»   » త్వరలో శుభవార్త: ఎన్టీఆర్-ప్రణతి లేటెస్ట్ ఫోటోస్ వైరల్...

త్వరలో శుభవార్త: ఎన్టీఆర్-ప్రణతి లేటెస్ట్ ఫోటోస్ వైరల్...

Posted By:
Subscribe to Filmibeat Telugu
NTR phoses To Fans Along with His Wife

యంగ్ టైగర్ ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతి దంపతులకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. కొందరు అభిమానులు ఇటీవల ఎన్టీఆర్‌ను కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఫ్యాన్స్ వీటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. త్వరలో రాబోయే త్రివిక్రమ్ మూవీలో ఎన్టీఆర్ స్లిమ్ లుక్‌లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఆయన లుక్ ఎలా ఉండబోతోంది అనేది ఈ ఫోటోలను చూసి ఒక అంచనాకు రావచ్చు. అంతే కాదు వీటి ఆధారంగా త్వరలో మన ఒక గుడ్ న్యూస్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు.

త్వరలో శుభవార్త

త్వరలో శుభవార్త

ఎన్టీఆర్ దంపతుల నుండి త్వరలో మనం గుడ్ న్యూస్ వినబోతున్నాం. ఈ ఫోటోల్లో ప్రణతి గర్భవతిగా ఉన్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఈ అందమైన కుటుంబంలోకి త్వరలో బుల్లి పాపాయి చేరబోతోంది.

అభిమానులతో ఎటాచ్మెంట్

అభిమానులతో ఎటాచ్మెంట్

ఎన్టీఆర్ అభిమానులతో చాలా ఎటాచ్మెంటుతో ఉంటారు. ఎప్పుడైనా వారు తనను కలవడానికి వస్తే నిరాశ పరచడానికి అస్సలు ప్రయత్నించరు. సమయం ఉంటే వారిని కలిసి ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి ఏ మాత్రం సంకోచించరు. అలా అభిమానుల ద్వారా బయటకు వచ్చిన ఫోటోలే ఇవి.

ఖాళీ సమయం భార్యతోనే గడుపుతున్న ఎన్టీఆర్

ఖాళీ సమయం భార్యతోనే గడుపుతున్న ఎన్టీఆర్

లక్ష్మి ప్రణతి ప్రస్తుతం గర్భవతిగా ఉండటంతో తనకు ఏ మాత్రం సమయం ఉన్నా భార్యతో గడిపేందుకే కేటాయిస్తున్నారు ఎన్టీఆర్.

 వరుస సినిమాలతో బిజీ బిజీ

వరుస సినిమాలతో బిజీ బిజీ

‘జై లవ కుశ' అనంతరం తన తర్వాతి సినిమా మొదలు పెట్టేందుకు కాస్త గ్యాప్ తీసుకునప్న యంగ్ టైగర్ త్వరలో వరుస సినిమాలతో బిజీకాబోతున్నారు. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత రామ్ చరణ్‌తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నారు.

 భారీగా బరువు తగ్గిన ఎన్టీఆర్

భారీగా బరువు తగ్గిన ఎన్టీఆర్

తన తర్వాతి సినిమా కోసం స్లిమ్ లుక్‌లోకి మారడంలో భాగంగా ఎన్టీఆర్ దాదాపు 20 కేజీల బరువు తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది. పాత్ర డిమాండ్ మేరకు ఎన్టీఆర్ బరువు తగ్గినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఫిట్ నెష్ నిపుణుల సమక్షంలో ట్రైనింగ్ తీసుకున్నారు.

అంచనాలు భారీగా

అంచనాలు భారీగా

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కలిసి తొలిసారి సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్, టాప్ దర్శకుడిగా త్రివిక్రమ్‌కు ఉన్న క్రేజ్ వెరసి ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

టాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ #ఆర్ఆర్ఆర్

టాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ #ఆర్ఆర్ఆర్

ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ మూవీ టాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్టుల్లో ఒకటిగా ప్రచారం జరుగుతోంది. బాహుబలి డైరెక్టర్ కావడంతో ఈ సినిమా రేంజి మరింత పెరిగింది.

ఎవరి ఊహకు అందడం లేదు

ఎవరి ఊహకు అందడం లేదు

#ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు ఎలా ఉంటబోతోంది, ఇద్దరూ పెద్ద స్టార్లను దర్శకుడు రాజమౌళి వెండి తెరపై ఎలా చూపించబోతున్నాడు, వారి స్టార్ ఇమేజ్‌ను ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు? అనేది ఎవరి ఊహకు అందడం లేదు.

English summary
NTR, Lakshmi Pranathi Latest photos vairal. There were rumours in the recent past that JR NTR is going to become a father again. Tarak and Lakshmi Pranathi couple already has a son named Abhay Ram. They are now expecting a second baby. Apparently, Lakshmi Pranathi is not regularly seen in the public, but we have come to know about a picture that is going viral on the social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X