twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘కీ పాయింట్ మిస్సయ్యాం, ఎన్టీఆర్ బయోపిక్ ఖరీదైన గుణపాఠం’

    |

    ఇండియన్ సినీ పరిశ్రమలో బయోపిక్ చిత్రాల జోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదలైన విజయం సాధించాయి, మరికొన్ని పరాజయం పాలయ్యాయి. ఇంకాకొన్ని చిత్రీకరణ దశలో ఉన్నారు. అయితే బయోపిక్ చిత్రాల్లో అత్యంత నిరాశ పరిచిన మూవీ తెలుగులో ఈ ఏడాది వచ్చిన 'ఎన్టీఆర్ బయోపిక్'. బాలయ్య ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరస్కరణకు గురైంది. మొదటి భాగం విడుదలైనప్పుడే డిస్ట్రిబ్యూర్లు నష్టపోయారు, రెండో భాగం ద్వారా వారి నష్టాలను పూడ్చాలని భావించారు కానీ వర్కౌట్ కాలేదు.

    వరుస బయోపిక్ చిత్రాలు నిర్మిస్తున్న విష్ణు ఇందూరి

    వరుస బయోపిక్ చిత్రాలు నిర్మిస్తున్న విష్ణు ఇందూరి

    ఎన్టీఆర్ బయోపిక్ నిర్మించిన వారిలో విష్ణు ఇందూరి కూడా ఒకరు. అయితే ఆ సినిమా పరాజయం పాలైందని బయోపిక్ చిత్రాలను నిర్మించడం ఆయన ఆపలేదు. ప్రస్తుతం జయలలిత బయోపిక్, 1983 క్రికెట్ వరల్డ్ కప్, కపిల్ దేవ్ జీవితం ఆధారంగా వస్తున్న ‘83 అనే మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    ఎన్టీఆర్ బయోపిక్ మూవీలో కీ పాయింట్ మిస్సయ్యాం

    ఎన్టీఆర్ బయోపిక్ మూవీలో కీ పాయింట్ మిస్సయ్యాం

    ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు ఇందూరి ‘ఎన్టీఆర్ బయోపిక్' గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోవడానికి అనేక కారణాలున్నాయి. వారు ఆశించిన 'కీ' పాయింట్ ఏదో మేము సినిమాలో మిస్ చేశామని తర్వాత అర్థమైందిని విష్ణు చెప్పుకొచ్చారు.

    ఇది మాకు ఖరీదైన గుణపాఠం

    ఇది మాకు ఖరీదైన గుణపాఠం

    ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా కాకుండా ఒకే సినిమాగా వస్తే వర్కౌట్ అయ్యేదేమో, కానీ ఈ విషయం మేము ముందు ఊహించలేదు. కారణాలు ఏవైనా ‘ఎన్టీఆర్ బయోపిక్' మాకు ఒక ఖరీదైన గణపాఠంలా నిలిచిపోయిందని విష్ణు ఇందూరి చెప్పుకొచ్చారు.

    83 మూవీతో విష్ణు బిజీ బిజీ

    83 మూవీతో విష్ణు బిజీ బిజీ

    ప్రస్తుతం ‘83' మూవీ షూటింగ్ చివరి దశలో ఉండటంతో విష్ణు ఇందూరి ఈ మూవీకి సంబంధించిన పనులతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ చిత్రం మొత్తం కూడా 1983 వరల్డ్ కప్, అప్పటి టీం కెప్టెన్ కపిల్ దేవ్ చుట్టూ తిరుగుతుంది.

    English summary
    Producer Vishnu Induri said NTR Biopic is a costly lesson for us. He said that we missed the important point in the movie, which is why it was rejected by the audience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X