»   » ఇద్దరు సెక్సీ భామలతో ఎన్టీఆర్ మాస్ మసాలా సాంగ్

ఇద్దరు సెక్సీ భామలతో ఎన్టీఆర్ మాస్ మసాలా సాంగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ మరోసారి ఇద్దరు హీరోయిన్లతో కలిసి మాస్ మసాలా సాంగులో ప్రేక్షకులను అలరించనున్నారు. గతంలో జూ ఎన్టీఆర్ నటించిన 'సింహాంద్రి', 'బృందావనం' చిత్రాల్లో ఇద్దరు హీరోయిన్లతో చేసిన మాస్ మసాలా సాంగులకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా 'రామయ్యా వస్తావయ్యా' చిత్రంలోనూ అలాంటి సాంగ్ ప్లాన్ చేసారు దర్శకుడు హరీష్ శంకర్.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇందులోని టైటిల్ సాంగ్ 'రామయ్యా వస్తావయ్యా...సోకులు బయటకు తీస్తావయ్యా' అనే సాంగును జూ ఎన్టీఆర్, ఈ చిత్రంలోని ఇద్దరు హీరోయిన్లు సమంత, శృతి హాసన్‌లతో చిత్రీకరించనున్నారు. ఈ సాంగుకు సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని యూనిట్ సభ్యులు అంటున్నారు.

ఈ చిత్రం ఆడియో సెప్టెంబర్ 8 న శిల్పకళా వేదికలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం స్పెయిన్ లో షూటింగ్ జరుగుతోంది. సెప్టెంబర్ 7న హైదరాబాద్ ఈ చిత్రం యూనిట్ వస్తుంది. వచ్చిన మరుసటి రోజే ఆడియో విడుదల అవుతుంది. సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 27 విడుదల చేస్తామని దర్శకుడు హరీష్ శంకర్ ఇటీవల వెల్లడించారు.

సినిమా గురించి నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ'ఎన్టీఆర్ ఇమేజ్‌ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టే సినిమా అవుతుంది. తన గత చిత్రాలకు ధీటుగా హరీష్‌శంకర్ ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. అంచనాలను మించేలా ఉంటుందీ సినిమా'' అని చెప్పారు. అలా

బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి కొడతా..నన్ను అలా పిలవాలంటే ఓ అర్హత వుండాలి. లేదా నా అభిమాని అయివుండాలి...అంటూ టీజర్‌లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌తో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా వుంటుందని నిర్మాత హామీ ఇస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ విద్యార్థి నాయకుడిగా కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహణం: చోటా కె. నాయుడు, ఎడిటింగ్: అవినాష్ సైలా, స్క్రీన్‌ప్లే: రమేష్‌డ్డి, వేగేశ్న సతీష్.

English summary
NTR starrer Ramayya Vastavayya unit Presently the unit is touring Spain completing its shooting. The total unit is full busy with canning the title song of the movie which is having lyrics as “Ramayya Vasthavaiah..Sokulu bayataku Teesthamaya”.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu