»   » విషయం ఏంటో: 'బాహుబలి' సెట్స్ పై ఎన్టీఆర్ (ఫొటో)

విషయం ఏంటో: 'బాహుబలి' సెట్స్ పై ఎన్టీఆర్ (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : జూ.ఎన్టీఆర్ కు రాజమౌళికి ఉన్న అనుబంధం తెలియంది కాదు. రాజమౌళి కెరీర్ ...ఎన్టీఆర్ చిత్రం స్టూడెంట్ నెంబర్ వన్ విజయం తోనే ప్రారంభమైంది. అలాగే రాజమౌళి కెరీర్ ...సూపర్ హిట్ సింహాద్రి తోనే మలుపు తిరిగి...తిరుగులేని దర్శకుడుని చేసింది. ఆ తర్వాత యమదొంగతో ఆయన్ను ఎక్కడో కూర్చోబెట్టింది. అప్పటినుంచి వీరిద్దరి కాంబినేషన్ కోసం ఇండస్ట్రీనే కాదు అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు. కానీ ఆ అవకాసం రాలేదు. త్వరలోనే వస్తుందనే టాక్స్ వినపడుతన్ననాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక ఇక్కడ చూస్తున్న ఈ ఫొటో 'బాహుబలి' సెట్స్ మీద తీసింది. ఎప్పుడు తీసారో తెలియదు కానీ..తర్వాత ప్రాజెక్టు గురించి వీరిద్దరు మాట్లాడుకునే ఉంటారు అని అనిపిస్తోంది. ఈ రోజు ఎన్టీఆర్ 32 వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ ఫొటో అభిమానులను ఆనందపరిచేదే. త్వరలో రాజమౌళి..మైథలాజికల్ మూవి ...మహా భారతం చెయ్యాలని ప్లాన్ లో ఉన్నారు. అందులో తప్పకుండా ఎన్టీఆర్ కు స్దానం ఉండే ఉంటుంది ఏమంటారు.

ఎన్టీఆర్ ...కెరీర్ విషయానికి వస్తే...

టెంపర్ తో సక్సెస్ ని అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో చేయనున్న ‘మా నాన్నకు ప్రేమతో' అనే సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఎన్.టి.ఆర్ - సుకుమార్ మూవీని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

NTR on the sets of Baahubali!

ఈ విషయమై సుకుమార్ మాట్లాడుతూ... ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నా. త్వరలో మొదలయ్యే అవకాశాలున్నాయి. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే సినిమా ఇది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ను హీరోయిన్ అనుకొంటున్నాం. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలందిస్తారు అంటూ చెప్పుకొచ్చారు సుకుమార్.

అలాగే...ఎన్టీఆర్...రీసెంట్ గా ...అదుర్స్ సీక్వెల్ ఓకే చేసారని ఫిల్మ్ నగర్ సమాచారం. జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా నయనతార, షీల హీరోయిన్స్‌గా వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అదుర్స్‌' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్‌లోని కామెడీ యాంగిల్‌ను ‘అదుర్స్‌' చిత్రం బయటకు తీసుకు వచ్చింది. అప్పటి వరకు యాక్షన్‌ చిత్రాలకు మాత్రమే పరిమితమయిన ఎన్టీఆర్‌ ‘అదుర్స్‌'తో తాను కూడా కామెడీ చేయగలనంటూ నిరూపించుకున్నాడు. ఆ చిత్రం ఘన విజయం అవ్వడంతో దానికి సీక్వెల్‌ తీసుకు రావాలని ఎన్టీఆర్‌, వినాయక్‌లు చాలా కాలంగా భావిస్తున్నారు.

దీనికోసం వినాయక్ స్ర్కిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారని ఫిలింనగర్ టాక్.కోన వెంకట్, గోపీ మోహన్ ఈ స్క్రిప్టుపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ అయితే ‘అదుర్స్-2'ని చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది. అయితే అఖిల్ సినిమాతో వినాయక్ బిజీగా ఉండగా...ఎన్టీఆర్ సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. వీరి ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తవగానే ‘అదుర్స్-2' పట్టాలెక్కనుందని సమాచారం.

మరో ప్రక్క ఈ చిత్రంలో హీరోయిన్స్ సైతం ఫైనల్ అయ్యారని టాక్. ‘అదుర్స్2' చిత్రంలో ఎన్టీఆర్ సరసన అందాల తార నయనతారతో పాటు అందాల ముద్దుగుమ్మ ఆండ్రియాలు నటించనున్నారని ఫిలింనగర్ సమాచారం. అదుర్స్ చిత్రంలో ఎన్టీఆర్, నయనతార జంట అదరగొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా సీక్వెల్‌లో నయనతో పాటు ఆండ్రియా జతయ్యింది.

అయితే... వినాయిక్ ఆ మధ్యన మాట్లాడుతూ... అదుర్స్ చిత్ర కథ ఇంకా ఫైనల్ కాలేదని తెలిపారు. జూ.ఎన్టీఆర్ తో రూపొందించిన 'అదుర్స్' చిత్రానికి సీక్వెల్ గా అదుర్స్-2 నిర్మిస్తున్నారనే వార్తలపై వినాయక్ స్పందించారు. 'కథా చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే ఇంకా ఫైనల్ కాలేదు. ఇంకా చర్చలు కొనసాగుతునే ఉన్నాయి. త్వరలో కథ చర్చలు పూర్తవుతాయి' అని వినాయక్ అన్నారు. అంతేకాకుండా అదుర్స్2 ఎప్పుడు ప్రారంభమవుతుందని ఇప్పడే చెప్పలేమని ఆయన మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు.

ఇక ఆ మధ్యన జరిగిన టెంపర్ ఆడియో ఫంక్షన్ లోనూ త్వరలోనే అదుర్స్-2 తెరకెక్కబోతున్నట్టు హింట్ ఇచ్చాడు వినాయక్. అదుర్స్-2 చిత్రానికి సంబంధించి ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయట. ఈ ఏడాది చివర్లో అదుర్స్-2 ఆరంభమవడం ఖాయమనిపిస్తోంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్.. ఏ రేంజిలో అదుర్స్ అనిపిస్తుందో చూడాలి.

English summary
Jr NTR was spotted on the sets of period drama 'Baahubali' along with his favourite director SS Rajamouli.
Please Wait while comments are loading...