»   » గొడ్డలి పట్టిన ఎన్టీఆర్..( ‘రామయ్యా వస్తావయ్యా’లీకెడ్ ఫోటోలు)

గొడ్డలి పట్టిన ఎన్టీఆర్..( ‘రామయ్యా వస్తావయ్యా’లీకెడ్ ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్టీఆర్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'. హరీశ్‌ శంకర్‌ దర్శకుడు. ఎన్టీఆర్‌ సరసన సమంత, శ్రుతి హాసన్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మైసూర్‌, హైదరాభాద్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ గొడ్డలి పట్టుకుని తన దైన శైలిలో ఎమోషనల్ గా రెచ్చిపోతాడని తెలుస్తోంది.

'భాద్‌షా' తర్వాత ఎన్టీఆర్‌, 'గబ్బర్‌సింగ్‌' తర్వాత హరీశ్‌ శంకర్‌ చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు అంబరాన్నంటుతున్నాయి. టైటిల్‌కు అన్ని వర్గాల నుంచీ మంచి స్పందన వచ్చిందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పంచ్‌ డైలాగ్స్‌, ఆయన ఎమోషనల్‌ కేరక్టర్‌ హైలైట్‌గా నిలుస్తాయని హరీశ్‌ శంకర్‌ చెప్పారు.

హరీష్ శంకర్ మాట్లాడుతూ...''ఎన్టీఆర్‌ సినిమాల్లో 'ఆది', 'సింహాద్రి' నా ఆల్‌టైమ్‌ ఫేవరేట్‌ సినిమాలు. 'రామయ్యా వస్తావయ్యా' వాటి సరసన నిలుస్తుందని ఆశిస్తున్నా'' అని అన్నారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ ...స్టూడెంట్ లీడర్ గా ఓ రేంజిలో ఫన్,ఎమోషన్ కలిగిపిన పాత్రలో అలరిస్తాడని చెప్తున్నారు.


ఇక లీకైన ఆ ఫోటోలు....

తన గత చిత్రాల్లో రివాల్వర్ చూపిస్తూ యాక్షన్ చేసిన ఎన్టీఆర్ ఈ సినిమాలో తనదైన మార్క్ చూపిస్తూ తన ఫ్యాన్స్ ని అలరించనున్నారు. ఈ వర్కింగ్ స్టిల్స్ అక్కడివే. గత నెలలో మైసూరు లోని ఓ దేవాలయంలో ఈ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. సినిమాలో ఇంటర్వెల్ ముందు ఈ ఎపిసోడ్ వస్తుందని అంటున్నారు.

అలాగే ఎన్టీఆర్ పై కొన్ని యాక్షన్ బ్లాక్స్ ని ఇటీవలే చిరాన్ ఫోర్ క్లబ్ లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఈ చిత్రంలో పవర్ ఫుల్ స్టూడెంట్ లీడర్ గా మాస్ ని ఆకట్టుకునేలా కనిపించనున్నారు. ఈ చిత్రం ఆడియోని వచ్చే నెల 7న భారీ స్ధాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమా కోసం సాహితి రాసిన ‘కన్నె కస్తూరినంత నేనై వన్నె ముస్తాబు చేసుకోనా..' అంటూ నడిచే పాటను ప్రస్తావిస్తూ ‘‘సాహితి గారు ఐటమ్‌ సాంగ్‌ రాయకపోయినా సినిమాలో ఒక ఐటమ్‌ అయ్యేలా రొమాంటిక్‌ సాంగ్‌ రాశారు'' అని ప్రస్తుతించారు హరీశ్‌ శంకర్‌. ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందనటున్నారు.

ఆగస్ట్‌ రెండో వారంలో ‘రామయ్యా వస్తావయ్యా' ఆడియో సీడీల్ని విడుదల చేయడం దాదాపు ఖరారైందని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: చోటా కె. నాయుడు, సహ నిర్మాతలు: శిరీశ్‌, లక్ష్మణ్‌, కథ, మాటలు, దర్శకత్వం: హరీశ్‌ శంకర్‌.

‘రామయ్యా వస్తావయ్యా' చిత్రంలో గొడ్డలితో ఉద్వేగపూరితమైన ఫైట్ చేసారు. సినిమా కథలో ఈ గొడ్డలి ఫైట్ ఎంతో కీలకమైనది, ఇప్పటికే ఈ ఫైట్ చిత్రీకరణ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ ఫైట్ పార్ట్ ఎంతో బాగా వచ్చిందని, ఔట్ పుట్ చూసిన తర్వాత జూ ఎన్టీఆర్‌తో పాటు హరీష్ శంకర్ కూడా ఎంతో సంతృప్తి‌గా ఫీలయ్యారని యూనిట్ సభ్యులు అంటున్నారు.

English summary
Few 'fight scene' pictures of ramayya vastavayya are going viral on web. NTR was seen running with the axe weapon in his hand. He have used almost all the weapons like sword, gun, axe etc..Harish shankar is directing the film. Fans hoping a blockbuster from the director who even gave one for pawan kalyan with gabbar sing. The leaked pictures made fans a bit anxious for the release of the movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu