»   » 'జనతా గ్యారేజ్‌': ఎన్టీఆర్‌....ఓపెన్ చేసేది ఎప్పడంటే

'జనతా గ్యారేజ్‌': ఎన్టీఆర్‌....ఓపెన్ చేసేది ఎప్పడంటే

Written By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :నాన్నకు ప్రేమతో' తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నారు ఎన్టీఆర్‌. ఆ చిత్రం 'జనతా గ్యారేజ్‌' పేరుతో తెరకెక్కనున్నట్లు సమాచారం. 'ఇక్కడ అన్నీ రిపేర్లు చేయబడును' అని ఉపశీర్షికగా నిర్ణయించినట్టు తెలిసింది. మైత్రీ మూవీస్‌ పతాకంపై రూపొందనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ని ఓ మెకానిక్‌గా చూపించబోతున్నారని ప్రచారం సాగుతోంది. ఈ చిత్రం జనవరి 8 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టనున్నారని సమాచారం. సంగీత దర్శకుడుగా దేవిశ్రీప్రసాద్ ఇప్పటికే ఎంపిక అయ్యారు.

JANATA GAREGE

చిత్రం విశేషాల్లోకి వెళితే...ఎన్టీఆర్‌ 26వ చిత్రాన్ని శ్రీమంతుడు వంటి సూపర్ హిట్ ఇచ్చిన మైత్రీ మూవీస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. దీనిలో మళయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని చిత్ర యూనిట్ ప్రకటించింది.


1994 లో బాలకృష్ణ హీరోగా నటించిన 'గాండీవం' చిత్రంలో కీలకపాత్రలో కనిపించి మురిపించారు మోహన్ లాల్. మళ్లీ చాలా కాలం తర్వాత తెలుగులో వస్తున్నారు. అయితే చిత్రంగా మళ్లీ నందమూరి హీరో ఎన్టీఆర్ చిత్రంలోనే ఆయన కీ రోల్ లో కనిపించనున్నారు. ఈ మేరకు అఫీషియల్ గా ప్రకటన చేసారు చిత్ర నిర్మాతలు.


మోహన్‌లాల్‌ వంటి గొప్ప నటుడు మా చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. అక్టోబర్‌ 25న ప్రారంభమైన ఈ చిత్రం ..2016 ఆగస్టు 12న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న ‘నాన్నకు ప్రేమతో' పూర్తయ్యాక కొరటాల శివ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది.

English summary
Mythri Movie Makers is producing In NTR's Janata Garage movie and the regular shoot is expected to commence from January 8th.
Please Wait while comments are loading...