twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంతకు మించిన ఎగ్జైటింగ్ మరొకటి లేదంటున్న రామ్ చరణ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ' రేపు(అక్టోబర్ 16) విడుదలవుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా నటించడం మరో విశేషం. నాన్నగారితో కలిసి పని చేయడం కంటే మించిన ఎగ్జైట్మెంట్ మరొకటి లేదు అంటున్నాడు రామ్ చరణ్. చాలా రోజుల తర్వాత మళ్లీ తన తండ్రి తెరపై కనిపిస్తుండటంపై చాలా సంతోషంగా ఉన్నాడు.

    ‘నాన్న మళ్లీ తెరపై కనిపించడం చూసి అమ్మ కాస్త ఎమోషన్ అయింది. ఆయన షూటింగులో పాల్గొనేందుకు సెట్స్ కి వచ్చిన నాతో షూటింగులో జాయినైన, ఫస్ట్ షాట్ కు రెడీ అయినపుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. అది చాలా స్పెషల్ మూమెంట్' అని రామ్ చరణ్ తెలిపారు. ‘ఆయన నటించేది, కనిపించేది తక్కువ సమయమే అయినా...ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఆయన అప్పియరెన్స్ ఉంటుంది' అన్నారు.

    Nothing more exciting than working with dad: Ram Charan

    టెన్షన్....
    ఓ వైపు ‘బ్రూస్ లీ' సినిమా విడుదలకు సిద్ధమవుతుంటే ఆదాయ పన్ను శాఖ అధికారులు దర్శకుడు శ్రీను వైట్ల, నిర్మాత డివివి దానయ్య, సంగీత దర్శకుడు తమన్ ఇళ్లపై దాడి చేయడంతో తెలుగు సినీ పరిశ్రమలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే దీని ఎఫెక్టు సినిమా విడుదలపై ఉండదని అంటున్నారు.

    భారీ రిలీజ్...
    బ్రూస్ లీ చిత్రాన్ని వరల్డ్ వైడ్ దాదాపు 2000 స్క్రీన్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అమెరికాలో కూడా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా విడుదల కానన్ని అత్యధిక స్క్రీన్లలో ‘బ్రూస్ లీ' సినిమా విడుదలవుతోంది. 220 స్క్రీన్లలో ‘బ్రూస్ లీ' చిత్రం విడుదలవుతోంది.

    Nothing more exciting than working with dad: Ram Charan

    రామ్ చరణ్ హీరోగా కావడం, శ్రీను వైట్ల దర్శకత్వం, మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్ ఇలా సినిమాలో ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నారు. రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌లతో పాటు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన నదియా, అరుణ్‌ విజయ్‌ నటిస్తున్నారు.

    డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

    English summary
    Actor Ram Charan shares the screen space with his father in forthcoming Telugu film "Bruce Lee: The Fighter", and he says nothing is more exciting than working alongside actor-politician Chiranjeevi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X