twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేక పెట్టిస్తున్న 'రామయ్యా వస్తావయ్యా' (కొత్త ఫోటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్‌: ఎన్టీఆర్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా 'రామయ్యా వస్తావయ్యా'. సమంత, శ్రుతిహాసన్ ప్రధాన పాత్రధారులు. హరీష్ శంకర్ దర్శకుడు. దిల్‌రాజు నిర్మాత. ఈ సినిమాలోని 'జాబిల్లి నువ్వే చెప్పమ్మ' అనే పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు.

    దిల్‌రాజు మాట్లాడుతూ "వచ్చే వారంలో పాటల్ని విడుదల చేస్తాం. యూనిట్ విదేశాల్లో ఉంది. త్వరలో షూటింగ్ పూర్తవుతుంది. హరీష్‌కి హ్యాట్రిక్ సినిమా అవుతుంది. టీజర్లో ఎన్టీఆర్ లుక్స్, వాయిస్ మోడ్యులేషన్ చాలా కొత్తగా ఉంది. తమన్ చక్కటి సంగీతాన్నిచ్చారు. ఎన్టీఆర్ కెరీర్‌లోనే పెద్ద హిట్ సినిమా అవుతుంది'' అని అన్నారు.

    తమన్ మాట్లాడుతూ...."ఎన్టీఆర్‌తో బృందావనం, బాద్షా తర్వాత నేను చేస్తున్న మూడో సినిమా ఇది. హరీష్ ఎంత మంచి సంగీతాన్ని రాబట్టుకుంటారో అందరికీ తెలిసిందే. చక్కటి పాటలు కుదిరాయి'' అని అన్నారు. జాబిల్లి నువ్వే చెప్పమ్మా అనే సానుకూల దృక్పథం ఉన్న పాటను రాసినట్టు అనంతశ్రీరామ్ అన్నారు. సినిమాను పెద్ద హిట్ చేయాలనే తపనతో కృషి చేసినట్టు రమేష్ రెడ్డి తెలిపారు.

    చిత్రం విశేషాలు....స్లైడ్ షో లో...

    పాట కాన్సెప్టు...

    పాట కాన్సెప్టు...

    ప్రేమించిన అమ్మాయి అలిగితే.. ఆ అలకని తీర్చడానికి ప్రేమికుడు అమ్మాయినే బతిమలాడుతాడు. కానీ మా సినిమాలో కథానాయకుడు జాబిల్లిని బతిమలాడుతాడు. ఆ భామకి నచ్చజెప్పమని అడుగుతాడు. చిరుగాలినే ఉయ్యాలగా చేసి అమ్మాయిని బుజ్జగించాలని కోరుతాడు. ఆ సంగతేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే అంటున్నారు దిల్‌రాజు.

    కొత్త లుక్ తో...

    కొత్త లుక్ తో...

    దర్శకుడు మాట్లాడుతూ ''ఈ సినిమాలో ఎన్టీఆర్‌లో కొత్త లుక్‌, నూతన సంభాషణ శైలి చూస్తారు. యువతరానికి నచ్చే కుటుంబ కథాచిత్రంగా నిలుస్తుంది. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో పాటల్ని విడుదల చేస్తాము'' అన్నారు.

    మాస్ కోసం...

    మాస్ కోసం...


    ‘‘ఎన్టీఆర్ కథ అంటే మాస్ మెచ్చాలి. మా సంస్థ నుంచి వచ్చే సినిమా కథంటే... అన్ని వర్గాలవారికీ నచ్చాలి. అందుకు తగ్గట్టే ‘రామయ్యా వస్తావయ్యా' కథ ఉంటుంది. ‘బృందావనం' ఎన్టీఆర్‌కి ఎంత మంచి పేరు తెచ్చిందో.... అంతకు పదింతలు పేరు తెచ్చే సినిమా ఇది. హరీష్‌శంకర్ అద్భుతం అనిపించే స్థాయిలో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు. ఎన్టీఆర్ పాత్రను ఆయన మలిచిన తీరు చాలా బాగుంది. కచ్చితంగా ఈ సినిమాతో హరీష్ హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందన లభిస్తోంది. తమన్ శ్రావ్యమైన స్వరాలందించాడు. త్వరలో పాటలను, సినిమాను విడుదల చేస్తాం'' అని చెప్పారు.

    అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ...

    అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ...

    సానుకూల దృక్పథాన్ని పెంపొందించే పాట రాశానని అనంతశ్రీరామ్ చెప్పారు. గతంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రానికి పాటలు రాసాను. సీతమ్మ ఆశీస్సులు దక్కాయి. ఇప్పుడు రామయ్య ఆశీస్సుల కోసం సిద్దం అవుతున్నాను. జాబిల్లీ నువ్వే చెప్పమ్మా అనే సానుకూల దృక్ఫథంతో సాగే పాటను రాసాను' అని అన్నారు.

    ఎన్టీఆర్ ని కొత్తగా...

    ఎన్టీఆర్ ని కొత్తగా...


    ''బృందావనంలో ఎన్టీఆర్‌ని సరికొత్తగా చూపించాం. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్‌ని వైవిధ్యభరితమైన పాత్రలో ఆవిష్కరించబోతున్నాం. ఆయన అభిమానులు ఏం కోరుకొంటున్నారో అవన్నీ ఈ కథలో మేళవించాం. ఎన్టీఆర్‌, సమంతలపై తెరకెక్కించిన సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి''అన్నారు.

