»   » నేను చేయలేదు, చేస్తే చెబుతా... జైల్లో తోస్తారా ఏంటి?... రూమర్లపై ఎన్టీఆర్

నేను చేయలేదు, చేస్తే చెబుతా... జైల్లో తోస్తారా ఏంటి?... రూమర్లపై ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu
NTR responded to Jai Lava Kusha Movie Rumors నేను చేయలేదు, జైల్లో తోస్తారా ఏంటి?

'జై లవ కుశ' సినిమాకు డైరెక్టర్ బాబీ అయినప్పటికీ సగం మూవీ ఎన్టీఆరే డైరెక్ట్ చేశాడనే రూమర్స్ వినిస్తున్నాయి. దీనిపై ఎన్టీఆర్ స్పందించారు. దీనిపై నేను తప్పకుండా స్పందించాల్సిన అవసరం ఉంది అంటూ తారక్ రియాక్ట్ అయ్యారు.

అలా చేయాల్సిన అవసరం ఉంటే నేను చేసుకునే వాడిని, నా పేరు నేనే వేసుకునే వాడిని. నా పేరే డైరెక్టర్ గా వేసుకుని, నేనే ఓ చిత్రం చేసుకుంటే నన్నె ఎవరైనా అడుగుతారా? లేక ఏదైనా కేసు పెట్టి జైల్లో తోస్తారా? అలాంటి దేమీ ఉండదు కదా? నేను అలాంటి దేమీ చేయలేదు అని ఎన్టీఆర్ అన్నారు.

సలహాలు ఇచ్చిన మాట నిజమే

సలహాలు ఇచ్చిన మాట నిజమే

బాబీకి మేము సినిమా ఇలా ఉంటే బావుంటుంది అని కథ విషయంలో సలహాలు ఇవ్వడమే తప్ప... మిగతా అంతా తనే చేసుకున్నాడు. కథ రాసుకునే శక్తి , డైరెక్షన్ చేసుకునే ఆలోచన ఉంటే ఈ కథ మేమే రాసుకునే వాళ్లం, మేమే తీసుకునే వాళ్లం. బయట రూమర్లు నిజం కాదు అని ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు.
సినిమా హిట్టయితే క్రెడిట్ వారికే

సినిమా హిట్టయితే క్రెడిట్ వారికే

రేపు ఈ చిత్రం విజయం సాధిస్తుందంటే ఆ కథ తీసుకొచ్చినందుకు, రీసర్చ్ చేసి తీసిన బాబీకి, ఈ సినిమాను ఇంత బాగా పని చేసిన టెక్నీషియన్స్‌కు దక్కుతుంది అని ఎన్టీఆర్ తెలిపారు.


స్టార్ హీరోయిన్లు అని ఏం లేదు

స్టార్ హీరోయిన్లు అని ఏం లేదు

సినిమాలో స్టార్ హీరోయిన్లు ఉండాలి, ఉండకూడదు అని ఏమీ ఉండదు. సినిమాలో పాత్రకు వీరు న్యాయం చేస్తారు అనుకున్నపుడే తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగానే రాశి ఖన్నా, నివేథా థామస్ ఎంపిక జరిగిందని ఎన్టీఆర్ తెలిపారు.


గ్రాండ్ రిలీజ్

గ్రాండ్ రిలీజ్

ఎన్టీఆర్ కెరీర్‌లోనే భిన్నమైన సినిమాగా తెరకెక్కిన జై లవకుశ ఈ నెల 21న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. జై లవకుశ మూవీ 2:38నిమిషాల నిడివితో అలరించబోతోంది.


English summary
NTR responded to Jai Lava Kusha Movie Rumors. He said that he did not direct Jai Lava kusa film, Director Bobby did all the work.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu