»   » సినిమా చచ్చిందో, బ్రతికిందో ప్రేక్షకులను తేల్చనివ్వండి: జూ ఎన్టీఆర్

సినిమా చచ్చిందో, బ్రతికిందో ప్రేక్షకులను తేల్చనివ్వండి: జూ ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Jai Lava Kusa Success Meet : NTR counters film critics strongly

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'జై లవ కుశ' చిత్రం మంచి విజయం సాధించిన నేపథ్యంలో చిత్ర యూనిట్ అంతా కలిసి జై లవ కుశ జయోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.... అభిమానులందరినీ తల ఎత్తుకునేలా చేశానని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్లకు థాంక్స్ చెప్పారు.

ఒక వేళ ఈ సినిమా మీరు తల ఎత్తుకునేలా లేదని భావిస్తే చెప్పండి..ఈ చిత్రం కాకపోతే మరోటి, అదీ కాకపోతే ఇంకోటి.. ఇలా మీ కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాను. అభిమానుల కోసం ఎంత కష్టపడటానికైనా సిద్ధంగా ఉన్నాను అని ఎన్టీఆర్ తెలిపారు.

కొందరు రివ్యూ రైటర్లపై ఎన్టీఆర్ ఇలా...

కొందరు రివ్యూ రైటర్లపై ఎన్టీఆర్ ఇలా...

మనం హాస్పిటల్ కు వెళతాం. మనకు సంబంధించిన వ్యక్తి చాలా క్రిటికల్ కండీషన్ లో ఉంటారు. ఎమర్జెన్సీ వార్డులో పెట్టి ఎంతో నేర్పు ఉన్న వైద్యులు వైద్యం చేస్తుంటారు. డాక్టర్ ఏం చెబుతారో ఎదురు చూస్తున్న మనకు కొందరు దారిన పోయే దానయ్యలు.... పేషెంట్ బ్రతకడు, పోతాడు అని మనల్ని భయపెడుతుంటారు. ఆ దారినపోయే దానయ్యలు సినిమా రివ్యూ రైటర్లు అంటూ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు.


ఇలాంటి పరిస్థితి తెలుగు ఇండస్ట్రీలో...

ఇలాంటి పరిస్థితి తెలుగు ఇండస్ట్రీలో...

బాధలో ఉన్న వాళ్లకు ధైర్యం ఇవ్వకపోగా, చావుబతుకుల్లో ఉన్న వాడిని చంపేయడం, వాడిపై ఆశలు పెట్టుకున్నవాళ్లను ఇంకా చంపేయడం చేస్తుంటారు. ఇలాంటి ప్రక్రియ ఈ మధ్య మన తెలుగు ఇండస్ట్రీలో మొదలైంది... అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.


ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పేషెంటే...మా సినిమా

ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పేషెంటే...మా సినిమా

ఒక చిత్రం విడుదలైతే అది ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పేషెంట్ లాంటిది. వాడు బ్రతుకుతాడా? చస్తాడా? అని ఎదురు చూసే చుట్టాలం మేము. డాక్టర్లు ప్రేక్షకులు. దారినపోయే దానయ్యలు కొంత మంది సినీ విశ్లేషకులు.... అంటూ ఎన్టీఆర్ తనదైన వ్యాఖ్యలు చేశారు.


సినిమాను తేల్చనివ్వండయ్యా...

సినిమాను తేల్చనివ్వండయ్యా...

అరే... అసలు సినిమాను తేల్చనివ్వండయ్యా, వాళ్లు చెబుతారు. చచ్చిపోయిందని వాళ్లు చెప్పారనుకోండి ఓకే. అంగీకరించడానికి రెడీ. వదలుకుంటాం ఆశలు. అందరూ ఏదో ఒక సమయానికి పోవాల్సిందే. వాళ్లు పోకుండా, క్లారిటీ రాకుండా మీరు(క్రిటిక్స్) మధ్యలో వచ్చి పోతాడు, బ్రతుకుతాడు అని చెప్పడం కాదు, ఆ విషయం ప్రేక్షకులను చెప్పనివ్వండి అని ఎన్టీఆర్ అన్నారు.


కేవలం మాకే కాదు, అందరికీ ఇలానే...

కేవలం మాకే కాదు, అందరికీ ఇలానే...

ఇది కేవలం మాకు జరుగుతుందని చెప్పడం లేదు. అందరికీ జరుగుతున్న ప్రక్రియ ఇది. దయచేసి ఒక చిత్రం వచ్చినపుడు ప్రేక్షకులను ముందు స్పందించనివ్వండి.... అని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు.


ఒక్కసారి ఆలోచించండి

ఒక్కసారి ఆలోచించండి

అఫ్ కోర్స్ డెమొక్రసీ... ఎవ్వరినీ ఎవ్వరూ ఆపలేరు ఇక్కడ. ఎవరికైనా వాక్ స్వాతంత్రం ఉంది. అది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. కానీ మనం మాట్లాడే ఒక మాట అవతలి వ్యక్తికి ఉన్నటువంటి ఆశ ఎంత వరకు దిగజారిపోతుందో ఒక్కసారి ఆలోచించండి. నేను మాట్లాడిన దాంట్లో తప్పులుంటే క్షమించండి. అర్థమే లేకుంటే వదిలేయండి, నా బాధను ఒక్కసారి మీ అందరికీ వెల్లడిద్దామని అనుకున్నాను... అని ఎన్టీఆర్ తెలిపారు.


అందరికీ థాంక్స్

అందరికీ థాంక్స్

ఎనీ వే.... ఎమర్జెన్సీ వార్డుకు వచ్చినటువంటి మా ‘జై లవ కుశ' చిత్రం హెల్త్ చాలా బావుందని తేల్చి చెప్పిన డాక్టర్లైన మా ప్రేక్షక దేవుళ్లందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ చిత్రాన్ని ప్రజల్లోకి వెళ్లేలా చేసిన మీడియా మిత్రులందరికీ తలవంచి పాదాబివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అని ఎన్టీఆర్ ముగించారు.


English summary
Jr NTR counters film critics strongly at Jai Lava Kusa Success Meet. He said some critics won't give time even to get the opinion of audience.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu