»   » యూ-ట్యూబ్‌లో 'మనం' .. ఇద్దరి అరెస్టు

యూ-ట్యూబ్‌లో 'మనం' .. ఇద్దరి అరెస్టు

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్‌: అక్కినేని వారి కుటుంబ కథా చిత్రంగా విక్రమ్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మనం'. ఈ చిత్రంలోని పాటలు విడుదలకు ముందే యూ-ట్యూబ్‌లో ప్రత్యక్షం కావడం కలకలం సృష్టించింది. 'మనం' చిత్రం పాటలను యూ-ట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'మనం' విడుదలకు ముస్తాబువుతోంది. ఇటీవల కన్నుమూసిన నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు చివరిగా ఈ చిత్రంలోనే నటించారు. గతంలో పవన్‌కల్యాణ్‌ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం విడుదలకు ముందే నెట్‌లో ప్రత్యక్షమవడం కలకలం సృష్టించింది.

  నాగార్జున మాట్లాడుతూ... 'మనం' షూటింగ్ పూర్తయిందని, ఉగాది పర్వదినాన విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 'మనం' చిత్రం వీక్షించానని, అద్బుతంగా రూపొందించబడిందన్నారు. ఈ చిత్రంలో తమ ముగ్గురి మధ్య సరదా సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. సినిమా వినోదం పండిస్తుందనీ, చక్కని మ్యూజిక్ కుడా ఉందనీ అన్నారు. ఇందులో నాన్న నటన చిరస్మరణీయంగా నిలుస్తుందన్నారు. సినిమాలో నటిస్తూనే పరమపదించడంతో ఆయన చిరకాల కోరిక నెరవేరిందన్నారు.

  Now, piracy hits Akkineni's Manam

  అఖిల్ తెర ఆరంగేట్రం గురించి ప్రశ్నించగా అతనినే అడగాలని నాగార్జున చమత్కరిస్తూ అదే పనిలో ఉన్నామని చిరునవ్వుతో అన్నారు. మనం చిత్రం విడుదల చేసిన తరువాతనే అఖిల్‌తో తీసే సినీమాపై దృష్టి సారిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా నాగార్జున, అఖిల్‌ను ప్రత్యక్షంగా వీక్షించడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో ఆలయం ముందు గుమికూడారు. సినీ హీరోగా సమర్థుడని నిరూపించుకున్న తరువాతనే అఖిల్‌తో కలిసి నటించే విషయం వెల్లడిస్తానని నాగార్జున పేర్కొన్నారు.

  శ్రీమతి అన్నపూర్ణ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి. పతాకంపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఇష్క్ మూవీ ఫేం విక్రమ్ కుమార్ 'మనం' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మనం గురించి నిర్మాత నాగార్జున మాట్లాడుతూ..' నాన్న, నేను, చైతన్య కలిసి నటిస్తున్న ఈ చిత్రం నాకు కొత్త అనుభూతి కలిగిస్తోంది. మా బేనర్లో ఈ చిత్రం ఓ ప్రెస్టీజియర్ చిత్రం అవుతుంది' అన్నారు.

  దర్శకుడు విక్రమ్ కుమార్ మాట్లాడుతూ...'నాగేశ్వరరావు గారు, నాగార్జునగారు, నాగచైతన్య కలిసి నటించే చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. పెద్దలు నాగేశ్వరరావుగారి ఆశీస్సులతో ఈచిత్రాన్ని చేస్తున్నాను. ఫస్ట్ లుక్ గెటప్స్ డిఫరెంటుగా ఉన్నట్లుగానే సినిమా కూడా చాలా డిఫరెంటుగా ఉంటుంది' అన్నారు. వందశాతం కామెడీతో మంచి లవ్ ఫీల్‌తో మంచి ఎమోషనల్‌తో 'మనం' చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. నాగేశ్వరరావుగారొక లెజెంట్. లెజెండ్ తో కలిసి పని చేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని చెప్పుకొచ్చారు దర్శకుడు.

  ఈచిత్రంలో సమంత, శ్రీయ హీరోయిన్లు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.

  English summary
  To everyone’s shock Manam video songs full length are leaked in Youtube by two members of Manam team , noticing this early Manam team complained to police. Police officials blocked all those URL’s and blocked few sites that shared Manam video songs. Two people from post production are arrested by police as suspects and Nagarjuna is enquiring about the real hand behind this leak. Police are alos taking control over production room to check whether there are any pirated cd’s or pen drives.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more