»   » జూ.ఎన్టీఆర్ లాగే సునీల్ కూడా జపాన్ హీరో (ఇదిగో పోస్టర్)

జూ.ఎన్టీఆర్ లాగే సునీల్ కూడా జపాన్ హీరో (ఇదిగో పోస్టర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: రజనీకాంత్ తో మొదలెట్టిన జపాన్ క్రేజ్ తర్వాత ఎన్టీఆర్ తో మరింత ఊపు అందుకుంది. అక్కడ జనాలకు మన సినిమాలు బాగా నచ్చుతున్నట్లున్నాయి. తాజాగా సునీల్ హీరోగా రూపొందిన మర్యాద రామన్న చిత్రాన్ని సైతం అక్కడ డబ్ చేసుకున్నారు. ఈ కామెడీని అక్కడ జనాలు ఎంజాయ్ చేయటానికి సిద్దపడుతున్నారు. ఈ సినిమా కనుక హిట్టైతే మరిన్ని సునీల్ చిత్రాలు అక్కడికి డబ్బింగ్ అయ్యే అవకాసం ఉంది. అల్లు అర్జున్ వంటి వారికి కేరళ లలో క్రేజ్ ఏర్పడినట్లే సునీల్ కి జపాన్ లో నూ క్రేజ్ ఏర్పడితే మార్కెట్ అమాంతం పెరిగిపోతుంది.

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తన పంథా మార్చి తీసిన కామెడీ చిత్రం 'మర్యాద రామన్న'. సునీల్‌ ,సలోని కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం హాస్య ప్రియులను విశేషంగా అలరించింది. ఈ మధ్యనే 'మర్యాద రామన్న' తమిళతంబీలను కూడా పలకరించింది. రజనీకాంత్ విక్రమ్ సింహా చిత్రం విడుదల కాకపోవటంతో ఆ థియోటర్స్ లో ఈ చిత్రాన్ని ముందునుకున్న రోజు ని మార్చి ...ఆ రోజు విడుదల చేసేసారు. సంతానం సోలో హీరోగా చేసిన చిత్రం కావటంతో మంచి ఓపినింగ్స్ తెచ్చుకున్నాయి.

Now Suneel's Maryada Ramanna in Japanese!

అలాగే గతంలో 'మర్యాద రామన్న'హిందీ వెర్షన్ విడుదలైంది. అజయ్‌దేవగన్, సొనాక్షిసిన్హా, సంజయ్‌దత్, జుహీచావ్లా తదితరుల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'సన్నాఫ్ సర్దార్'. అజయ్‌దేవగన్ మాస్ హీరో కాబట్టి ఆయనకు తగ్గట్టుగా, హిందీ నేటివిటీకి అనుగుణంగా కథలో కొంత మసాలా జోడించి తెరకెక్కించారు దర్శకుడు అశ్విన్ ధీర్. అలాగే ఈ చిత్రం పంజాబ్ పాటియాలా నేపద్యంలో జరుగుతుంది. ప్రత్యేకమైన ఇంటిసెట్ వేసి భారీగా ఈ చిత్రాన్ని షూట్ చేసారు.

మర్యాద రామన్న చిత్రం కన్నడంలో రీమేకై ఆ మధ్యన విడుదలైంది. అయితే అక్కడ పెద్దగా ఆడలేదు. కోమల్ అనే ఆర్టిస్టు కన్నడ మర్యాద రామన్న లో సునీల్ పాత్రను చేసాడు. కీరవాణి సంగీతం అందించాడు. తెలుగు ఉన్నదున్నట్లుగా అనువదించారు. ఉపేంద్ర అక్కడ సైకిల్ వాయిస్ కి డబ్బింగ్ ఇచ్చారు. తెలుగులో రవితేజ చెప్పినట్లుగా చేసాడు. ముకేష్ రుషి..ఇక్కడ తెలుగులో నాగినీడు పాత్రను చేసాడు. నిషా అక్కడ హీరోయిన్ గా సలోని పాత్రను చేసింది.

English summary

 Rajamouli Tweeted : "Just came to know that 'Maryada Ramanna' is going to release in Japan soon. Here is the poster that my team found."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu