»   » యాక్షన్ సీన్‌తో మొదలు పెట్టిన ఎన్టీఆర్.. రచ్చ మొదలైంది!

యాక్షన్ సీన్‌తో మొదలు పెట్టిన ఎన్టీఆర్.. రచ్చ మొదలైంది!

Subscribe to Filmibeat Telugu

ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రం ఎట్టకేలకు షూటింగ్ ప్రారంభమైంది. తొలిసారి వీరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో ఇప్పటి నుంచే అంచనాలు మొదలయ్యాయి. గత ఏడాది ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయింది. పవన్ కళ్యాణ్ అతిధిగా విచ్చేసి చిత్రాన్ని ప్రారంభించారు. వరుస విజయాలతో దూసుకుపోతున్నా ఎన్టీఆర్ కు ఇది 28 వ చిత్రం.

NTR 28th movie shoot begins today

త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఈ ఏడాది ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది. త్రివిక్రమ్ తెరకెక్కించిన అజ్ఞాతవాసి చిత్రం అంచనాలు అందుకోలేక చతికిలబడింది. దీనితో ఎన్టీఆర్ చిత్రం విషయంలో త్రివిక్రమ్ పై ఒత్తిడి ఉందని చెప్పొచ్చు. త్రివిక్రమ్ ఎన్టీఆర్ ని సరికొత్త లుక్ లో చూపిస్తూ పూర్తి వినోదాత్మక చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రం నేడు షూటింగ్ ప్రారంభమైంది. యాక్షన్ సన్నివేశంతో షూట్ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

NTR 28th movie shoot begins today

ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని హారిక అండ్ హాసిని సంస్థ నిర్మిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక సంచలన హాట్ బ్యూటీ పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. దసరాకు చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు.

English summary
NTR 28th movie shoot begins today. First time Trivikram directing NTR
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X