»   » అపోహల్లో బ్రతికా, ‘జై లవ కుశ’ సక్సెస్ అయినా, కాకపోయినా చేస్తా : ఎన్టీఆర్

అపోహల్లో బ్రతికా, ‘జై లవ కుశ’ సక్సెస్ అయినా, కాకపోయినా చేస్తా : ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Jai Lava Kusa : అప్పటిదాకా జన్యునిటీ లేదు నాకు, జై లవ కుశ’సక్సెస్ అయినా, కాకపోయినా

'జై లవ కుశ' సినిమా విడుదల సందర్భంగా ఇంటర్వ్యూలో బిజీ అయిపోయిన జూ ఎన్టీఆర్ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో నివేథా థామస్‌తో కలిసి పాల్గొన్న ఎన్టీఆర్ ఆమెకు ఇచ్చిన మాట గురించి గుర్తు చేసుకున్నారు.

తీరిక సమయాల్లో కుటుంబ సభ్యుల కోసం వంటచేయడం చాలా ఇష్టమని జూ ఎన్టీఆర్ వ్యాఖ్యానించడంతో... 'నివేదా, మీకోసం తారక్ ఏమైనా వంట చేశాడా' అని యాంకర్ ప్రశ్నించింది. దీంతో తారక్ వెంటనే అందుకుని ఆమె కోసం బిసిబెలా బాత్ చేసిపెడతానని మాట ఇచ్చాను, కానీ బిజీ షెడ్యూల్ వల్ల వీలు కాలేదని తెలిపారు.

మాట నిలబెట్టుకుంటాను

మాట నిలబెట్టుకుంటాను

మొన్నటి వరకు జై లవ కుశ షూటింగ్, బిగ్ బాస్ తో బిజీగా గడిపా, ఇపుడు కాస్త ఫ్రీ అయ్యాను. సినిమా సక్సెస్ అయినా, కాక పోయినా నివేథా థామస్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను... అంటూ సరదాగా వ్యాఖ్యానించారు ఎన్టీఆర్.


కెరీర్లో అప్ అండ్ డౌన్స్ నిజమే, అదే ఇష్టం

కెరీర్లో అప్ అండ్ డౌన్స్ నిజమే, అదే ఇష్టం

నా సినిమా కెరీర్ గ్రాఫ్ ముందు నుండి అప్ అండ్ డౌన్స్ మాదిరిగానే సాగిందని, నాకు కూడా అలా జరుగడమే ఇష్టం. జీవితం ఎప్పుడూ ఒకేలా వెలుతూ ఉంటే బోర్ కొట్టేస్తుంది. పైకి కిందకి వెలుతుంటేనే ఏదో ప్రూవ్ చేసుకోవాలి, నన్ను నమ్మిన వాళ్ల కోసం ఏదైనా ప్రూవ్ చేసుకోవాలనే ఓ ఛాలెంజ్ రేజ్ అవుతుంది, నాకు అలాంటి చాలెంజ్ అంటే ఇష్టం... అని తారక్ అన్నారు.


చాలా కాలం అపోహల్లో బ్రతికాను

చాలా కాలం అపోహల్లో బ్రతికాను

నేను చాలా కాలం అపోహల్లో బ్రతికాను, నా ఫ్యాన్స్ నా నుండి ఇలాంటి సినిమాలు కోరుకుంటున్నారేమో? ప్రేక్షకులు ఇలాంటి సినిమాలు కోరుకుంటున్నారేమో? అనుకున్నప్పుడల్లా ఇంకా కిందకి వెళ్లిపోయాను. రిజల్ట్ వేరేలా వచ్చాక ఇదేంటి? ఇది కోరుకోవట్లేదా? మరి ఏం కోరుకుంటున్నారో అర్థం అయ్యేది కాదు... అని ఎన్టీఆర్ అన్నారు.


అదేంటో చెప్పండి అంటే సమాధానం లేదు

అదేంటో చెప్పండి అంటే సమాధానం లేదు

నాకు సినిమా ప్లాప్స్ ఎదురైనపుడు నా దగ్గరకు వచ్చిన వారంతా.... ఇది కాదండీ, ఇంకోటేదో చేయాలి అనేవారు. మరి అదేంటో చెప్పండి, నా నుండి ప్రేక్షకులు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అని చాలా మందిని అడిగా... చాలా మంది వద్ద సమాధానం రాలేదు అని ఎన్టీఆర్ అన్నారు.


ఆత్మ విమర్శ చేసుకున్నా

ఆత్మ విమర్శ చేసుకున్నా

నాకు నేను ఆత్మవిమర్శ చేసుకుంటున్న సమయంలో అభయ్ పుట్టడం, నా కొడుకుతో గడిపిన తర్వాత జన్యునిటీ అంటే ఏమిటో అర్థమంది. టెంపర్ విషయంలో జెన్యూన్ గా ఎఫర్టు పెట్టి చేశాను. అపుడు అర్థమైంది ఎలాంటి సినిమాలు చేయాలో. కొత్తదనమా? పాతదనమా? ముఖ్యం కాదు.... మనం జెన్యూన్ గా ఎఫర్టు పెట్టిచేస్తే మంచి ఫలితం దక్కుతుంది అని ఎన్టీఆర్ అన్నారు.


నేను, మా ఆవిడ, అబ్బాయి ఎక్కడికైనా పారిపోతాం: ఎన్టీఆర్

నేను, మా ఆవిడ, అబ్బాయి ఎక్కడికైనా పారిపోతాం: ఎన్టీఆర్

నేను, మా ఆవిడ, అబ్బాయి ఎక్కడికైనా పారిపోతాం అంటూ ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.


పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


నేను చేయలేదు, చేస్తే చెబుతా... జైల్లో తోస్తారా ఏంటి?... రూమర్లపై ఎన్టీఆర్

నేను చేయలేదు, చేస్తే చెబుతా... జైల్లో తోస్తారా ఏంటి?... రూమర్లపై ఎన్టీఆర్

జై లవ కుశ ఇంటర్వ్యూలో ఓ రూమర్ గురించి ఎన్టీఆర్ తనదైన స్టైల్ లో రిప్లయ్ ఇచ్చారు. నేను చేయలేదు, ఒక చేస్తే చెబుతా.. జైల్లో తోస్తారా ఏంటి? అంటూ వ్యాఖ్యానించారు.


పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిEnglish summary
NTR interesting comment about Nivetha Thomas and Bisibelabath. NTR said 'I will definitely make Bisibelabath for Nivetha Thomos.'
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu