బాలీవుడ్ నుంచి బాలకృష్ణకు భారీ ఆఫర్.. 150 కోట్లపై కన్నేసిన ‘ఎన్టీఆర్’!
దివంగత నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌గా బాలకృష్ణ, ఎన్టీఆర్ సతీమణిగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నారు. నవరస నటనా సార్వభౌమ సత్యనారాయణ కీలకపాత్రలో కనిపించనున్నారు. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ శ్రీదేవి పాత్రలో నటిస్తున్నది. ఇలాంటి విశేషాలు కలిగిన ఈ చిత్రం నాచారంలోని రామకృష్ణ సినీ స్టూడియోలో శరవేగంగా తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకొన్నది.

బాలకృష్ణ హ్యాపీ
గౌతమి పుత్ర శాతకర్ణి ఫేం దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తున్న ఈ చిత్రంలో భారీ సంఖ్యలో ప్రముఖ నటులు భాగస్వామ్యం అవుతున్నారు. తొలి షెడ్యూల్ రషెస్‌ను చూసిన బాలకృష్ణ సంతృప్తి చెందడమే కాకుండా ఆనందంలో కూడా ఉన్నారట.

బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్
ఎన్టీఆర్ బయోపిక్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉండగానే భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ ఆఫర్లు వస్తున్నట్టు సమాచారం. బాలీవుడ్‌కు చెందిన ప్రొడక్షన్ హౌస్, పంపిణీదారులు భారీ ఆఫర్‌ను ప్రపోజ్ చేశారట. సుమారు రూ.80 కోట్ల ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది.

తిరస్కరించిన బాలకృష్ణ
అయితే బాలీవుడ్ సంస్థ ఇచ్చిన బాలీవుడ్ ఆఫర్‌ను బాలయ్య ఇంకా ఆమోదించలేదని, దాదాపు తిరస్కరించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. సినీ వర్గాల ప్రకారం.. ఎన్టీఆర్ బయోపిక్‌కు రూ.150 కోట్ల మేర ఆఫర్ దక్కవచ్చనే అంచనా వేస్తున్నట్టు సమాచారం.

ఎన్టీఆర్ ప్రమాణం చేసిన రోజే
ఎన్టీఆర్ బయోపిక్‌ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ జీవితంలో చోటుచేసుకొన్న విశేష సంఘటన రోజున విడుదల చేయాలని ప్లాన్ చేశారు. 1983లో ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణాస్వీకారం చేసిన రోజైన జనవరి 9న రిలీజ్ చేయాలని నిర్ణయించారు.


Click it and Unblock the Notifications











