For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శరీరంలో మలినాలు: థెరపీ కోసం విదేశాలకు ఎన్టీఆర్!

  By Bojja Kumar
  |

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'జై లవ కుశ' మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని సినిమా ప్రమోషన్లలో బిజీ అయిపోయారు. మరో వైపు ఆయన హోస్ట్ చేస్తున్న 'బిగ్ బాస్ తెలుగు' రియాల్టీ షో కూడా చివరి దశకు చేరుకోవడంతో అందుకు సంబంధించిన వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు.

  సెప్టెంబర్ 21వ తేదీన ఎన్టీఆర్ నటించిన 'జై లవ కుశ' సినిమా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. మరో వైపు 24వ తేదీతో 'బిగ్ బాస్ తెలుగు' తొలి సీజన్ ముగియబోతోంది. ఇంతకాలం ఈ రెండు షూటింగులతో తీరిక లేకుండా గడుపుతున్న కాస్త రిలీఫ్ కాబోతున్నారు.

  విదేశీ ట్రిప్

  విదేశీ ట్రిప్

  ‘జై లవ కుశ' తర్వాత ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఉండనుంది. జనవరి చివర్లో లేదా, ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రారంభం కాబోతోంది. ఈ గ్యాపులో ఎన్టీఆర్ విదేశీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

  ఒంట్లో మలినాలు తొలగించుకునేందుకు థెరపీ

  ఒంట్లో మలినాలు తొలగించుకునేందుకు థెరపీ

  ‘జై లవ కుశ' షూటింగ్ ముగిసిన వెంటనే ఎన్టీఆర్ యూరఫ్ వెలుతున్నట్లు సమాచారం. అక్కడే దాదాపు ఓ నెల రోజులు మకాం వేయనున్నారని, శరీరంలో పేరుకుపోయిన మలినాలను తొలగించుకునేందుకు 'డీ టాక్సినేషన్ థెరపీ' చేయించుకుంటాడని తెలుస్తోంది.

  ఫ్యామిలీ కూడా..

  ఫ్యామిలీ కూడా..

  ఈ విదేశీ ట్రిప్‌కు ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి వెళతారని సమాచారం. ఇంత కాలం షూటింగు బిజీ కారణంగా భార్య, కొడుకుతో సరిగా సమయం గడపలేక పోయిన ఎన్టీఆర్ దాదాపు నెల రోజుల పాటు ఇక్కడ థెరపీ తీసుకుంటూ రిలాక్స్ అవుతారని సమాచారం.

  మలేషియాలో మార్షల్ ఆర్ట్స్

  మలేషియాలో మార్షల్ ఆర్ట్స్

  యూరఫ్‌లో 'డీ టాక్సినేషన్ థెరపీ' ముగిసిన అనంతరం ఆయన మలేషియా వెళతారని, అక్కడ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకుంటారని తెలుస్తోంది. పిబ్రవరిలో ప్రారంభం అయ్యే త్రివిక్రమ్ సినిమా కోసమే ఈ ట్రైనింగ్ తీసుకుంటారని టాక్.

  జై లవ కుశ

  జై లవ కుశ

  వరుస విజయాలతో దూసుకుపోతోన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా , సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణం లో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై భారీ స్థాయి లో రూపొందుతోన్న చిత్రం 'జై లవ కుశ' . యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఎలాంటి కట్స్ లేకుండా U/A సర్టిఫికెట్ జారీ చేసింది.

  అనసూహ్య స్పందన

  అనసూహ్య స్పందన

  ఈ నెల 21 న ప్రపంచవ్యాప్తం గా భారీ స్థాయి లో "జై లవ కుశ" చిత్రాన్ని విడుదల చేస్తున్నామని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ కు విశేషమైన ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. కేవలం 38 గంటల లో కోటి కి పైగా వ్యూస్ ను "జై లవ కుశ" ట్రైలర్ సంపాదించుకుంది.

  అంచనాలు భారీగా

  అంచనాలు భారీగా

  "యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం తో పాటు, అన్నదమ్ముల మధ్య నడిచే ఒక బలమైన కథ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. సెన్సార్ కార్యక్రమం పూర్తి అయ్యింది. అత్యుత్తమ సాంకేతిక విలువలతో నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 21 న ప్రపంచవ్యాప్తం గా విడుదల చేస్తున్నాం" అని నిర్మాత కళ్యాణ్ రామ్ అన్నారు.

  తెర వనక

  తెర వనక

  కే. ఎస్. రవీంద్ర (బాబీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాశీ ఖన్నా , నివేత థామస్ ఈ చిత్రం లో కథానాయికలు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించే ఈ చిత్రానికి చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఏ ఎస్ ప్రకాష్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు, తమ్మి రాజు. విసువల్ ఎఫెక్ట్స్ : అనిల్ పాదూరి (అద్విత క్రియేటివ్ స్టూడియోస్)

  ట్రైలర్ అదుర్స్

  'జై లవ కుశ' ట్రైలర్ వచ్చేసింది. ఇప్పటికే భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమాపై ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. సినిమా పేరు 'జై లవ కుశ' అయినా... సినిమాలో ఎన్టీఆర్ పోషించిన మూడు పాత్రలు రావణ..రామ లక్ష్మణుల్లా ఉండబోతున్నాయి. ఏ తల్లికైనా ముగ్గురు మగ పిల్లలు పుడితే రామ లక్ష్మణ భరతులు అవ్వాలని కోరుకుంటుంది. కానీ దురదృష్ట వశాత్తు ఈ తల్లికి పుట్టిన బిడ్డలు రావణ... రామ లక్ష్మణులయ్యారు అంటూ 'జై లవ కుశ' ట్రైలర్ మొదలైంది.

  ప్రణతి భయపడింది, తారక్ తప్ప ఎవరూ చేయలేరు: కళ్యాణ్ రామ్

  ప్రణతి భయపడింది, తారక్ తప్ప ఎవరూ చేయలేరు: కళ్యాణ్ రామ్

  'జై లవ కుశ' ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా గురించి, సినిమా కోసం తన తమ్ముడు తారక్ పడ్డ కష్టం గురించి చెప్పుకొచ్చారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Tollywood star NTR planning Europe trip after Jai Lava Kusa release. Film nagar source said that, NTR Get Detoxification therapy in Europe.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X