twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో లైవ్: జమున ఆ మాట అనగానే.. చేత్తో ఆమె నోటిని మూసేసిన బాలయ్య!

    |

    మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి సంబంధించిన ప్రీ రీలీజ్ ఈవెంట్ కనివీని ఎరుగని రీతిలో నిర్వహించారు. సినీ రంగానికి చెందిన ప్రముఖుంలా ఈ వేడుకకు హాజరయ్యారు.

    ముందు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. నందమూరి తారక రామరావు నలుగురు కూతుళ్లు గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేయించారు.

    జమున నోటిని చేత్తో మూసేసిన బాలయ్య

    జమున నోటిని చేత్తో మూసేసిన బాలయ్య

    జమున మాట్లాడుతూ.. బిడ్డలు తల్లిదండ్రుల పేరు నిలబెట్టడం ఈ రోజుల్లో చాలా అరుదైన విషయం. బాలయ్య తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడే కాదు తండ్రిని మించిన అని అంటుండగానే బాలయ్య ఆమె నోటిని చేత్తో మూసేయడం విశేషం. బాలయ్య చేయి అడ్డు తీశాక.. ఆమె నవ్వుతూ తండ్రిని మించిన తనయుడు ఎందుకు అన్నానంటే.. ఎన్టీఆర్ గారు పౌరాణికాలు, జానపదాలు ఇలా కొన్ని వందల చిత్రాలు చేశారు. అలాంటి ఎన్టీఆర్ జీవిత చరిత్రని మరోమారు మనకు చూపించడం పెద్ద సాహసం అని జమున అన్నారు.

    పునాది ఎక్కడ పడిందో.. సుమంత్!

    పునాది ఎక్కడ పడిందో.. సుమంత్!

    సుమంత్ ఆడియో వేడుకలో మాట్లాడుతూ.. బాలకృష్ణగారిని నేను ముద్దుగా మావయ్య అని పిలుస్తుంటాను అని సుమంత్ తెలిపాడు. అక్కినేని కుటుంబం తరుపున నందమూరి అభిమానులందరికి అభినందనలు. ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావించా. తాత గారి పాత్రని భాద్యతగా తీసుకున్నా అని సుమంత్ తెలిపాడు. నందమూరి, అక్కినేని కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. ఆ అనుబంధానికి పునాది ఎక్కడ పడింది అనేది ఈ చిత్రంలో తెలుస్తుంది అని సుమంత్ తెలిపాడు. నందమూరి అభిమానులంతా పండగ చేసుకునే చిత్రం ఇది అని సుమంత్ తెలిపాడు.

    ఎన్టీఆర్ ట్రైలర్ చూసి ఎమోషనల్ అయ్యా, గర్వంగా ఉంది: విద్యాబాలన్

    ఎన్టీఆర్ ట్రైలర్ చూసి ఎమోషనల్ అయ్యా, గర్వంగా ఉంది: విద్యాబాలన్

    విద్యాబాలన్ మాట్లాడుతూ... తెలుగులో ఇది నా మొదటి సినిమా. ఇక్కడ నా కెరీర్ ఇంత మంచి సినిమాతో మొదలవ్వడం ఆనందంగా ఉంది. ట్రైలర్ చూసిన తర్వాత ఎమోషనల్ అయ్యాను. తెరపై కనిపించేది బాలయ్య అని నమ్మలేకపోతున్నాను. పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. బాలయ్య ఎనర్జీ, పాషన్ అద్భుతం. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఇలాంటి సినిమాలో చేసినందుకు గర్వంగా ఉంది. ఈ సినిమా వల్ల బాలకృష్ణ గారి ఫ్యామిలీ నా ఫ్యామిలీగా అయిపోయిది. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఇక్కడ నాకో ఫ్యామిలీ ఉందనే ధైర్యం వచ్చింది అన్నారు.

    ఫస్ట్‌లుక్ చూసిన తర్వాత నేను కూడా అనుమానపడ్డాను: జయసుధ

    ఫస్ట్‌లుక్ చూసిన తర్వాత నేను కూడా అనుమానపడ్డాను: జయసుధ

    ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ... ‘‘ఈ వేడుక చూస్తుంటే ఇక్కడ ఎన్టీ రామారావుగారు ఉన్నట్లే అనిపిస్తోంది. నేను చాలా అదృష్టవంతురాలిని. ఆయనతో దాదాపు 20కంటే ఎక్కువ చిత్రాలు చేశాను. ఎన్టీఆర్ మహానాయుడు, కథానాయకుడు బయోపిక్ తీస్తున్నారనే విషయం తెలియగానే ఎలా ఉంటుందో అనుకున్నాను. బాలకృష్ణ గారిని ఇండస్ట్రీలో ప్రేమతో, అభిమానంతో బాల అని పిలుస్తాము... ఆయన ఇందులో రామారావుగారి క్యారెక్టర్ చేయబోతున్నారు అనగానే ఫస్ట్ లుక్ చూడగానే నాకే అనుమానం వచ్చింది. నిజంగా రామారావుగారిని చూసినట్లే ఉంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది''అన్నారు.

    నా జీవితంలో అనుకోలేదు.. రానా

    నా జీవితంలో అనుకోలేదు.. రానా

    రానా మాట్లాడుతూ.. బాలయ్య నటించిన కథానాయకుడు చిత్రం విడుదల రోజు 1984, డిసెంబర్ 14న తాను జన్మించానని రానా తెలిపాడు. తాను మొట్టమొదట చూసిన సినిమా షూటింగ్ కూడా బాలయ్యదే అని రానా తెలిపాడు. ఆయన నటించిన రాము చిత్ర షూటింగ్ మా ఇంట్లోనే జరిగింది. ముందుగా చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలపాలి. మా కోసం ఆయన సమయం కేటాయించారు. నేను పోషించిన ఈ పాత్రకు మొదటి ప్రేక్షకుడు ఆయనే. ఆయనకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఈ చిత్రంలో నటించడం నాకు దక్కిన గొప్ప అవకాశం అని రానా తెలిపాడు.

    బాలయ్య పక్కన రకుల్ ప్రీత్ సింగ్ జోకులు..

    బాలయ్య పక్కన రకుల్ ప్రీత్ సింగ్ జోకులు..

    రకుల్ ప్రీత్ సింగ్ ఆడియో వేడుకలో సరదాగా మాట్లాడింది. శ్రీదేవి పాత్రలో నటించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. క్రిష్ నన్ను నమ్మి ఈ పాత్రలో నటించే అవకాశం ఇచ్చారు. ఇంతటి గొప్ప చిత్రంలో నటించే అవకాశం కల్పించిన బాలకృష్ణగారికి కృతజ్ఞతలు అంటూ రకుల్ ప్రీత్ తెలిపింది. బాలకృష్ణ గారు వాస్తవానికి శ్రీదేవితో సినిమాలు చేయలేదు.. కానీ ఈ చిత్రంలో చేశారు అంటూ సరదాగా వ్యాఖ్యానించింది. నేను బాగా చేశానా లేదా అంటూ పక్కనే ఉన్న బాలయ్యని అడిగింది.

    రామారావుగారు ఎన్నో మంచి పనులు చేశారు: ఎన్టీఆర్ ఆడియో లాంచ్‌లో కృష్ణం రాజు

    రామారావుగారు ఎన్నో మంచి పనులు చేశారు: ఎన్టీఆర్ ఆడియో లాంచ్‌లో కృష్ణం రాజు

    ఈ సందర్భంగా కృష్ణం రాజు మాట్లాడుతూ... ఈ రోజు చాలా గొప్పదినం. ఎన్టీరామారావు లాంటి మహానటుడు, దైవాంశసంభూతుడిపై సినిమా తీస్తున్నందుకు మా బాలకృష్ణను అభినందించాలో తెలియడం లేదు. నేను మొట్టమొదటి సినిమా కృష్ణవేణి చేసినపుడు పిలవడానికి వెళితే షూటింగ్ కేన్సిల్ చేసుకుని రామారావుగారు వచ్చారు. ఓసారి మేము కలిసి ఫ్లైట్లో ఊటి వెళుతుంటే పార్టీ పెడదామనుకుంటున్న విషయం చెప్పారు. ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం కృషిచేయబోతున్నట్లు, ఇక వారికోసమే కష్టపడబోతున్నట్లు చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఆయన అభిమానులకు, సన్నిహితులకు, ప్రజలకు ఎంతో మంచి చేశారు. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరూ అదృష్ట వంతులు. ఈ ఫంక్షన్లో నాకు మాట్లాడే అవకాశం రావడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నట్లు కృష్ణంరాజు తెలిపారు.

    బాలయ్య సాహసం చేస్తున్నాడు: పురంధేశ్వరి

    బాలయ్య సాహసం చేస్తున్నాడు: పురంధేశ్వరి

    ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ... సోదరుడు బాలకృష్ణ నా కంటే చిన్నవాడు కాబట్టి నమస్కారం చెప్పలేను. ఆశీస్సులైతే అందిస్తున్నాను. చీమలు సైతం దూరనటువంటి చిట్టడవిలో ఎన్ని చెట్లు ఉన్నా... మంచి పరిమళం అందించే ఒక చెట్టు ఆ వనం అంతా సుగంధమయం అవుతుంది. నందమూరి తారక రామారావుగారి జీవితం, జననం అటువంటిదని విశ్వసిస్తున్నాను. కేవలం రేచర్ల గోత్రానికి మాత్రమే కాదు, నందమూరి వంశస్తులకు మాత్రమే కాదు... తెలుగు ప్రజలకు, తెలుగు జాతికి ఒక గుర్తింపు తెచ్చిన మహానాయకుడు, కథానాయకుడు ఆయన. ఆయన ఎంతో మందికి స్పూర్తి, పేదలకు ఆపన్న హస్తం, విశ్వవిఖ్యాతం. వారి జీవితాన్ని.. ప్రస్తానాన్ని సినిమాగా తెరపైకి తీసుకురావడం సాహసోపేతం అని చెబుతాను. సాధారణంగా కథల్లో మన మనోభావాలు, ఆలోచనలు జొప్పించడం అనేది సర్వసాధారణం. అయితే నాన్నగారి జీవితంలో ప్రతి పేజీ, ప్రతి పదం, ప్రతి అక్షరం ప్రతి తెలుగు వాడికి తెలిసిన నేపథ్యంలో అది నిజంగా సాహసం అని భావిస్తున్నాను. సొదరుడు బాలకృష్ణ చేస్తున్నా సాహసానికి మనస్తూర్తిగా అభినందిస్తున్నాను. నాన్నగారు గుర్తొచ్చే విధంగా ఆహార్యం, డైలాగ్ డెలివరీ మార్చుకోవడం ఆకట్టుకుంది. విద్యాబాలన్ గారు మా తల్లిగారి క్యారెక్టర్ వేశారు. వారు దాంట్లో జీవించారు. దర్శకుడు క్రిష్ గారికి, చిత్ర బృందానికి హృదయ పూర్వక అభినందలు.

