»   » కొత్త ట్విస్ట్ వర్మ దర్శకత్వంలో 'పాతాళభైరవి'

కొత్త ట్విస్ట్ వర్మ దర్శకత్వంలో 'పాతాళభైరవి'

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా అలనాటి క్లాసిక్ 'పాతాళభైరవి' వార్తల్లో ఉంటూ వస్తోంది. కోన వెంకట్ ఈ టైటిల్ తో ఓ కొత్త స్పై థ్రిల్లర్ కథ అనుకున్నారని మీడియాలో గుప్పుమంది. అయితే దీనిపై కోన వెంకట్ స్పందించకపోయినా మరోసారి 'పాతాళభైరవి' గురించి మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ సారి దానికి కారణం రామ్ గోపాల్ వర్మ అని తెలుస్తోంది.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'పాతాళభైరవి' చిత్రాన్ని అనుకుని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనికి ఆయనతో వరసగా సినిమాలు చేస్తున్న సి.కళ్యాణ్ ప్రొడ్యూసర్ అని చెప్తున్నారు. ఈ విషయమై నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడారు.

Now It's Ram Gopal Varma's Patahala Bhairavi

సి.కళ్యాణ్ మాట్లాడుతూ... 'పాతాళభైరవి' చిత్రాన్ని మళ్ళీ చేయ్యడం నా డ్రీమ్‌. దీనికి సంబంధించి రామ్‌గోపాల్‌వర్మతో ఓ ప్రాజెక్టు అనుకుంటున్నాం. సోషియో ఫాంటసీగా ఆ చిత్రం ఉండబోతోంది అన్నారు. అదీ మ్యాటర్..ఇప్పుడు 'పాతాళభైరవి' ..కోన వెంకట్ దా లేక రామ్ గోపాల్ వర్మదా అనేది తేలాలి.

సి.కళ్యాణ్ తన తాజా చిత్రాలు గురించి చెప్తూ...

ప్రస్తుతం చేస్తున్న 'లోఫర్‌' నా 59వ సినిమా. వరుణ్‌ తేజ్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 17న విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. తాజాగా విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. ఇందులో సుద్దాల అశోక్‌ తేజ రాసిన అమ్మ పాటకు ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అవుతున్నారు.

Now It's Ram Gopal Varma's Patahala Bhairavi

రెండు మూడు సన్నివేశాల్లో వరుణ్‌ కళ్ళల్లో నీళ్ళు చూసి మన హార్ట్‌ ఫ్రీజ్‌ అవుతుంది. ఇది మాస్‌ సినిమా అయినప్పటికీ సెంటిమెంట్‌ కూడా ఉంది. సెంటిమెంట్‌ను వరుణ్‌ బాగా పండించాడు. పూరి ఏదైనా ఒక సినిమా చేయడానికి ముందే పక్కాగా ప్లాన్‌ చేసుకుంటారు. అందుకే ఆయన సినిమాలు త్వరగా పూర్తవుతాయి. ఈ చిత్రాన్ని 78 రోజుల్లో పూర్తి చేశాం.

'లోఫర్‌' తర్వాత వెంటనే మనోజ్‌ హీరోగా తెరకెక్కించిన 'ఎటాక్‌' చిత్రాన్ని జనవరిలోపే రిలీజ్‌ చేయబోతున్నాం. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉంటుంది అన్నారు.

English summary
Producer C.Kalyan Said that he want to make PathalaBhairavi movie with director Ram Gopal Varma.
Please Wait while comments are loading...