    బృందావనం

    బృందావనం

    ఎన్టీఆర్‌తో తనకిది హ్యాట్రిక్ హిట్ అవుతుందని తమన్ నమ్మకం వ్యక్తం చేశారు. .‘బృందావనం, బాద్షా తర్వాత ఎన్టీఆర్‌తో నాకు హాట్రిక్ సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. హరీష్ శంకర్ నా నుంచి మంచి ట్యూన్స్ రాబట్టుకున్నారు. త్వరలోనే అన్ని పాటలను విడుదల చేస్తాం, అందరికీ నచ్చే విధంగా ఆడియో ఉంటుంది' అన్నారు.

    టీజర్ రెస్పాన్స్...

    టీజర్ రెస్పాన్స్...

    ఈ పాట కాకుండా మిగిలిన పాటలను వచ్చే వారం సెప్టెంబర్ 8న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం స్పెయిన్లో పాటల చిత్రీకరణ జరుగుతోందని వెల్లడించారు. మేం విడుదల చేసిన తొలి టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. మిరపకాయ్, గబ్బర్ సింగ్ తర్వాత హాట్రిక్ సక్సెస్ కొట్టడానికి హరీష్ శంకర్ సిద్ధం అవుతున్నారని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

    హంసానందిని కూడా...

    హంసానందిని కూడా...

    ‘రామయ్యా వస్తావయ్యా' సినిమా కోసం హంసా నందిని పై ఓ స్పెషల్ సాంగ్ ని త్వరలోనే షూట్ చేయనున్నారు. ప్రభాస్ ‘మిర్చి' ఐటం సాంగ్ చేసిన ఈ భామ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది' లో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ‘రామయ్యా వస్తావయ్యా' సినిమా కోసం ఎన్.టి.ఆర్ తో స్టెప్పు లేయడానికి సిద్దమవటంతో ఫ్యాన్స్ లో ఆనందం కలుగుతోంది.

    దిల్ రాజు మాట్లాడుతూ-

    దిల్ రాజు మాట్లాడుతూ-

    ‘‘ఎన్టీఆర్ ఇమేజ్‌ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టే సినిమా అవుతుంది. తన గత చిత్రాలకు ధీటుగా హరీష్‌శంకర్ ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఇటీవలే మైసూర్‌లో ఎన్టీఆర్, సమంత, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను, రెండు పాటలను చిత్రీకరించాం. అంచనాలను మించేలా ఉంటుందీ సినిమా'' అని చెప్పారు.

    స్పెయిన్ లొకేషన్స్...

    స్పెయిన్ లొకేషన్స్...

    ది గుడ్ ది బ్యాడ్ అండ్ అగ్లీ, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ది వెస్ట్, ఫర్ ఎ ఫ్యూ మోర్ డాలర్స్ మోర్ వంటి కౌబాయ్ చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫేమస్. ఆ సినిమాలతో పాటు ఆ సినిమాలు షూట్ చేసిన స్పెయిన్ లొకేషన్స్ సైతం పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఎన్టీఆర్, శృతి హాసన్ ఆ లొకేషన్ లోనే ఉన్నారు. ఆ లొకేషన్ బ్యాక్ డ్రాప్ లో ‘రామయ్యా వస్తావయ్యా' కోసం ఓ పాటను షూట్ చేస్తున్నారు. సినిమాలో ఈ పాట హైలెట్ గా నిలుస్తుందని చెప్తున్నారు.

    మాస్ మసాలా సాంగ్...

    మాస్ మసాలా సాంగ్...

    ఎన్టీఆర్ మరోసారి ఇద్దరు హీరోయిన్లతో కలిసి మాస్ మసాలా సాంగులో ప్రేక్షకులను అలరించనున్నారు. గతంలో జూ ఎన్టీఆర్ నటించిన ‘సింహాంద్రి', ‘బృందావనం' చిత్రాల్లో ఇద్దరు హీరోయిన్లతో చేసిన మాస్ మసాలా సాంగులకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ‘రామయ్యా వస్తావయ్యా' చిత్రంలోనూ అలాంటి సాంగ్ ప్లాన్ చేసారు దర్శకుడు హరీష్ శంకర్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇందులోని టైటిల్ సాంగ్ ‘రామయ్యా వస్తావయ్యా...సోకులు బయటకు తీస్తావయ్యా' అనే సాంగును జూ ఎన్టీఆర్, ఈ చిత్రంలోని ఇద్దరు హీరోయిన్లు సమంత, శృతి హాసన్‌లతో చిత్రీకరించనున్నారు. ఈ సాంగుకు సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని యూనిట్ సభ్యులు అంటున్నారు.

    నటీ,నటులు

    నటీ,నటులు

    'రామయ్యా వస్తావయ్యా' లో ఎన్టీఆర్‌, సమంత జంటగా నటిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, ముఖేష్ రుషి, తనికెళ్ల భరణి, ప్రగతి, రవిశంకర్, రావు రమేష్, అజయ్, భరత్, భరణి శంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు పాటలు: సాహితి, భాస్కరభట్ల, అనంత్‌శ్రీరామ్, శ్రీమణి, సంగీతం: థమన్.యస్.యస్., కెమెరా: ఛోటా.కె.నాయుడు, ఎడిటింగ్; గౌతమ్‌రాజు, ఆర్ట్; బ్రహ్మకడలి, స్క్రీన్‌ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగేశ్న, తోట ప్రసాద్, ఫైట్ మాస్టర్స్: రామ్-లక్ష్మణ్, కణల్ కణ్ణన్, వెంకట్, నృత్యాలు: దినేష్, గణేష్, శేఖర్ భాను, కథ, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్.యస్., నిర్మాత: రాజు, సహ నిర్మాతలు; శిరీష్ లక్ష్మణ్.

    English summary
    Jr NTR's Ramayya Vastvayya directed by Harish Shankar, of Gabbar Singh fame is getting ready. Meanwhile the producer Dil Raju is planning for its audio launch on September 8 in Hyderabad. The film has music by Thaman.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X