»   » కాన్సర్ భాధితుడుకి ధైర్యం....రియల్‌ హీరో అనిపించుకున్న ఎన్టీఆర్‌ (ఫొటోలు)

కాన్సర్ భాధితుడుకి ధైర్యం....రియల్‌ హీరో అనిపించుకున్న ఎన్టీఆర్‌ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: జూనియర్ ఎన్టీఆర్ కేవలం తెరమీదే కాదు నిజజీవితంలో కూడా రియల్ హీరోనని అనిపించుకున్నాడు. తన అభిమాన హీరో ఎన్టీఆర్‌ను కలవాలన్న ఓ క్యాన్సర్‌ రోగి ఆకాంక్షను ఆయన నెరవేర్చటంతో అన్ని చోట్ల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అభిమానులే నా దేవుళ్లు అని నోటి తో చెప్పటమే కాకుండా నిజ జీవితంలో చేసి చూపిండాడని మెచ్చుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే... బెంగుళురుకు చెందిన తన వీరాభిమాని, కేన్సర్ పేషెంట్ నాగార్జున తన చివరికోరికగా జూనియర్ ఎన్టీఆర్‌ను కలవాలనుకున్నాడు. విషయాన్ని తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ కేరళ షూటింగ్‌ను కూడా వాయిదా వేసుకుని అభిమానిని పరామర్శించాడు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ..నాగార్జున కుటుంబానికి వ్యక్తిగతంగా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అభిమానులు మమ్మల్ని మాత్రమే కాదు అభిమానులను మేము కూడా అభిమానిస్తాం, ప్రేమిస్తామని జూనియర్ ఎన్టీఆర్ తెలియజేశాడు.

స్లైడ్ షోలో ఆ ఫొటోలు చూడండి..

వీరాభిమాని

వీరాభిమాని

మొదటి నుంచీ నాగార్జున ...ఎన్టీఆర్‌ కు వీరాభిమాని

చివరి కోరిక

చివరి కోరిక

గత కొంతకాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న నాగార్జున ఎప్పటికైనా ఎన్టీఆర్‌ను కలవాలన్నది నాగార్జున కోరిక.

ఫ్యాన్స్ ద్వారా తెలుసుకున్న..

ఫ్యాన్స్ ద్వారా తెలుసుకున్న..

ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్‌ శనివారం బాధితుడిని కలిశారు. అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

కుటుంబ సభ్యులతో కూడా.

కుటుంబ సభ్యులతో కూడా.

నాగార్జున సహా అతని కుటుంబ సభ్యులతో ఎన్టీఆర్ కొద్దిసేపు గడిపారు.

ఆనందం

ఆనందం

తన అభిమాన హీరోని చూడగానే నాగార్జున కళ్లలో ఆనందం తొణికిసలాడింది. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు.

English summary
NTR’s fan Nagarjuna is fighting a battle with cancer. He had one last wish to meet his idol NTR in person. NTR who came to know about this fulfilled the wish without thinking twice.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu