»   » అంబులెన్సులకు దారి వదలండి: ఎన్టీఆర్‌

అంబులెన్సులకు దారి వదలండి: ఎన్టీఆర్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అత్యవసర సమయాల్లో ప్రతి ఒక్కరూ విధిగా అంబులెన్సులకు దారివదలాలని ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రిలో అక్యూట్‌ స్ట్రోక్‌ సెంటర్‌ను ఆసుపత్రి ఎండీ డా॥బి.భాస్కరరావుతో కలిసి ప్రారంభించారు.

ఎన్టీఆర్‌ మాట్లాడుతూ.. తనకు ప్రమాదం జరిగిన సందర్భంలో కిమ్స్‌ వైద్యుల చక్కటి ట్రీట్ మెంట్ తో కోలుకున్నానని గుర్తుచేశారు. అందుకే కిమ్స్‌ కుటుంబ సభ్యుడిగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నానని చెప్పారు. ప్రతి కుటుంబంలో ఒక వైద్యుడు ఉండటం ఎంతో మేలన్నారు.


అలాగే..వైద్యులు చెబుతున్న ప్రకారం ప్రస్తుతం పక్షవాతం కేసులు పెరుగుతున్నాయని, ఈ సమస్య రాకుండా ఆరోగ్యపరంగా అంతా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్టీఆర్‌ సూచించారు.అలాగే ...పనుల్లో పడి జీవితాన్ని ఒత్తిడిమయం చేసుకోకుండా సంతోషంగా గడపాలని, ఆరోగ్యంగా జీవించడం అదృష్టమని ఎన్టీఆర్ అన్నారు.


NTR inaugurated the Acute Stroke Centre at KIMS


ఎన్టీఆర్ తాజా చిత్రం విశేషాలకు వస్తే...

ఎన్టీఆర్‌, రకుల్‌ ప్రీత్‌లు జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నాన్నకు ప్రేమతో'.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఇటీవలే స్పెయిన్‌లో చిత్రీకరణ ముగించుకుని చిత్ర యూనిట్ హైదరాబాద్‌ తిరిగి వచ్చింది.


ప్రస్తుతం ఈ చిత్రానికి డబ్బింగ్‌ పనులు వేగంగా సాగుతున్నాయని నటి రకుల్‌ ప్రీత్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. తన పాత్రకి డబ్బింగ్‌ చెబుతున్న సందర్భంలో తీసుకున్న ఓ ఫొటోని ఆమె ట్వీట్‌ చేశారు. ఈ చిత్రాన్ని సంక్రాతి కానుకగా జనవరి 13న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.


NTR inaugurated the Acute Stroke Centre at KIMS

అలాగే.. ఈ చిత్రం బిజినెస్ కూడా అదే స్పీడుతో జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం ఉత్తరాంధ్ర, వైజాగ్ రైట్స్ ని విబిఎమ్ రెడ్డి ఫిలిమ్స్ వారు సొంతం చేసుకున్నారు. నిన్నే ఈ డీల్ ఫైనల్ అయ్యింది. నాన్ రిఫండబుల్ ఎడ్వాన్స్ పద్దతిలో విబిఎన్ రెడ్డి ఫిల్మ్స్ వారు తీసుకున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

English summary
NTR said, “After I met with an accident I understood the importance of having a doctor in the family. I suggest the youth to take medicine as their profession. This would help people during emergency.”
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu