»   »  'బాహుబలి' కి కర్ణాటక నుంచి లీగల్ నోటీస్

'బాహుబలి' కి కర్ణాటక నుంచి లీగల్ నోటీస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు: ప్రభాస్‌, అనుష్క జంటగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం 'బాహుబలి'. ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కర్ణాటక,కర్కాళ కి చెందిన జైన మఠం నుంచి లీగల్ నోటీస్ ఇష్యూ చేసినట్లు సమాచారం. హింసాత్మక చిత్రానికి 'బాహుబలి' అనే టైటిల్ పెట్టవద్దని ఆ నోటీసులో కోరినట్లు తెలుస్తోంది. బాహుబలి లేదా గోమఠేశ్వర విగ్రహం కర్ణాటక లోని శ్రావణబెళగొళ లో ఉంది. నిస్వార్ధానికి, త్యాగానికి ప్రతీకగా జైనులు ఈ విగ్రహాన్ని కొలుస్తారు.

ప్రజలలో కల కధనం మేరకు బాహుబలి మరియు భరత (అతడి పెద్ద సోదరుడు) ఇరువురూ రాజకుమారులు. తమ ఆధిపత్యం కొరకు ఒకరితో మరి ఒకరు పోరాడుతారు. పోరాటంలో గెలిచిన బాహుబలి తన తమ్ముడిని క్షమించి వదిలేస్తాడు. ఇదే సమయంలో యుద్ధం, చంపుకొనటం వంటివి ప్రయోజనంలేనివిగా గుర్తిస్తాడు. వెంటనే తన రాజ్యాన్ని తమ్ముడు భరతుడికి అప్పగించి దిగంబర జైన మతంలో చేరతాడు. మోక్షానికి మార్గం కోరుతూ బాహుబలి తనకు దివ్యత్వం చేకూరే వరకు దిగంబరంగా ఉండిపోతాడు.

ఇక ఈ చిత్రం కథ సైతం అన్నదమ్ముల మధ్య జరిగే అధికారం కోసం జరిగే పోరుగా తీర్చి దిద్దుతున్నారని తెలుస్తోంది. తమిళంలో దీనిని 'మహాబలి'గా ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ట్రైలర్‌ - మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. తొలి రోజు నుంచే విశేష స్పందన లభించింది. ఈ చిత్రం కోసం అక్కడ వారు సైతం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్కడ కూడా రికార్డ్ స్ధాయిలో వ్యూస్ వచ్చాయి. బిజినెస్ పరంగా కూడా తమిళనాట ఓ రేంజిలో క్రేజ్ వస్తుందని అక్కడ ట్రేడ్ లో అంచనాలు మొదలయ్యాయి.

ప్రస్తుతం 'బాహుబలి' కోసం రామోజీ ఫిల్మ్‌సిటీ ఉడ్‌లాండ్‌ ప్రాంతంలో ఓ భారీ యుద్ధ సన్నివేశాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు రాజమౌళి. ఇందులో చిత్ర ప్రధాన తారాగణమంతా ఉండబోతోంది. ఇప్పటికే నటీనటులకు పూర్తి శిక్షణ ఇచ్చిన రాజమౌళి యుద్ధానికి అందరినీ సన్నద్ధుల్ని చేస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా రెండు రోజులు సెలవులు తీసుకున్న యూనిట్ మళ్లీ చిత్రీకరణలో పాల్గొంటోంది. ప్రభాస్‌, రానా, అనుష్క ప్రధాన పాత్రధారులైన ఈ సినిమాకి ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు.

రెండు టీజర్లు ఇప్పటికే ఈ సినిమా 'రుచి' ఏమిటో చూచాయిగా చూపించాయి. తెర వెనుక ఎంత కష్టపడుతున్నారో వాటిని చూస్తుంటే అర్థమవుతూనే ఉంది. అందరి కష్టం ఒక ఎత్తయితే, ప్రభాస్‌ కష్టం మరో ఎత్తు. ఈ సినిమా కోసం బరువు పెరిగాడు. 'బాహుబలి' టైటిల్‌కి నూటికి నూరుశాతం న్యాయం చేయడానికి కఠోరశ్రమ చేశాడు. కత్తియుద్ధాలు, గుర్రపుస్వారీలూ నేర్చుకొన్నాడు. రెండేళ్లపాటు కొత్తకథలేం వినకూడదని నిర్ణయించుకొన్నాడు. బహు కష్టజీవి అనిపించుకొన్నాడు.

English summary
The Jain Sode Matha from Karkala, Karnataka, has issued legal notice to the makers of the Telugu film Bahubali asking them not to use the title for a violent film. Bahubali or Gommateshwara tradition is from Karnataka seen from the many statues of the Jain monk standing for several centuries. He is seen as a idol of ahimsa. But the film is full of violence and his name should not be used for the film the legal notice sent to director SS Rajamouli and the producers.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu