For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డైరక్టర్ శ్రీను వైట్లకు ఎన్టీఆర్ ఆ గిప్ట్

  By Srikanya
  |

  హైదరాబాద్: జూ.ఎన్టీఆర్,శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం బాద్షా. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. ఈ షూటింగ్ లో పాల్గొన్న ఎన్టీఆర్ ..శ్రీను వైట్ల దర్శకత్వపు స్కిల్స్ నచ్చి ఓ కాస్ట్ లీ వాచ్ ని గిప్ట్ గా ఇచ్చారు. ఈ విషయాన్ని రచయిత గోపీ మోహన్ మైక్రో బ్లాగింగ్ సైట్ లో తెలియచేసారు. ఆయన రాస్తూ..బాద్షా ఎన్టీఆర్ ...టాకీ షెడ్యూలు పూర్తైన సందర్భంగా సంతోషంగా ఓ అందమైన,అద్బుతమైన వాచ్ ని ప్రజెంట్ చేసారు. శ్రీను వైట్ల కూడా అందుకు ప్రతిఫలంగా ఓ బ్లాక్ బస్టర్ ని ఎన్టీఆర్ కి గిప్ట్ గా ఇవ్వాలని ఫిక్స్ అయ్యారని రాసుకొచ్చారు. 2013 సంక్రాంతికి విడుదల అయ్యే ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

  మొదటి షెడ్యూల్ ని దూకుడు తరహాలోనో ఫారిన్ షెడ్యూల్ తో అంటే ఇటిలీలో ప్రారంభించారు. తొలి షెడ్యూల్ ను ఏకధాటిగా 50 రోజుల పాటు ఇటలీలో ప్లాన్ చేశారు. అక్కడే రెండు పాటలు కాజల్,ఎన్టీఆర్ మధ్యన తీయనున్నారు. అలాగే ఎమ్.ఎస్ నారాయణ,కాజల్,వెన్నెల కిషోర్,ఎన్టీఆర్ మధ్యన కొన్ని ఎంటర్టైన్మెంట్ సీన్స్ ని తీస్తున్నారు. అంతేకాకుండా దూకుడు తరహాలో ఈ చిత్రంలోనూ బ్రహ్మానందం కీ రోల్ ప్లే చేస్తున్నారు.

  ఇక ఈ విషయమై స్క్రిప్టు రైటర్ కోన వెంకట్ తన ట్విట్టర్ పేజీలో...ఈ సినిమాలో ఎన్టీఆర్ బ్రాండ్ న్యూ అవతార్ లో కనిపించనున్నాడు. ఎన్టీఆర్ అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే ఉంటారు అన్నారు. ఇక అందుకోసం ప్రత్యేకంగా ముంబై నుంచి మేకప్ స్పెషలిస్టులు వచ్చి మరీ ఎన్టీఆర్ ని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. అందుకోసం ప్రత్యేకమైన ఫోషో సెసన్స్ కూడా నడిచాయి. దాంతో ఆ క్యూరియాసిటీ పోకుండా ఫస్ట్ లుక్ వదిలేవరకూ ఎన్టీఆర్ పబ్లిక్ లోకి రాకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

  ఇప్పటికే రెడీ, దూకుడు లాంటి చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న శ్రీను వైట్ల ఈ సారి అంతకు మించిన ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్టుతో 'బాద్ షా' చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ 'బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సినిమా మరో దూకుడు అవుతుందని,ఆ రేంజిని దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.

  ఇక ఎన్టీఆర్ సైతం ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...సినిమా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అన్నారు. శ్రీను వైట్ల,ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే జనం రకరకాలు అంచనాలు వేస్తున్నారు. వాటినన్నిటికీ అతీతంగా కథ,కథనం ఉంటాయి. పూర్తిగ మొదటినుంచి చివరి వరకూ పొట్ట పగిలేలా నవ్విస్తాము అన్నారు. గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ కొట్టిన గణేష్,దూకుడుతో సూపర్ హిట్ కొట్టిన శ్రీనువైట్ల కాంబినేష్ కాబట్టి తమకీ ఆ రేంజి హిట్ పడుతుందని ఎన్టీఆర్ పూర్తి నమ్మకంగా ఉన్నారు. ట్రేడ్ లో సైతం ఆ నమ్మకంతో హైప్ క్రియేట్ అవుతోంది.

  English summary
  
 NTR Jr has gifted director Sreenu Vaitla an expensive watch while shooting for the film Baadshah in Italy. Gopimohan, one of the writers of the film wrote on a micro-blogging site — "Baadshah Ntr gifted this lovely Breitling Watch to dir Sreenu Vaitla ji after finishing our talkie schedule & in return Vaitla ji want to give a BlockBuster as a gift ...". SS Thaman is composing the music for the film that's slated for a Sankranthi release in 2013.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X