Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నేనవరినీ పెళ్లాడలేదు: ప్రకాష్ రాజ్
ప్రకాష్ రాజ్ తన అద్భుత నటనతో మీడియాను ఆకర్షిస్తాడు. అంతకన్నా ఎక్కువగా తన చేస్టలతో మీడియాను ఆకర్షిస్తాడు. అయినా ఎప్పుడూ ఆయన సంజాయిషీ కానీ వివరణలు కానీ ఇన్నాళ్లు ఇవ్వలేదు. అయితే మీడియాలో ఈ మధ్య ఆయనపై వరుసగా వ్యతిరేక వార్తలు వస్తుండడంతో నిశ్శబ్దాన్ని చేదిస్తూ ఒక వార్త విషయమై వివరణ ఇచ్చాడు.
వివరాలలోకి వెళితే...ఒక నటిని ప్రకాష్ రాజ్ రహస్యంగా వివాహం చేసుకున్నాడని తమిళ పత్రికలు కోడై కూస్తున్నాయి. అయితే ప్రకాష్ రాజ్ కు ఇప్పటికే భార్య ఒక పాప ఉన్నారు కూడా..ఒక నటిని రహస్యంగా వివాహమాడానని వస్తున్న వార్తల్లో నిజంలేదు...ఈ వార్తలు నా కుటుంబంపై ఎంతటి ప్రభావాన్ని చూపుతాయే ఆ వార్తల వెనుక ఉన్నవారికి తెలియదు...శంకర్ సినిమాలో నటించడానికి నేను ఒక కోటి రూపాయలు డిమాండ్ చేసినట్టు కూడా రాశారు. ఇందులో కూడా నిజం లేదు...అన్నారు. కాగా ప్రకాష్ రాజ్ తన నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ తండ్రిగా నటిస్తుండగా, త్రిషా కూతురుగా నటిస్తోంది.