»   » సీక్రెట్ రివీల్: సుకుమార్ ని రిలీజ్ చేయొద్దన్న ఎన్టీఆర్

సీక్రెట్ రివీల్: సుకుమార్ ని రిలీజ్ చేయొద్దన్న ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్టీఆర్ తాజా చిత్రం 'నాన్నకు ప్రేమతో' లో క్లైమాక్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్న సంగతి తెలిసిందే. చాలా భావోద్వేగంగా సాగిన ఈ క్లైమాక్స్ గురించిన ఓ సీక్రెట్ ని ఎన్టీఆర్ రీసెంట్ గా ఓ ఇంటర్వూలో రివీల్ చేసారు. ఈ సీక్రెట్ విన్న వారంతా షాక్ అవుతున్నారు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ... సుకుమార్ ఈ చిత్రానికి ఐదు ఢిఫరెంట్ క్లైమాక్స్ లతో వచ్చారు. ఆయన ఈ ఐదు క్లైమాక్స్ లు షూట్ చేసి, లాస్ట్ వన్ ని ఫైనలైజ్ చేసామని అన్నారు. అలాగే.. ఫస్ట్ వెర్షన్ లో ...టెక్నిషియన్స్ అంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. సెకండ్ వెర్షన్ లో ఎమోషన్స్ డెప్త్ తగ్గింది. ఇక ధర్డ్ వెర్షన్ లో ఏడ్చేసాను.నాలుగో వెర్షన్ లో ఎవరి స్టైల్ లో వారు చేసారు. ఐదో వెర్షన్ లో ..అందరూ సేమ్ ఎక్సప్రెషన్స్ ..దన్నై ఫైనలైజ్ చేసాం అన్నారు.

NTR refused to release Naannaku.. climax versions

సుకుమార్..ఈ ఐదు వెర్షన్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేద్దామన్నారు. కానీ నేనే వద్దన్నాను ..సినిమా విలువ తగ్గిపోతుందని అని ఎన్టీఆర్..సినిమా క్లైమాక్స్ వెనక ఉన్న ఎమోషన్స్ ని డెప్త్ ని షేర్ చేసుకున్నారు.

రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటించారు.

ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.

English summary
NTR said Sukumar suggested to release ‘Naannaku Prematho’ climax versions on youtube, but he refused.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu