For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మహాబలుడిగా ఎన్టీఆర్‌... రాజమౌళి రేంజే వేరు.. నలిగిపోతున్న హీరోలు!

  |

  సినీ హీరోలు తమ పాత్రలకు తగినట్టుగా దేహాన్ని మార్చుకోవడం కొత్తేమీ కాదు. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ ముందుంటాడు. గతంలో 100 కేజీల బరువు ఉంటే.. యమదొంగ సినిమాకు ముందు తారక్ సన్నగా, నాజుక్కుగా కనిపించేందుకు భారీగానే కండలు కరిగించాడు. అప్పటి నుంచి స్లిమ్‌లుక్‌‌ను మెయింటెన్ చేస్తున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్‌తో కలిసి ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ చేయడం తెలిసిందే. ఈ సినిమా కోసం భారీ మొత్తంలో శారీరక ఆకృతిని మార్చుకొని పహిల్వాన్ లాంటి పాత్రలో కనిపించబోతుండటం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. వివరాల్లోకి వెళితే..

  పూరీ జగన్నాథ్ కోసం టెంపర్‌లో

  పూరీ జగన్నాథ్ కోసం టెంపర్‌లో

  గతంలో టెంపర్ చిత్రం కోసం తొలిసారి సిక్స్‌ప్యాక్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకొన్నాడు. పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం ఫిట్ కనిపించేందుకు, కొత్త లుక్‌ను ఫ్యాన్స్‌కు పరిచయం చేయడానికి అప్పట్లో ఎన్టీఆర్ బాగానే శ్రమించారు.

  అరవింద సమేతలో సిక్స్‌ప్యాక్‌తో

  అరవింద సమేతలో సిక్స్‌ప్యాక్‌తో

  టెంపర్ సినిమా తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి అరవింద సమేతలో పర్‌ఫెక్ట్ సిక్స్‌ప్యాక్‌తో వెండితెరను షేక్ చేశాడు. సినిమా ఆరంభంలో వచ్చే ఎమోషనల్ ఫైట్‌లో ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఇక ప్రస్తుతం ఈ పాత్రలకు విరుద్ధంగా దర్శకుడు రాజమౌళి డిమాండ్ మేరకు ఎన్టీఆర్ భారీకాయుడిగా కనిపించబోతున్నాడు.

  RRR మూవీ కోసం

  RRR మూవీ కోసం

  RRR సినిమా కోసం శారీరక ధృడత్వంతో కనిపించే మహాబలుడిగా కనిపించనున్నట్టు తెలుస్తున్నది. హాలీవుడ్ ట్రైనర్ లాయర్ స్టీవెన్స్‌ శిక్షణలో పొందారు. ప్రస్తుతం రాజమౌళి సినిమా రెండో షెడ్యూల్‌లో రాంచరణ్‌తో కలిసి పోలీస్ స్టేషన్ సెట్ బ్యాక్ డ్రాప్‌లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ పాత్ర కోసం దాదాపు 20 కేజీల బరువు పెరిగినట్టు తెలుస్తున్నది.

   దంగల్‌లో అమీర్‌ఖాన్ మాదిరిగా

  దంగల్‌లో అమీర్‌ఖాన్ మాదిరిగా

  RRR మూవీ కోసం ఎన్టీఆర్ కొత్త రూపంలో కనిపించబోతున్నాడు. దంగల్ చిత్రంలో అమీర్ ఖాన్ ఎలా భారీకాయంతో కనిపించాడో ప్రస్తుతం తారక్ అలా కనిపించబోతున్నాడు. ఓ వైపు దేహాన్ని పెంచుకొంటూ పోతూ మరో వైపు షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. త్వరలోనే పూర్తిస్థాయిలో పహిల్వాన్ లాంటి దేహంతో కనిపించబోతున్నాడు.

   ఏప్రిల్‌‌కల్లా పర్‌ఫెక్ట్ ఫిగర్

  ఏప్రిల్‌‌కల్లా పర్‌ఫెక్ట్ ఫిగర్

  భారీకాయం కోసం ఎన్టీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నాడు. ఏప్రిల్ చివరికల్లా పాత్ర కోసం కావాల్సిన ఫర్‌ఫెక్ట్ ఫిగర్ వస్తుంది. అప్పుడు రాంచరణ్, తారక్‌పై కొన్ని కీలక సన్నివేశాలను రాజమౌళి తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు అని చిత్ర యూనిట్ నుంచి సమాచారం.

  బాహుబలి కోసం ప్రభాస్, రానా దగ్గుబాటి

  బాహుబలి కోసం ప్రభాస్, రానా దగ్గుబాటి

  గతంలో బాహుబలి కోసం రానా, ప్రభాస్‌ను రాజమౌళి, భారీ దేహం, కండలు తిరిగిన యుద్ధవీరులుగా మార్చిపడేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ వంతు వచ్చేసింది. సినిమా షూట్ ముగిసిన తర్వాత పెంచిన కండలను కరిగించడానికి ఎన్టీఆర్ ఎంత కష్టపడాల్సి వస్తుందో అనే మాట వినిపిస్తున్నది.

  English summary
  Once again NTR changing his shape for RRR of SS Rajamouli. The latest topic of discussion will surely be his look in his upcoming film RRR with director SS Rajamouli in which he will be co-starring with Ram Charan. They are working towards a heavily muscled body frame, something on the lines of Aamir Khan’s heavily built look as a wrestler in Dangal.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more