For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్టీఆర్ పుట్టిన రోజునే తేలనుంది

  By Srikanya
  |
  Ntr's Rabhasa title confirmation on May 20
  హైదరాబాద్ : ప్రచారంలో ఉన్న టైటిల్ ఖరారు అవుతుందా లేక కొత్త టైటిల్ ని ప్రకటిస్తారా అనేది ఫస్ట్ లుక్ రిలీజయ్యే వరకూ ఎప్పుడూ సస్పెన్స్. ఇప్పుడు అదే పరిస్దితి ఎన్టీఆర్ తాజా చిత్రానికి సైతం ఎదుర్కొంటోంది. ఇప్పటివరకూ ఈ చిత్రానికి ఫలానా టైటిల్ అంటూ దర్శక,నిర్మాతలు అఫీషియల్ ప్రకటన చేయలేదు. 'రభస ' టైటిల్ మొదటి నుంచి ప్రచారంలో ఉంటూ వస్తోంది. అయితే ఈ టైటిల్ ఫైనల్ అయ్యి ఖరారు చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ టైటిల్ కు విస్తృతంగా ప్రచారం దొరకటంతో ఈ టైటిల్ ని వదులుకోరని తెలుస్తోంది. ఎన్టీఆర్ పుట్టిన రోజున ఈ విషయం తేలనుంది.

  ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ చివరి దశకు చేరుకుంటుంది. ఎన్టీఆర్‌ జన్మదినమైన మే 20న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసేందుకు దర్శ,నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు 'రభస' అనే పేరు పరిశీలనలో ఉంది.

  ఎన్టీఆర్‌ సినిమా అంటే ఈ అంశాలే ఉంటాయి అని చెప్పడం కష్టం అంటుంటారు ప్రేక్షకులు. ప్రతి సినిమాలోనూ కొత్త అంశాలను జోడించి ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరిస్తుంటారాయన. ఆయన ఇప్పుడు సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం కూడా ఇదే రీతిలో వైవిధ్యంగా.. అందరూ మెచ్చేలా ఉంటుందంటున్నారు నిర్మాత. ఈ చిత్రంలో సమంత, ప్రణీత హీరోయిన్. బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మాత.

  బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ.... ' ఆ కుర్రాడికి దూకుడెక్కువ. మాటల్తో మడతెట్టేస్తాడు. చేతలతో పడగొట్టేస్తుంటాడు. తేడా వస్తే.. రభస చేయడానికి రెడీ అంటాడు. మరి ఆ జోరు ఎలా ఉంటుందో చూడాలంటే.. మా సినిమా వచ్చే వరకూ ఆగాల్సిందే. 'ఆది' తరవాత ఎన్టీఆర్‌తో చేస్తున్న సినిమా ఇది. అభిమానులకు నచ్చేలా ఉంటుంది. ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా తీర్చిదిద్దుతున్నాం. మా సంస్థలో ఇది మరపురాని చిత్రం అవుతుంది'' అని చెబుతున్నారు.

  దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ... మాస్‌ సినిమాలు చూస్తూ పెరిగినవాణ్ని నేను. నాకు ఎలాంటి చిత్రాలు నచ్చుతాయో అలాంటివే తీస్తాను. ఎన్టీఆర్‌ అనగానే శక్తివంతమైన సంభాషణలే గుర్తుకొస్తాయి. అందుకు ఏ మాత్రం తగ్గకుండా ఇందులో మాటలుంటాయి. ఎన్టీఆర్‌ కథ వినగానే నన్ను ప్రోత్సహించారు. నా తొలి చిత్రంలో హీరో ఎలాంటి బాధ్యత లేకుండా కనిపిస్తారు. కానీ ఇందులో హీరో పాత్రకి ఓ పెద్ద బాధ్యత ఉంటుంది. అది ఏమిటన్నది మాత్రం ఆసక్తికరం. ఇందులో సమంత పాత్ర కూడా కీలకమే'' అని చెప్పుకొచ్చారు.

  ఇక... ఈ చిత్రంలో ప్లేబోయ్ గా కనపడతాడు. ఇంకో నాలుగైదు సినిమాల తర్వాత కానీ ఎన్టీఆర్‌తో పనిచేసే అవకాశం రాదేమో అనుకొన్నాను. కానీ రెండో ప్రయత్నంలోనే ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టం. అంతకంటే ఓ గొప్ప బాధ్యత నా భుజాన వేసుకొన్నానన్న ఆనందం కలుగుతోంది అన్నారు.ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా ఉంటుందీ చిత్రం. మాస్‌ ప్రేక్షకులకు నచ్చే అంశాలతో పాటు వినోదం, కుటుంబ అనుబంధాలకి ప్రాధాన్యమిస్తూ కథను రాశా. ఎన్టీఆర్‌ తెరపై మూడు కోణాల్లో సాగే పాత్రలో నటించబోతున్నారు. ఓ ప్లేబాయ్‌ తరహాలో ఆయన పండించే వినోదం యువతరాన్ని అలరిస్తుంది. ప్రతీ అభిమాని గర్వపడేలా ఉంటుందీ చిత్రం అన్నారు.

  ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్‌ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

  English summary
  
 
 Rabhasa is a action entertainer movie in which Jr Ntr will playing the main lead role along with Samantha in female lead.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X