»   » ఎన్టీఆర్ పెళ్ళి మే 9న కాదు...మరి

ఎన్టీఆర్ పెళ్ళి మే 9న కాదు...మరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎన్టీఆర్, లక్ష్మీప్రణీతల వివాహానికి మే 9న ముహూర్తం కుదిరిందంటూ గురువారం ఉదయం నుంచీ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సన్నిహితులు ఒకరు ఈ విషయంపై వ్యాఖ్యానించటంతో అంతటా అది స్ప్రెడ్ అయిపోయింది. అయితే ఆ ముహూర్తాన్ని నిశ్చయించలేదని ఎన్టీఆర్‌ సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. అసలు ఆ రోజు ముహూర్తాలే లేవనీ, పైగా అధిక మాసంలో ఎలా నిర్ణయిస్తామని ఎదురు ప్రశ్న వేసారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం నవంబరు 18న ఎన్టీఆర్‌ వివాహ ముహూర్తం నిశ్చయించారని తెలుస్తోంది. హైదరాబాద్‌లోనే ఈ వివాహ వేడుకని ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇక ఎన్టీఆర్‌ నిశ్చితార్థం నిన్న (గురువారం) ఫిల్మ్‌నగర్‌లోని నార్నే శ్రీనివాసరావు ఇంటిలో జరిగింది. ఎన్టీఆర్‌ అభిమానులు, మీడియా హడావుడితో ఆ ప్రాంతం సందడిగా కనిపించింది. కేవలం ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశం కల్పించారు. మీడియాకి దూరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu