పుస్తకమే రాయవచ్చు. 2004లో సల్మాన్ రష్దీని పెళ్లాడిన పద్మ లక్ష్మి 2007లో అతనికి విడాకులు ఇచ్చింది. 2009లో గర్భం దాల్చింది. ఆ సమయంలో ఓసారి తన బిడ్డకు తండ్రి ఎవరో మీడియాకు చెప్పేందుకు నిరాకరించింది.  

ఎన్ని ఎఫైర్లు ఉన్నా, ఎన్ని సంబంధాలు ఉన్నా సహించ వచ్చేమో కానీ.... ఒకే సమయంలో ఇద్దరు మగాళ్లతో సంబంధం కొనసాగించడం అంటే ఎవరూ సహించే విషయం కాదు. కానీ పద్మా లక్ష్మి దీన్ని ఏ మాత్రం తప్పుగా భావించలేదు. ఒకే సమయంలో ఇద్దరు మగాళ్లతో డేటింగ్ చేసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఒప్పుకున్నపారు.

Not apologetic about dating two men at a time: Padma Lakshmi

ఒకే సమయంలో నేను ఇద్దరు మగాళ్లతో డేటింగ్ చేసాను అంటూ తాను రాసిన ఒక పుస్తకంలో తన వ్యక్తిగత విషయాల్ని ఓపెన్ గా బయట పెట్టింది. ఇద్దరు మగాళ్లతో ఏకకాలంలో డేటింగ్ చేయటం తప్పు కాదంటూ కొత్త నిర్వహచనం చెప్పేసింది. ఇలా చేసినందుకు నేనేమీ బాధ పడటం లేదు, ఈ విషయంలో తాను ఎవరికీ సారీ చెప్పాల్సిన అవసరం లేదు అంటూ తనను తాను సమర్థించుకుంది.

'లవ్, లాస్ అండ్ వుయ్ యేట్: ఎ మెమొయిర్' పేరుతో రాసిన పుస్తకంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలన్నీ పద్మాలక్ష్మి చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు తనలోని గ్లామర్ కోణం మాత్రమే చూసారని, ఈ పుస్తకంతో రియల్ పద్మాలక్ష్మిని చూస్తారని తెలిపింది.
ప్రముఖ రచయిత

సల్మాన్ రష్దీతో విడాకులు తీసుకున్న తర్వాత కూతురుతో కలిసి అమెరికాలో ఉంటున్న ఆమె... ఆయన ప్రస్తావన కూడా ఇందులో తెచ్చింది. తనపై సల్మాన్ రష్దీకి ఇంకా ప్రేమ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని, తాము ఏ కారణంగా విడిపోయామో తెలియడం లేదని వెల్లడించింది.

English summary
"Yes I was seeing two men at the same time. Men do it all the time, I won't apologise for my choices," said Padma Lakshmi to NDTV in a candid chat on her memoirs - Love, Loss And What We Ate.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more