For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సాలిడ్ గా సౌండ్ రేపుతున్న 'బాద్‌ షా' స్టిల్స్(ఫోటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్: ఎన్టీఆర్‌ హీరోగా నటించిన చిత్రం 'బాద్‌ షా'. కాజల్‌ హీరోయిన్. శ్రీను వైట్ల దర్శకుడు. ఈ చిత్రంలో స్టిల్స్ రీసెంట్ గా మీడియాకు విడుదల చేసారు. అవి అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి. సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ముఖ్యంగా కాజల్,బ్రహ్మానందం కాంబినేషన్ లో ఉన్న స్టిల్స్ బాగా పాపులర్ అవుతున్నాయి.

  ఇక వచ్చే నెల 5న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు నిర్మాత బండ్ల గణేష్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ చిత్రం మార్చి 29న సెన్సార్ జరగనుంది. ఇప్పటికే ఈ చిత్రం టీజర్ ద్వారా విడుదలైన డైలాగులు ఫ్యాన్స్ ను బాగా అలరిస్తున్నాయి. ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం 'బాద్‌ షా'. ఈ చిత్రాన్ని హిందీలోనూ రీమేక్ చేయటానికి నిర్మాత బండ్ల గణేష్ నిర్ణయించారు.

  ''ఎన్టీఆర్‌లోని నటుణ్ని కొత్త తరహాలో చూడొచ్చు. ఆయన గెటప్‌, పలికే సంభాషణలు అందర్నీ అలరిస్తాయి. ఈ చిత్రానికి మహేష్‌బాబు వాయిస్‌ ఓవర్‌ చెప్పడం ఆనందంగా ఉంది. ఇటీవల విడుదలైన పాటలకు చక్కటి స్పందన వస్తోంది. తమన్‌ స్వరాలు ఎన్టీఆర్‌ అభిమానులకు బాగా నచ్చాయి. ఈ నెలాఖరున ప్లాటినం డిస్క్‌ కార్యక్రమం నిర్వహిస్తాము''అన్నారు

  స్లైడ్ షో లో... 'బాద్‌ షా' స్టిల్స్... సినీ విశేషాలు

  కాజల్, ఎన్టీఆర్ మధ్య కెమిస్ట్రీ బాగా పండిందని చెప్తున్నారు.

  ఈ చిత్రంలో విలన్ గా నెగిటివ్ పాత్రలో యంగ్ హీరో నవదీప్ కనిపించనున్నారు. ఈ పాత్ర సినిమాలో ఊహించని విధంగా సాగి నవ్వులు పండిస్తూ కీలకమై నిలుస్తుంది అంటున్నారు.

  గణేష్ ట్వీట్ చేస్తూ... "నేను బాద్‌ షా చిత్రం సక్సెస్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఈ సినిమాను మా బ్రదర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో హిందీలో రీమేక్ చేస్తాను!!," అన్నారు.

  ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పాత్ర కూడా డిఫెరెంట్ గా ఉంటుంది.

  ఎన్టీఆర్ పాత్ర గురించి చెబుతూ నిర్మాత బండ్ల గణేష్... సేవకుడిగా కాదు.... పాలకుడిగా బతకడమే అతనికిష్టం. బుల్లెట్‌లా కాదు, దాని లక్ష్యాన్ని శాసించే ట్రిగ్గర్‌లా ఉండడమే అతనికిష్టం. అందుకే తనకు తానే 'బాద్‌ షా' అని ప్రకటించుకొన్నాడు. ఇంతకీ ఎవరతను? అతని లక్ష్యమేమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు బండ్ల గణేష్‌.

  ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందిస్తున్న మహేష్ బాబు ఇటీవలే ఆ పని పూర్తి చేసారు.

  మార్చి 29 వరకు పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని అదే రోజున ఈ చిత్రం సెన్సార్‌కు వెళ్ల నుందని తెలుస్తోంది.

  ఏప్రిల్ నెలలో విద్యా సంస్థలకు హాలీడేస్ మొదలవ్వనున్న నేపథ్యంలో ఏప్రిల్ 5న సినిమాను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

  ఈ చిత్రం కోసం ఇప్పటి నుంచే భారీగా థియేటర్లు కేటాయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు శ్రీను వైట్ల ‘బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు.

  రికార్డు స్థాయి కలెక్షన్స్ సాధించడమే లక్ష్యంగా నిర్మాతలు విడుదల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

  చిత్రంలో బ్రహ్మానందం కామెడీ హైలెట్ అంటున్నారు. బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  ఇప్పటికే ఈ చిత్రం ఆడియో విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి సంగీతం: థమన్ ఎస్.ఎస్, మాటలు: కోనా వెంకట్, గోపీమోహన్, కెమెరా: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

  English summary
  Baadshah is an upcoming Telugu action film directed by Srinu Vaitla. The film is produced by Bandla Ganesh under his Parameshwara Art Productions banner. It stars Jr. NTR and Kajal Aggarwal in the lead roles and is their second film together after Brindavanam. The soundtrack was composed by S. Thaman, who will be working with Srinu Vaitla for the second time in his career.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X