»   » సుకుమార్, ఎన్టీఆర్ కాంబినేషన్ ఖరారుకి రీజన్ ఇదా? (ఫోటోలు)

సుకుమార్, ఎన్టీఆర్ కాంబినేషన్ ఖరారుకి రీజన్ ఇదా? (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :ఎన్టీఆర్ మరో కొత్త చిత్రం కమిటయ్యారు. ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు సుకుమార్ ఓ సినిమాని రూపొందించనున్నారు. 'అత్తారింటికి దారేది' నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సుకుమార్ చెప్పిన కథ వినగానే ఎన్టీఆర్ ఎగ్జయిట్ అయినట్లు సమాచారం. సుకుమార్ ప్రస్తుతం మహేశ్‌తో '1.. నేనొక్కడినే' చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పూర్తవగానే ఎన్టీఆర్ సినిమా మొదలు కానున్నది. ఇక ఈ చిత్రం ఊసరవెల్లితో నష్టపోయిన...నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ కు ఎన్టీఆర్ కాంపన్ షేషన్ గా చేస్తున్న చిత్రంగా... ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.

ఎన్టీఆర్‌ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. వేసవికి 'బాద్‌షా'గా వచ్చారు. ఇప్పుడు 'రామయ్యా వస్తావయ్యా' కోసం ముస్తాబవుతున్నారు. ఇటీవలే సంతోష్‌ శ్రీనివాస్‌తో ఓ చిత్రం సెట్స్‌పైకి వెళ్లింది. ఇప్పుడు మరో చిత్రాన్ని అంగీకరించారు. ఎన్టీఆర్‌, సుకుమార్‌ మధ్య కథాచర్చలు జరిగాయి. సుకుమార్‌ చెప్పిన కథ ఎన్టీఆర్‌కి బాగా నచ్చిందట. అందుకే వెంటనే పచ్చజెండా వూపేశారట. విలక్షణ కథాంశంతో తయారయ్యే ఈ సినిమాని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించేందుకు ఛత్రపతి ప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారు.

మరోవైపు ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం సెప్టెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. సుకుమార్‌ ప్రస్తుతం మహేష్‌బాబుతో '1' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎన్టీఆర్‌ చేతిలో రెండు సినిమాలున్నాయి. ఇవి పూర్తయ్యాకే ఈ కొత్త కాంబినేషన్‌ సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఈ చిత్రం ఖచ్చితంగా కొత్త తరహాలో యూత్ ని ఆకట్టుకునేలా ఉంటుందని చెప్తున్నారు.

కాంబినేషన్ వెనక...స్లైడ్ షోలో...

ఎప్పటి ప్లానో ఇది..

ఎప్పటి ప్లానో ఇది..

దర్శకుడు సుకుమార్ మొదటి నుంచి తనదైన శైలిలో విభిన్నమైన చిత్రాలు రూపొందిస్తూ వస్తున్నారు. ఆర్య హిట్ తో సుకుమార్ యూత్ చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ గా మారారు. ఎప్పటినుంచో సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయాలనుకుంటున్నారు. అది ఇన్నాళ్లకు తీరబోతోందంటున్నారు. ప్రస్తుతం సుకుమార్ పూర్తిగా... '1.. నేనొక్కడినే' హడావిడిలో మునిగిపోయి ఉన్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతోందని తెలుస్తోంది. ఎక్కువ శాతం విదేశాల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ రాక్ స్టార్ గా కనిపిస్తాడని చెప్తున్నారు. ఈ చిత్రం పూర్తయ్యాక ...సుకుమార్... ఎన్టీఆర్ కు చెందిన సినిమా ప్రారంభిస్తారు.

ఊసరవెల్లి కి రిలీఫ్...

ఊసరవెల్లి కి రిలీఫ్...

భారీ చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్. ఆయన ఇంతకుముందు ఎన్టీఆర్ తో ఊసరవెల్లి చిత్రం రూపొందించారు. అయితే ఆ చిత్రం విజయం సాధించలేదు. అందుకే ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటున్నారు. పవన్ తో 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ప్రస్తుతం నిర్మించి విడుదలకై ఎదురుచూస్తున్నారు.

మాస్..క్లాస్ కాంబినేషన్

మాస్..క్లాస్ కాంబినేషన్

మాస్ హీరో ఎన్టీఆర్ తో క్లాస్ గా చిత్రాలు చేసే సుకుమార్ చిత్రం అంటే అందరికీ ఆసక్తే. ఎలా ఉండబోతోంది. సుకుమార్ దార్లోకి వెళ్లి ఎన్టీఆర్ నటిస్తారా...లేక..ఎన్టీఆర్ ఇమేజ్ కు తగ్గట్లు గా సుకుమార్ చిత్రాన్ని రూపొందిస్తారా...ఏదైనా యూత్ కి ...ఎన్టీఆర్ ని మరింత దగ్గర చేసే పనిని మాత్రం సుకుమార్ చేస్తాడంటున్నారు.

దృష్టి మొత్తం ఆ సినిమా మీదే...

దృష్టి మొత్తం ఆ సినిమా మీదే...

ఎన్టీఆర్ దృష్టి మొత్తం ప్రస్తుతం చేస్తున్న 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం పైనే ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ఈ చిత్రం ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని చెప్తున్నారు. సింహాద్రి తరహాలో మాస్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి, హరీష్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ వద్ద వచ్చే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలెట్ అని తెలుస్తోంది.

రభసతో...

రభసతో...

మరో ప్రక్క శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎన్టీఆర్‌ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. సమంత హీరోయిన్. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దర్శకుడు మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ని ఓ కొత్తకోణంలో చూపించే చిత్రమిది. ఆయన శైలికి తగ్గట్టుగా యాక్షన్‌, వినోదాంశాలు పుష్కలంగా ఉంటాయి. కుటుంబ అనుబంధాలకూ ప్రాధాన్యముంది. ఇందులో ఎన్టీఆర్‌ రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపిస్తారు. ఓ లక్ష్యం కోసం పాటుపడే యువకుడిగా ఆయన పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంటుంద''న్నారు. బ్రహ్మానందం, జయసుధ, రఘుబాబు, నాజర్‌, సాయాజీషిండే, జయప్రకాష్‌రెడ్డి, అజయ్‌ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: అనూప్‌రూబెన్స్‌, ఛాయాగ్రహణం: శ్యామ్‌ కె.నాయుడు, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్లు: రామ్‌లక్ష్మణ్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాష్‌, సమర్పణ: బెల్లంకొండ సురేష్‌.

English summary
NTR is all set to act in the direction of Sukumar who proved to be a specialist in screenplay and who has a great class appeal. Sukumar is currently directing Mahesh Babu’s 1 (Nenokkadine) film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu