మళ్ళీ విడుదల కాబోతున్న జూనియర్ ఎన్టీఆర్ మూవీ.. పన్నెండేళ్ల తర్వాత.. రిలీజ్ డేట్ ఫిక్స్

సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇండస్ట్రీలో ఎప్పటికీ నిలిచిపోతాయని మరోసారి రుజువైంది. మంచి కంటెంట్‌తో పాటు ఎంటర్‌టైన్ చేసే సినిమాలకు డిమాండ్ కూడా బాగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి సూపర్ కిక్ ఇచ్చిన 'యమదొంగ' మరోసారి విడుదల కాబోతోంది.

దాదాపు 12 ఏళ్ల క్రితం తెలుగులో 'యమదొంగ' చిత్రం చేసిన హంగామా ఇక తమిళంలో చేయబోతోంది. నూతన సంవత్సర కానుకగా జనవరిలో 'విజయన్‌'గా తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది 'యమదొంగ' తమిళ్ రీమేక్. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటించిన ఈ ఫాంటసీ డ్రామాలో మోహన్‌బాబు, ఖుష్బూ, ప్రియమణి, మమతా మోహన్‌దాస్‌ తదితరులు కీలకపాత్రలు పోషించి భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నారు. చిత్రానికి విజయేంద్రప్రసాద్‌ కథ అందించగా, కీరవాణి సంగీతం సమకూర్చారు.

 Ntrs YamaDonga Remake Release Date

ఇప్పుడు ఇదే యమదొంగ సినిమాను సప్త కన్ని అమ్మన్‌ క్రియేషన్స్‌ బ్యానర్ పై 'విజయన్‌' పేరుతో తమిళంలోకి రీమేక్ చేశారు. ఏఆర్‌కే రాజరాజ సంభాషణలు రాశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'విజయన్‌'ను జనవరి 3న విడుదల కానుంది. చూడాలి మరి కోలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమాను ఏ లెవెల్‌లో హిట్ చేస్తారో.

మరోవైపు అదే రాజమౌళి దర్శకత్వంలో RRR మూవీ చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సినిమాలో కొమురం భీం గా పవర్ ఫుల్ పాత్రలో ఆయన కనించనున్నాడు. 2020 జులై 30న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడు రాజమౌళి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X