»   » 'నాన్నకు ప్రేమతో': రకుల్ డబ్బింగ్ చెప్తూ... (వీడియో)

'నాన్నకు ప్రేమతో': రకుల్ డబ్బింగ్ చెప్తూ... (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్టీఆర్ తాజా చిత్రం 'నాన్నకు ప్రేమతో' సంక్రాంతికి విడుదల చేయటానికి భారీ ఎత్తున సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిత్రంలో హీరోయిన్ గా చేస్తున్న రకుల్ ప్రీతి సింగ్ ...డబ్బింగ్ చెప్తున్నప్పుడు వీడియో ఇది.

#NannakuPrematho Movie Dubbing !!


Posted by Rakul Preet on5 January 2016

చిత్రం విడదల విషయానికి వస్తే..సంక్రాంతికి విడుదల అవుతున్న మిగతా చిత్రాల కన్నా భారీగా ఈ సినిమాని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1700 స్క్రీన్స్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయటానికి రిలియన్స్ వారు, డిస్ట్రిబ్యూటర్స్ కలిసి ప్లాన్ చేసినట్లు ట్రేడ్ వర్గాల సమచారం.


 NTR ‘Nannaku Prematho’: Rakul Dubbing Vedio

బిజినెస్ విషయానికి వస్తే...సీడెడ్, నార్త్ ఇండియా తప్ప అన్ని ఏరియాలు బిజినెస్ పూర్తైనట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ రెండు ప్రాంతాల్లోనూ ఈ సినిమాను సమర్పిస్తున్న రిలియన్స్ వారే రిలీజ్ చేస్తున్నట్లు చెప్తున్నారు. మరో ప్రక్క ..., ఆడియో పాటు విడుదలైన దియోటర్ ట్రైలర్ కి మంచి స్పందన వస్తొంది. ఆ ట్రైలర్ ని ఇక్కడ చూడండి.రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు.


ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.English summary
Here is the Nannaku Prematho movie dubbing video. For the first time, I have dubbed for my character. This is really a great experience. Hope you like my voice and the movie. The movie is up for a grand release on January 13th, 2015. Watch Nannaku Prematho and support us.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu