»   »  అన్నం పెట్టే చేతులను నరుక్కోకూడదు కదా: జూ ఎన్టీఆర్

అన్నం పెట్టే చేతులను నరుక్కోకూడదు కదా: జూ ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

''వాళ్లని కాదని పోదామన్నా అన్నం పెట్టే చేతులను నరుక్కోకూడదు కదా! నిర్మాతలు నాకు అన్నం పెట్టే చేతులు"" అన్నారు జూ.ఎన్టీఆర్. ఆయన్ని మీడియా వారు...హనీమూన్ ఎక్కడని ప్రశ్నించగా, నిర్మాతలు తనకు కేవలం నెల రోజులే విరామం ఇచ్చారని,వారిని దాటి పోలేనని ఇలా చెప్పుకొచ్చారు.అలాగే పెళ్లిలో ఎలాంటి డ్రెస్ వేసుకుంటానన్నది మాత్రం అందరికీ సర్‌ప్రైజ్ అని చెప్పారు. పెళ్లి కొడుకుగా ముస్తాబవడానికి ఎలాంటి డిజైనర్‌నూ ఏర్పాటు చేసుకోవడం లేదన్నారు.

''నాకు పెళ్లి బాగా జరిగితే చాలు. అందరూ పెళ్లి చూడగలిగితే చాలు. అందరూ ఆశ్వీరదిస్తే చాలు"" అని చెప్పారు. పెళ్లి కూతురు డ్రెస్ విషయంలోనూ తాను జోక్యం చేసుకోవడం లేదన్నారు. ఎవరికి వాళ్లు సీక్రెట్‌గా పెళ్లి బట్టలు చూసుకుంటున్నామన్నారు.పెళ్లిలో తానెలాంటి డ్రెస్ వేసుకునేదీ కల్యాణ మండపంలోనే చూస్తారని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఒక వ్యాపార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తన పెళ్లి సంబంధిత విషయాలపై మీడియాతో మాట్లాడారు.అలాగే ..నాకు బాగా సంప్రదాయబద్ధంగా ముస్తాబవాలని ఉంది. అచ్చం తెలుగింటి అబ్బాయి మాదిరిగానే కన్పిస్తాను అని తేల్చి చెప్పేసారు.

English summary
Since NTR has a very busy schedule shooting, he needs to do lot of planning before he jumps into a long honeymoon break. But all this gives us enough hint that NTR is planning to take a break from his current shooting itinerary and for a pleasure trip.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu