»   »  నయనతారతో రహస్య వివాహం: స్పందించిన దర్శకుడు

నయనతారతో రహస్య వివాహం: స్పందించిన దర్శకుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ హీరోయిన్ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ రహస్య వివాహం చేసుకున్నట్లు తమిళ మీడియాలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కొచ్చిలోని ఓ చర్చిలో వీరి వివాహం కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిందని ఆ వార్తల సారాంశం. ప్రముఖ మీడియా సంస్థల్లో ఈ వార్తలు రావడంతో అంతా నిజమే అనుకున్నారు.

ఈ వార్తలపై విఘ్నేష్ శివన్ స్పందించారు. తమకు వివాహం కాలేదని, అవి కేవలం పుకార్లు మాత్రమే అని అతను స్పష్టం చేసారు. ఈ మేరకు తన ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి వార్తలు తమకు ప్రొఫెషనల్ గా, పర్సనల్ గా నష్టం కలిగిస్తాయని, మీడియా ఆధారం లేని వార్తలు రాయొద్దని రిక్వెస్ట్ చేసారు.

సౌతిండియా స్టార్ హీరోయిన్లలో ఒకరైన నయనతార ప్రొఫెసన్ పరంగా ఎప్పుడూ టాప్ పొజిషన్లోనూ ఉంటూ వస్తోంది. అదే సమయంలో ఎఫైర్లు, ప్రేమ వ్యవహారాల విషయంలోనూ ఆమె ఓ అడుగు ముందే ఉంటుంది. ఇప్పటికే శింబు, ప్రభుదేవాలతో నయనతార ప్రేమ వ్యవహారం ఓ సంచలనం. ఆ విషయం అందరికీ తెలిసిందే.

 Not Married to Nayanthara, Says Director Vignesh Shivan

అప్పట్లో శింబుతో ఆమె చాటుమాటు సరసాలు....ఫోటోల రూపంలోబయటకు కూడా లీక్ అయ్యాయి. ఆ తర్వాత ప్రభుదేవాతో ప్రేమలో పడి కొంత కాలం సహజీవనం చేసింది. నయనతార కోసం ప్రభుదేవా తన భార్యకు విడాకులు ఇవ్వడం అప్పట్లో ఓ సంచలనమే. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాకు. ఏమైదో ఏమోతెలియదుకాని ఇద్దరి మధ్య బ్రేకప్ అయింది.

గత కొంతకాలంగా ఒంటరిగానే ఉంటూ తన సినిమా కెరీర్ మీదనే దృష్టి పెట్టిన నయనతార మళ్లీ ప్రేమలో పడ్డట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. నయనతార ప్రస్తుతం ధనుష్ నిర్మిస్తున్న ‘నానుమ్ రౌడీదాన్' చిత్రంలో నటిస్తోంది. విజయ్ సేతుపతి హీరో. ఈచిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. విఘ్నేష్ శివన్ తో నయనతార సన్నిహితంగా మెలుగుతున్నారని, ఇటీవల ఇద్దరూ కలిసి మాల్దీవుల్లో గడిపి వచ్చినట్లు కోలీవుడ్లో గుసగుసలు వినిపించాయి. అతనికి ఓ ఖరీదైన కారు గిఫ్టుగా కొనిచ్చిందని టాక్. ఇపుడు ఏకంగా పెళ్లి జరిగిపోయిందంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. విఘ్నేష్ శివన్ క్లారిటీ ఇవ్వడంతో పుకార్లకు తెరపడినట్లయింది.

English summary
Director Vignesh Shivan wrote on his Twitter account that the marraige rumours are not true and such false reports sabotage the work flow.
Please Wait while comments are loading...