    చిన్నప్పటి నుంచి రామారావుగారి అభిమానిని: కృష్ణ

    చిన్నప్పటి నుంచి రామారావుగారి అభిమానిని: కృష్ణ

    ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ... చిన్నప్పటి నుంచి రామారావుగారి అభిమానిని. డిగ్రీ పూర్తయిన తర్వాత ఆయన్ను చూసేందుకు మద్రాస్ వెళ్లాను. వారిని కలిసి సినిమాల్లో నటించే ఇంట్రస్ట్ ఉంది, మీ పిక్చర్లో వేషం ఉంటే ఇవ్వండి అన్నాను. అపుడు ఆయన నువ్వు చిన్నపిల్లాడిలా ఉన్నావు, రెండు మూడు సంవత్సరాలు ఆగితే తప్పకుండా నీకు వేషం ఇస్తాం, నువ్వు పనికొస్తావు అన్నారు. ఈ లోగా ఆదుర్తి సుబ్బారావుగారు నన్ను తెనెమనసులు చిత్రంలో హీరోగా చేశారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఐదో పిక్చర్ ‘స్త్రీ జన్మ' ద్వారా ఫస్ట్ టైమ్ నా అభిమాన కథానాయకుడు రామారావు తమ్ముడిగా నటించే అవకాశం లభించింది. ‘స్త్రీ జన్మ' తర్వాత ‘నిలువు దోపిడి'. ‘విచిత్ర కుటుంబం' మూడు పిక్చర్లు హిట్టయ్యాయి. ఆ తర్వాత ‘పండంటి కాపురం' 100 డేస్‌కు ఫంక్షన్‌కు వచ్చిన రామారావుగారు వచ్చారు. ఆ సమయంలో నేను స్టేజీపైనే నా నెక్ట్స్ పిక్చర్ రామారావుగారితో తీయాలని ఉందని అనౌన్స్ చేశాను. వారు కూడా స్టేజీమీదే బ్రదర్ పిక్చర్లో యాక్ట్ చేస్తాను, సబ్జెక్ట్ చూసుకోండి అని చెప్పారు. ఆ తర్వాత దేవుడు చేసిన మనుషులు సబ్జెక్ట్ వారికి వినిపిస్తే చాలా బావుందని ఒకే షెడ్యూల్ లో పూర్తి చేశారు. ఆ చిత్రం అఖండ విజయం సాధించింది. రామారావుగారితో అన్ని పిక్చర్లు నేను తమ్ముడిగానే చేశాను. బాలకృష్ణ మొన్న వచ్చి ఈ సినిమాలో ఆయన వేసిన గెటప్‌లు చూపించారు. వందశాతం రామారావుగారి మాదిరిగానే కనిపించారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రం అద్భుత విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. అన్నారు.

    నా తమ్ముడు బాలయ్య అంటే అపారమైన ప్రేమ: గారపాటి లోకేశ్వరి

    నా తమ్ముడు బాలయ్య అంటే అపారమైన ప్రేమ: గారపాటి లోకేశ్వరి

    ఈ సందర్భంగా ఎన్టీఆర్ కూతురు గారపాటి లోకేశ్వరి మాట్లాడుతూ... ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని విష్ చేశారు. అందరి సమిష్టి కృషి వల్లే ఈ చిత్రం వస్తుందన్నారు. నా తమ్ముడు బాలయ్య అంటే అపారమైన ప్రేమ. అందుకే నాకు మాటలు రావడం లేదు. ఈ చిత్రం బాలయ్యకు పెద్ద విజయం తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను అన్నారు.

    వేడుకకు ఎన్టీఆర్ కుటుంబం

    వేడుకకు ఎన్టీఆర్ కుటుంబం

    ఎన్టీఆర్ బ‌యోపిక్ ఆడియో, ట్రైల‌ర్ లాంఛ్ వేడుక‌లు శుక్రవారం (డిసెంబ‌ర్ 21) గ్రాండ్‌గా ఫిల్మ్ న‌గ‌ర్ లోని JRC క‌న్వెన్ష‌న్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు ఎన్టీఆర్ కుటుంబంతో పాటు సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణతో పాటు సినీ రంగానికి చెందిన ప్రముఖులందరూ హాజరయ్యారు.

    నంద‌మూరి బాల‌కృష్ణ‌, విద్యాబాల‌న్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని క్రిష్ జాగ‌ర్ల‌మూడి తెర‌కెక్కిస్తున్నారు. ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సాయి మాధ‌వ్ బుర్రా మాట‌లు అందించారు.

    English summary
    NTR kathanayakudu traile released by NTR 4 daughters. The audio and trailer launch event of ‘NTR’ biopic is held on December 21st at JRC Convention in Filmnagar, Hyderabad. Starring Nandamuri Balakrishna, Vidya Balan in the lead roles, the film is being directed by Krish Jagarlamudi. MM Keeravani has composed music.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X