»   » 'టెంపర్‌' చిత్రం కొత్త ఫొటోలు(వర్కింగ్ స్టిల్స్)

'టెంపర్‌' చిత్రం కొత్త ఫొటోలు(వర్కింగ్ స్టిల్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నా పేరు దయ... నాకు లేనిదే అది అంటూ ఎన్టీఆర్‌ చేస్తున్న సందడి అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. పొగరున్న పోలీసుగా ఆయన తెరపై పంచే పూర్తిస్థాయి వినోదాలు 'టెంపర్‌'లో చూడొచ్చంటున్నారు బండ్ల గణేష్‌. ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. పూరి జగన్నాథ్‌ దర్శకుడు. కాజల్‌ హీరోయిన్. చిత్రీకరణ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుకొంటోంది. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


బండ్ల గణేష్‌ మాట్లాడుతూ ''ఎంతకైనా తెగించే ఓ ఎస్సై కథ ఇది. సవాళ్లకు ఎదురొడ్డి నిలిచే ఆ పోలీసు ఏమేం చేశాడో తెరపైనే చూడాలి. ఎన్టీఆర్‌ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఆయన కెరీర్‌లోనే నెంబర్‌ వన్‌ సినిమాగా నిలుస్తుంది. పూరి జగన్నాథ్‌ చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం, ఆయన సంభాషణలు మరోసారి ప్రేక్షకుల్ని అలరిస్తాయి. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోంది''అన్నారు.


ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. సినిమాకు మ్యూజిక్ హైలెట్ అవుతుందని అంటున్నారు. ఫిబ్రవరి 13న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫుల్‌లెంగ్త్‌ కమర్షియల్‌, మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు.


ప్రకాష్‌రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, ఆలీ, పోసాని, సుబ్బరాజు, మధురిమ, బెనర్జీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్ కె నాయుడు, సంగీతం: అనూప్ రూబెన్స్, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


ఈ చిత్రానికి సంభందించిన కొత్త ఫొటోలు స్లైడ్ షోలో...


ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ గా...

ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ గా...

ఈ చిత్రంలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయాగా ఎన్టీఆర్ పాత్ర చిత్రణ పవర్‌ఫుల్‌గా వుంటుంది.


అవినీతి టు నీతి

అవినీతి టు నీతి

అవినీతిపరుడైన ఓ పోలీసాఫీసర్ ఓ లక్ష్యం కోసం ఎలా పరివర్తన చెందాడన్నదే చిత్ర ఇతివృత్తం.కొత్తగా

కొత్తగా

ఎన్టీఆర్‌ను మునుపెన్నడూ లేని రీతిలో కొత్త పంథాలో ఆవిష్కరించే చిత్రమిదిమంచి స్పందన

మంచి స్పందన

ఇటీవలే విడుదలైన ఆడియోకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఎక్కడ విన్నా ఈ పాటలే వినపడుతున్నాయిఆకట్టుకుంటున్నాయి

ఆకట్టుకుంటున్నాయి

టీజర్స్‌లో ఎన్టీఆర్ సంభాషణలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి.పూరీ స్టైల్ లో ...

పూరీ స్టైల్ లో ...

పూరిజగన్నాథ్ శైలిలో యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ సమపాళ్లలో మేళవించిన చిత్రమిది.


గ్లామర్ కేక

గ్లామర్ కేక

కాజల్‌అగర్వాల్ గ్లామర్‌తో పాటు అభినయప్రధాన పాత్రలో అలరిస్తుంది అన్నారు.బిజినెస్

బిజినెస్

దాదాపు అన్ని ఏరియాల బిజినెస్ క్లోజ్ చేసేసారు. ఆడియో పంక్షన్ లో ఈ చిత్రం అవుట్ పుట్ టెర్రిఫిక్ గా వచ్చిందని...తను తన సోదరుడు కలిసి ఈ చిత్రాన్ని స్వయంగా విడుదల చేస్తున్నామని బంగ్ల గణేష్ ప్రకటించారు.


బిజినెస్ ఎంత

బిజినెస్ ఎంత

దానికి తోడు దర్శకుడు పూరి జగన్నాథ్ సైతం కొన్ని ఏరియాలు రైట్స్ తీసుకుంటున్నట్లు వార్త వచ్చింది. దాంతో ప్రి రిలీజ్ బిజినెస్ 42 కోట్ల వరకూ జరిగిందని ట్రేడ్ వర్గాల అంచనా.


ఫస్ట్ షో

ఫస్ట్ షో

మాగ్జిమం నెంబరాఫ్ థియోటర్స్ లో విడుదల అవుతున్న ఈ చిత్రం మొదటి షో హైదరాబాద్ భ్రమరాంబ థియోటర్ లో ఉదయం 5.07 నిముషాలకు విడుదల కానున్నదని సమాచారం. ఇప్పటికే నిర్మాత బండ్ల గణేష్ ఈ విషయమై ప్రకటన చేసి ఉన్నారు.


గతంలోనూ...

గతంలోనూ...

అలాగే .. భ్రమరాంబ థియోటర్ లో గతంలో బాలకృష్ణ లెజండ్ చిత్రం విడుదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే ఈ లోగా సీడెడ్ లో చాలా చోట్ల 12 రాత్రి తెల్లారితే 13 అనగా షోలు పడతాయి. అయితే అఫీషియల్ గా ముహూర్తం మాత్రం భ్రమరాంబలో జరగనుంది.


అమెరికాలోనూ..

అమెరికాలోనూ..

వెయ్యికిపైగా థియేటర్లు ఇప్పటికే బుక్ చేసినట్లు సమాచారం. మరో వైపు అమెరికాలోనూ ఈ చిత్రాన్ని 100కుపైగా స్క్రీన్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


English summary
Ntr's Temper movie will be released this 13 of this month. Now it's on location stills are released.
Please Wait while comments are loading...