»   » హీరోయిన్ ప్రియమణి రిజిస్టర్ మ్యారేజ్: పెళ్లైన రెండ్రోజులకే...

హీరోయిన్ ప్రియమణి రిజిస్టర్ మ్యారేజ్: పెళ్లైన రెండ్రోజులకే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

సౌత్ బ్యూటీ ప్రియమణి పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైంది. అయితే ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ ప్రిమయణి ఈ విషయం స్పష్టం చేశారు.

ఆగస్టు 23న ప్రియమణి వివాహం జరుగబోతోంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కంటిన్యూ అవుతానని ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు. తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ ముస్తాఫా రాజ్‌ను ప్రియమణి పెళ్లాడబోతున్నారు.

మతాలు వేర్వేరు కాబట్టే ఇలా

మతాలు వేర్వేరు కాబట్టే ఇలా

ఎలాంటి హడావుడి లేకుండా, తమ మతం సాంప్రదాయాల ప్రకారం కాకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి కారణాన్ని ప్రియమణి వెల్లడించారు. ఇద్దరి మతాలు వేర్వేరు కావడం వల్లనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు.

Mana Oori Ramayanam Movie Audio Launch | Prakash Raj | Priyamani |
గ్రాండ్‌గా రిసెప్షన్

గ్రాండ్‌గా రిసెప్షన్

పెళ్లి వేడుక ఎలాంటి హడావుడి లేకుండా సాగినా... రిసెప్షన్ గ్రాండ్ గా ఉంటుందని, దీనికి సినీ రంగానికి చెందిన ప్రముఖులను ఆహ్వానించబోతున్నట్లు ప్రియమణి వెల్లడించారు. 23వ తేదీనే వెడ్డింగ్ రిసెప్షన్ జరుగబోతోంది.

పెళ్లి తర్వాత కూడా

పెళ్లి తర్వాత కూడా

పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కంటిన్యూ అవుతానని ప్రియమణి వెల్లడించారు. నటిగా తాను కొనసాగడంలో ముస్తాఫా రాజ్ కు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రియమణి వెల్లడించారు.

పెళ్లైన రెండ్రోజులకే...

పెళ్లైన రెండ్రోజులకే...

పెళ్లైన రెండ్రోజులకే ప్రియమణి మళ్లీ షూటింగులతో బిజీ అయిపోనుంది. ‘పెళ్లైన రెండురోజుల తర్వాత షూటింగుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను, రెండు సినిమాల్లో నటిస్తున్నాను. పెళ్లి కారణంగా షూటింగుకు ఇబ్బంది పెట్టదలుచుకోలేదు' అని ప్రియమణి తెలిపారు.

ప్రేమ వివాహం

ప్రేమ వివాహం

గత ఐదేళ్లుగా ప్రియమణి-ముస్తఫా రాజ్ ప్రేమించుకుంటున్నారు. ముస్తఫా రాజ్ ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ రన్ చేస్తున్నారు. ఓసారి ఐపీఎల్ మ్యాచ్‌లో ముస్తఫా పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

ప్రియమణి

ప్రియమణి

ముస్తఫా యాటిట్యూడ్, అతడి నిజాయితీ, సెన్సాఫ్ హ్యూమర్ నాకు బాగా నచ్చింది అందుకే అతని ప్రేమలో పడిపోయాను అని ప్రియమణి గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

గతేడాది ఎంగేజ్మెంట్

గతేడాది ఎంగేజ్మెంట్

2016 మే 27వ తేదీన ప్రియమణి-ముస్తఫా రాజ్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి కోసం సంవత్సరకంటే ఎక్కువ గ్యాప్ తీసుకున్నారు. ఈ ఐదేళ్ల పరిచయంలో ఎలాంటి విబేధాలు, మనస్పర్థలు లేకుండా వీరి రిలేషన్ కొనసాగుతుండటం విశేషం.

సహజీవనం

సహజీవనం

ఎంగేజ్మెంట్ తర్వాత నుండి ప్రియమణి-ముస్తఫా రాజ్ కలిసే ఉంటున్నారని, అఫీషియల్‌గా పెళ్లి జరుగడం తప్ప సంవత్సర కాలంగా దాదాపుగా భార్య భర్తల్లానే జీవిస్తున్నారని టాక్.

English summary
Southern film actress Priyamani, who is set to enter wedlock with Mustafa Raj on August 23, says she has no plans of taking a break from work and will return to face the arc lights two days after her marriage. "We opted for registered marriage because we are from different religions. It's simpler if we register our marriage instead of going the traditional way. It was a decision taken with each other's consent, and it was the right thing to do," Priyamani told IANS.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu