twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జై లవకుశ లాస్‌ ఎంత: హిట్టే కానీ నష్టాలు తప్పలేదు

    |

    గతంలో సీనియర్ ఎన్టీఆర్ 'దాన వీర శూర కర్ణ'లో, చిరంజీవి 'ముగ్గురు మొనగాళ్లు' సినిమాల్లో మూడు పాత్రలలో నటించి మెప్పించారు. అలాగే.. 'ముగ్గురు మొనగాళ్లు' టైటిల్‌పైనే రూపొందిన పాత చిత్రంలో శోభన్ బాబు మూడుపాత్రల్లో నటిస్తే.. సూపర్ స్టార్ కృష్ణ ఏకంగా 7 సినిమాల్లో ట్రిపుల్ రోల్ చేశాడు. ఆ తర్వాత త్రిపాత్రాభినయం ప్రయోగాన్ని ఎవ్వరూ చేయలేదు. బహుశా చేయలేరేమో అని అనుకునే టైంలో.. నేనున్నానంటూ 'జై లవకుశ'తో ముందుకొచ్చాడు. రావణుడిగా, లవకుమార్‌గా, కుశుడిగా నటించి.. తన నటవిశ్వరూపం ప్రదర్శించాడు.

    Recommended Video

    Filmibeat Top 10 ఫిల్మిబీట్ టాప్ టెన్..
     ఎన్టీఆర్ పెర్ఫామెన్స్

    ఎన్టీఆర్ పెర్ఫామెన్స్

    మూడు పాత్రల్లోనూ వైవిధ్యం చూపిస్తూ.. మూడింటినీ పండిస్తూ.. వెండితెరను చీల్చిచెండాడాడు ఎన్టీఆర్. ‘జై లవకుశ' సినిమా చూస్తున్నంతసేసూ.. చూసి బయటికి వచ్చాక కూడా ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ మాత్రమే కళ్లముందు కదలాడుతుంది. అంతలా తన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు తారక్.

    ఊహించినంత స్థాయి విజయం

    ఊహించినంత స్థాయి విజయం

    ఇక్కడిదాకాబాగానే ఉంది కానీ ఊహించినంత స్థాయి విజయం మాత్రం అందలేదు. ఎన్ని చెప్పుకున్నా ఒక కమర్షియల్ సినిమా విజయాన్ని వసూళ్ళు చేసిన మొత్తం తోనే లెక్కించాలి కాబట్టి జై లవకుశ మరీ హిట్ ఏమీ కాదు అందుకు నిదర్శణం ఈ వసూళ్ళే.

     డెబ్బయ్‌ కోట్ల షేర్‌తోనే సరిపెట్టింది

    డెబ్బయ్‌ కోట్ల షేర్‌తోనే సరిపెట్టింది

    ఎనభై కోట్లకి పైగా షేర్‌ వస్తే తప్ప విజయవంతం అయినట్టు కాదని ట్రేడ్‌ లెక్కలు తేల్చగా, జై లవకుశ డెబ్బయ్‌ కోట్ల షేర్‌తోనే సరిపెట్టింది. అన్ని ఏరియాల్లోను డిస్ట్రిబ్యూటర్లు ఎంతో కొంత లాస్‌ అయ్యారు. అయితే లాస్‌ మరీ తీవ్రంగా లేకపోవడంతో నష్ట పరిహారం కోసం ఎవరూ నిర్మాత కళ్యాణ్‌రామ్‌ దగ్గరకు రారు.

    73 కోట్ల దాకా వరల్డ్ వైడ్ షేర్

    73 కోట్ల దాకా వరల్డ్ వైడ్ షేర్

    ఫుల్ రన్లో ‘జై లవకుశ' రూ.73 కోట్ల దాకా వరల్డ్ వైడ్ షేర్ రాబట్టింది. ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘జనతా గ్యారేజ్'ను ‘జై లవకుశ' దాటలేకపోయింది. తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ‘జై లవకుశ' స్థానం 8. ఎన్టీఆర్ కెరీర్లో మాత్రం ఇది సెకండ్ హైయెస్ట్ గ్రాసర్.

    13 కోట్ల దాకా నష్టం

    13 కోట్ల దాకా నష్టం

    ఈ చిత్ర థియేట్రికల్ హక్కుల్ని రూ.86 కోట్లకు అమ్మారు. అంటే రూ.13 కోట్ల దాకా నష్టం తప్పలేదన్నమాట బయ్యర్లకు. ఐతే ముందు అనుకున్న ప్రకారమైతే రూ.20 కోట్లకు పైనే లాస్ తప్పదనుకున్నారు. చివరికి ఓ మోస్తరు నష్టాలతో బయటపడ్డారు బయ్యర్లు. ఓవరాల్‌గా చూస్తే ‘జై లవకుశ' నిరాశ పరచలేదనే చెప్పాలి.

    తక్కువ ఖర్చుతో

    తక్కువ ఖర్చుతో

    చాలా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఈ సినిమాను పూర్తి చేశారు ఎన్టీఆర్ అండ్ టీం. సినిమాలో కంటెంట్ అంతంతమాత్రమే అయినప్పటికీ.. ఈ మాత్రం వసూళ్లు వచ్చాయంటే అది ఎన్టీఆర్ పెర్ఫామెన్స్‌ వల్లే. ఓవరాల్‌గా యావరేజ్‌ రేంజ్‌కి తగ్గట్టుగానే షేర్లు వచ్చాయి.

    బ్లాక్‌బస్టర్‌ అయితే కాలేకపోయింది

    బ్లాక్‌బస్టర్‌ అయితే కాలేకపోయింది

    ఎన్టీఆర్‌ కెరియర్లో రెండో అతి పెద్ద గ్రాసర్‌గా అయితే నిలిచింది కానీ ఎన్టీఆర్‌ చెప్పినట్టుగా ఫాన్స్‌ తల ఎత్తుకు తిరిగే గొప్ప బ్లాక్‌బస్టర్‌ అయితే కాలేకపోయింది. అయితే కన్సిస్టెంట్‌గా పర్‌ఫార్మ్‌ చేస్తోన్న ఎన్టీఆర్‌ నుంచి పక్కా బ్లాక్‌బస్టర్‌ వస్తే మాత్రం వసూళ్లు అదిరిపోతాయి. త్రివిక్రమ్‌తో చేస్తోన్న సినిమా ఆ కొరత తీర్చేస్తుందనే నమ్మకంతో అభిమానులతో పాటు ఎన్టీఆర్‌ కూడా వున్నాడు.

    English summary
    According to trade sources Jai Lava Kusa minted respectable share of Rs.70 crores at the end of its full run and occupied 4th position among this year's top grossers. Yet, the film suffered Rs.16 crores losses due to abnormal pre release business of Rs.86 crores was done to the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X