twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇదే కీలకం, ఈసారి తేడా జరగదు కదా!

    |

    స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ ఎన్టీఆర్ బయోపిక్. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాడు. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతికి విడుదలయింది. రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు విడుదలకు సిద్ధం అవుతోంది. మొదటి భాగంలో ఎన్టీఆర్ సినీరంగ విశేషాలని చూపించిన దర్శకుడు రెండవ భాగంలో రాజకీయ ప్రస్థానాన్ని చూపించబోతున్నాడు. ఎన్టీఆర్ మహానాయకుడు చిత్ర విడుదల గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

     రిలీజ్ డేట్ ఫిక్స్

    రిలీజ్ డేట్ ఫిక్స్

    ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రానికి ముందుగా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. ఆ తరువాత ఫిబ్రవరి 7కు వాయిదా పడింది. ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రానికి సంబందించిన ఇంకా కొంచెం వర్క్ మిగిలిపోయి ఉండడంతో ఆ తేదీన కూడా చిత్రం విడుదల కాలేదు. ప్రస్తుతం మహానాయకుడు చిత్రానికి సంబందించిన అన్ని కార్యక్రమాలు పూర్తి కావడంతో ఫిబ్రవరి 22న విడుదల చేయనున్నారు.

    నిరాశపరిచిన కథానాయకుడు

    నిరాశపరిచిన కథానాయకుడు

    దాదాపు 70 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. కథానాయకుడు చిత్రానికి ఆశించిన స్థాయిలో వసూళ్లు దక్కలేదు, ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటన బావుందని ప్రశంసలు దక్కినా కథానాయకుడు చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలవలేకపోయింది. దీనికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మహానాయకుడు చిత్రం కూడా విడుదలకు సిద్ధం అవుతుండడంతో ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

     అత్యంత కీలకం

    అత్యంత కీలకం

    ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని పక్కన పెడితే.. ఎన్టీఆర్ మహానాయకుడులోనే అసలు విషయం దాగుందని చెప్పొచ్చు. ఎన్టీఆర్ సినీరంగంలో తిరుగులేని స్టార్ గా ఎదిగారు. కానీ ఆయన రాజకీయాల్లోనే అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంతో అనేక రాజకీయ అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి.దీనితో ఈ చిత్రం విజయం సాధించడం బాలయ్యకు అంత్యంత కీలకం. పైగా కథానాయకుడు చిత్రంతో దారుణంగా నష్టపోయిన బయ్యర్లకు కాస్త ఊరట కలగాలన్నా మహానాయకుడు తప్పనిసరిగా విజయం సాధించాలి.

     తేడా జరగదు కదా

    తేడా జరగదు కదా

    ఇప్పటికే మహానాయకుడు చిత్రానికి బాలయ్య బయ్యర్లకు ఫ్రీగా ఇస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన ఎన్టీఆర్, కేంద్ర రాజకీయాలని కూడా ప్రభావితం చేశారు. దర్శకుడు క్రిష్ మహానాయకుడు చిత్రాన్ని రసవత్తరంగా మలచిఉంటే ప్రేక్షకులని ఆకట్టుకోవడం ఖాయం. మొత్తంగా కథానాయకుడు పరాజయం తర్వాత మహానాయకుడు విడుదల కానుండడంతో చిత్ర యూనిట్ పై భారీ స్థాయిలో ఒత్తిడి నెలకొని ఉంటుంది.

    English summary
    NTR Mahanayakudu will release on this date. Krish Jagarlamudi directing this movie and Balayya playing as his father
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X