»   » అశ్వనిదత్ అల్లుడు ప్రయత్నం, తెరపైకి సావిత్రి జీవితం, కానీ అది టచ్ చేయరట

అశ్వనిదత్ అల్లుడు ప్రయత్నం, తెరపైకి సావిత్రి జీవితం, కానీ అది టచ్ చేయరట

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :బాలీవుడ్ లో ఇప్పుడు బయోపిక్ ల హవా నడుస్తోంది. దంగల్, ధోని, సచిన్, కిషోర్ కుమార్,సంజయ్ దత్, రాణి లక్ష్మీ భాయ్ వంటివన్నో తెరకెక్కుతున్నాయి. ఈ నేపధ్యంలో తెలుగు దర్శకులు కూడా బాలీవుడ్ ని అనుసరస్తూ ఇక్కడ కూడా బయోపిక్ లు మొదలవుతున్నారు. అందులో మొదటిగా 'మహానటి' అని పిలిపించుకొన్న సావిత్రి జీవిత చిరిత్ర తెరకెక్కుతోంది.

సావిత్రి జీవిత చిరిత్ర తెరకెక్కించటం అంటే మూమాలు విషయమా. అలాంటి సాహసానికి పూనుకుంటోంది మరెవరో కాదు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ అల్లుడు...నాగ్ అశ్విన్. ఆయన అంతకు ముందు ఎవడే సుబ్రమణ్యం చిత్రంతో దర్శకుడుగా పరిచయమయ్యారు.

ఈ చిత్రం కోసం ఎంతో మందిని కలిసి, రీసెర్చ్ చేసి సావిత్రి జీవితంలోని పలు విశేషాలను తెలుసుకున్నారని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని సీరియస్ ధోరణిలో ఆయన తీయాలనుకోవడంలేదు. సావిత్రి వ్యక్తిగత జీవితంలో విషాదం ఉన్నప్పటికీ, దాన్ని టచ్ చేయకుండా ఆమె జీవితం తాలూకు సెలబ్రేషన్‌లా ఈ సినిమా ఉండేలా నాగ అశ్విన్ స్క్రిప్ట్‌ను వర్కవుట్ చేశారు.

Now, A Biopic on Mahanati Savitri!

సావిత్రి జీవితంలోని మరపురాని ఘట్టాలు, ఆసక్తికరమైన అంశాలూ ఈ కథలో పొందుపరిచినట్టు తెలుస్తోంది. మరి సావిత్రిగా ఎవరు నటిస్తారు? ఈ చిత్రం ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంది? అనే అంశాలు తెలియాల్సి ఉంది.

సావిత్రినీ, ఆమె నటించిన చిత్రాల్నీ మర్చిపోలేం. ఆమె జీవితం కూడా ఓ పాఠం లాంటిదే. సినిమాలోని మలుపులూ, గెలుపులూ ఆమె కథలోనూ ఉన్నాయి. అందుకే ఇప్పుడు సావిత్రి జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కుతున్నట్టు చెప్తున్నారు.

నాగ్ అశ్విన్ మాట్లాడుతూ..''ఆనాటి ఆనవాళ్లను మళ్లీ సెల్యులాయిడ్‌పై పునః సృష్టి చేయనున్నాం.సామాన్య స్త్రీ నుంచి ఓ సూపర్‌స్టార్‌గా సావిత్రి ఎదిగిన తీరు నేటి తరానికి మంచి పాఠంలా మిగిలిపోయింది. ఇన్నేళ్ళలో ఎంత మంది హీరోయిన్స్ వచ్చినా సావిత్రి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోయారు. నటీమణుల్లో చాలా తక్కువ మంది 'లెజెండ్' హోదాన్ని దక్కించుకున్నారు. వాళ్లలో సావిత్రిగారు ఒకరు. ఆమె గడిపిన జీవితం, ఎదుర్కొన్న అనుభవాల కలబోతే ఈ చిత్రం'' అని నాగ అశ్విన్ పేర్కొన్నారు.

ఒక మహానటి జీవితానికి తెరరూపం ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. పైగా రెండో సినిమాతోనే అలాంటి ప్రయత్నం చేయడం అంటే నాగ అశ్విన్‌ని అభినందించాల్సిందే.

English summary
The life of yesteryear heroine Savitri, who earned the sobriquet of Mahanati, will be chronicled by young filmmaker Nag Ashwin who made a decent debut with Yevade Subramanyam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu