»   » అప్పుడే 'ఫాలో ఫాలో యూ' అంటున్న ఎన్టీఆర్ కొడుకు.. తారక్ మ్యారేజ్ డే సెలెబ్రేషన్స్‌లో రాంచరణ్!

అప్పుడే 'ఫాలో ఫాలో యూ' అంటున్న ఎన్టీఆర్ కొడుకు.. తారక్ మ్యారేజ్ డే సెలెబ్రేషన్స్‌లో రాంచరణ్!

Subscribe to Filmibeat Telugu

రాంచరణ్, ఎన్టీఆర్ మధ్య మంచి రిలేషన్ షిప్ కొనసాగుతోంది. ఇద్దరూ స్టార్ హీరోలైనప్పటికీ ఒకరిపై ఒకరు తమ అభిమానాన్ని ఆప్యాయతని చాటుకుంటుంటారు. పలు సందర్భాల్లో ఎన్టీఆర్, రాంచరణ్ కలుసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలసి త్వరలో రాజమౌళి దర్శకత్వంలో నటించబోతున్నారు. రంగస్థలం చిత్రం విజయం సాధించిన సందర్భంగా, మహేష్ భరత్ అనే నేను చిత్రం విజయం సాధించిన సందర్భంగా మహేష్, ఎన్టీఆర్, రాంచరణ్ కలసి ఫోటోలు దిగి అభిమానులని అలరించిన సంగతి తెలిసిందే. మరో మారు రాంచరణ్ సతీ సమేతంగా ఎన్టీఆర్ ఇంట్లో సందడి చేశారు. దీనికి ఓ ప్రత్యేకత ఉంది. ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతి మ్యారేజ్ యానవర్సరీ సందర్భంగా జరిగిన సెలెబ్రేషన్స్ లో రాంచరణ్, ఉపాసన సందడి చేశారు.

ముగ్గురు మిత్రులు

ముగ్గురు మిత్రులు

రాంచరణ్, ఎన్టీఆర్, మహేష్ మధ్య రోజురోజుకు బలపడుతున్న బంధం గురించి అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. తరచుగా వీరు కలుసుకుంటూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. రంగస్థలం చిత్రం విజయం సాధించిన తరువాత, భరత్ అనే నేను ప్రైవేట్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ఎన్టీఆర్, రాంచరణ్, మహేష్ కలసి కనువిందు చేసారు.

స్టార్ హీరోలు అయినా కూడా

స్టార్ హీరోలు అయినా కూడా

సాధారణంగా స్టార్ హీరోల మధ్య ఇగో ఫీలింగ్స్ ఉంటాయనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. కానీ మా మధ్య అలాంటివి లేవని రాంచరణ్, ఎన్టీఆర్, మహేష్ నిరూపించారు. ఎవరి చిత్రం విడుదలైనా వీరు ముగ్గురూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. టాలీవుడ్ లో ఇది మంచి పరిమాణం అని ఫాన్స్ అభిప్రాయ పడుతున్నారు.

ఎన్టీఆర్ ఇంట్లో మెగా సందడి

2011 లో ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతి వివాహం జరిగింది. తాజగా ఎన్టీఆర్ మ్యారేజ్ డే సెలెబ్రేషన్స్ జరిగాయి. ఈ సెలెబ్రేషన్స్ కు రాంచరణ్, ఉపాసన దంపతులు హాజరయ్యారు. ఎన్టీఆర్ కుమారుడు అభయ్ రామ్, రాంచరణ్, ఉపాసన కలసి ఎన్టీఆర్ దంపతులతో దిగిన ఫోటో వైరల్ గా మారింది.

ఫాలో ఫాలో యూ అంటున్న అభయ్ రామ్

ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్ క్యూట్ క్యూట్ గా పడిన ఓ పాటని ఉపాసన సోషల్ ఎండియాలో పోస్ట్ చేసింది. నాన్నకు ప్రేమతో చిత్రంలోని ఫాలో ఫాలో యూ అనే పాటని అభయ్ రామ్ ముద్దు ముద్దుగా పాడాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి అభిమానులని అలరిస్తోంది.

రాజమౌళి దర్శకత్వంలో

రాజమౌళి దర్శకత్వంలో

రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ చిత్రానికి రంగం సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా నటించబోతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ చిత్రంతో, రాంచరణ్ బోయపాటి చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఏ చిత్రాలు పూర్తయ్యాక రాజమౌళి చిత్రం ప్రారంభం అవుతుంది.

English summary
NTR marriage day celebrations. Ram Charan and Upasana attends this celebrations
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X