twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ ‘బాద్‍ షా' ఆడియో రివ్యూ

    By Srikanya
    |

    హైదరాబాద్: జూ ఎన్టీఆర్, కాజల్ జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై బండ్ల గణేష్ నిర్మిస్తున్న చిత్రం 'బాద్‍ షా'. ఈ సినిమా పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లో విడుదల అయ్యీయి. ఎస్.ఎస్.తమన్ అందించిన సంగీతం ఇప్పటికే మార్కెట్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

    ఈ సందర్బంగా ఆదిత్య మ్యూజిక్ మేనేజింగ్ డైరెక్టర్ ఉమేష్ గుప్తా మాట్లాడుతూ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై గతం‌లో వచ్చిన ఆంజనేయులు, తీన్‍‌మార్ మరియు గబ్బర్ సింగ్ చిత్రాల పాటలు మా ఆదిత్య మ్యూజిక్ ద్వారా‌నే విడుదలై విజయవంతం అయ్యాయని తెలిపారు.

    బాద్‍ షా సినిమా పాటలు కూడా మా ఆదిత్య మ్యూజిక్ సంస్థ ద్వారా విడుదల అయినందుకు సంతోషం‌గా ఉంది. నిర్మాత బండ్ల గణేష్ బాద్‍ షా పాటల రైట్స్‌ని ఆదిత్య మ్యూజిక్ సంస్థకు ఇచ్చినందుకు థాంక్స్. తమన్ అందించిన ఆరు పాటలు చాలా బాగున్నాయి. ఎన్టీఆర్ అభిమానులకు తప్పకుండా బాద్‍ షా పాటలు నచ్చుతాయి' అన్నారు.

    పాటలు... వాటి విశేషాలు.. రివ్యూ స్లైడ్ షో లో...

    ఎన్టీఆర్ ‘బాద్‍ షా' ఆడియో రివ్యూ

    పాట: సైరో సైరో...

    సింగర్స్: రాహుల్ నంబియార్, రంజిత్, నవీన్
    సాహిత్యం: కృష్ణ చైతన్య

    ఈ పాట కొద్ది రోజుల క్రితం నెటలో విడుదలైంది. క్యాచీ ట్యూన్ తో సాగే ఈ సాంగ్ ఫుల్ జోష్ తో సోలోగా సాగుతుంది. ఈ పాట విన్నవారు.. ఎన్టీఆర్ నుంచి ఓ రేంజి స్టెప్స్ ఊహిస్తారు.

    ఎన్టీఆర్ ‘బాద్‍ షా' ఆడియో రివ్యూ

    పాట: డైమండ్ గర్ల్..
    సింగర్స్: శింబు, సుచిత్ర
    సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి

    ఈ పాట వింటూంటే తమన్ స్వరపరిచిన షాడో లో పాట గుర్తుకు వస్తోంది. అయినప్పటికీ ఈ పాట చాలా బాగా వచ్చింది. శింబు తమిళుడైనా చాలా బాగా పాడాడు. కాకపోతే ఈ మాత్రం పాడటానికి మన తెలుగులో ఎవరూ సింగర్స్ లేరా అనే డౌట్ సైతం వస్తుంది.

    ఎన్టీఆర్ ‘బాద్‍ షా' ఆడియో రివ్యూ

    పాట: బాద్‍ షా...
    సింగర్స్: హేమచంద్ర, షేపాలీ అల్వారెస్, గీతా మాధురి
    సాహిత్యం: విశ్వ

    ఇది సినిమాలో టైటిల్ సాంగ్... గీతా మాధురి సింగింగ్ స్టైల్ రొటీన్ గానే సాగుతుంది. కానీ ఫ్యాన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేసేలా ఈ పాటను రూపొందించారు.

    ఎన్టీఆర్ ‘బాద్‍ షా' ఆడియో రివ్యూ

    పాట: బంతిపూల జానకి..
    సింగర్స్: దలేర్ మెహందీ, రవీనా రెడ్డి
    సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి

    ఈ మాస్ సాంగ్ ప్రత్యేకంగా ఎన్టీఆర్ ఫెరఫార్మ్ చేయటానికి ఉద్దేశించినట్లుగా ఉంది. గతంలో ఎన్టీఆర్ కు పాడిన దలేర్ మెహందీ మరో సారి తన స్వరంతో పాటకు కిక్ ఇచ్చి నిలబెట్టారు.

    ఎన్టీఆర్ ‘బాద్‍ షా' ఆడియో రివ్యూ

    పాట: వెల్‌కం కనకం....
    సింగర్స్: సౌమ్యారావు, జస్పీట్ జాస్
    సాహిత్యం: భాస్కర భట్ల

    ఇది సినిమాలో వచ్చే ఐటం సాంగ్. పూర్తి మాస్ మసాలా సాహిత్యం భాస్కర భట్ల అందించారు. సౌమ్యారావు కూడా సాహిత్యానికి తగిన ఎఫెక్ట్ తో పాడారు. అయితే దూకుడులో ఐటం సాంగ్ పువాయ్..పువాయ్ గుర్తుకు వస్తుంది.

    ఎన్టీఆర్ ‘బాద్‍ షా' ఆడియో రివ్యూ

    పాట: రంగోలి రంగోలి.......
    సింగర్స్: బాబా సెహగల్, ఎం.ఎం మనసి
    సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి

    ఈ ఆల్బంలో ఎన్టీఆర్ కు బాగా నచ్చిన పాట ఇది అని చెప్తున్నారు. ఈ పాట కోసం ఎన్టీఆర్ దాదాపు 50 పాటలు దాకా విని సెలక్ట్ చేసాడని చెప్తున్నారు. అయితే సింగర్స్ మారతారు కానీ తమన్ సంగీతం ఒకలా ఉంటుందన్నట్లు ఈ పాట మాస్ బీట్ తో సాగుతుంది. ఈ పాటకు ఎన్టీఆర్ అదిరిపోయే స్టెప్స్ వేసాడని సమాచారం.

    ఫైనల్ గా తమన్ పూర్తిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ పాటలు రూపొందించారని అర్దమవుతుంది. మ్యూజిక్ లవర్స్ ని ప్రక్కన పెడితే ఈ పాటలు బాగానే ఎక్కుతాయి. ఇక దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ 'బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు.

    English summary
    Junior NTR starrer Telugu action-drama "Baadshah" released on Sunday evening. Thaman targeted only NTR fans and they will like Sairo and Badshah. Nothing particular for other movie lovers. However one get the feeling this is the lowest quality music album for NTR. Only fans can make it a hit. Thaman should try something new and if he still gets big offers with this mediocre music then it is something else than music that is working for him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X