»   » జూ ఎన్టీఆర్ ‘టెంపర్’ ఆడియో వేడుక (లైవ్)

జూ ఎన్టీఆర్ ‘టెంపర్’ ఆడియో వేడుక (లైవ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటిస్తున్న ‘టెంపర్' ఆడియో వేడుక ఈ రోజు సాయంత్రం శిల్పకళా వేదికలో గ్రాండ్‌గా జరుగబోతోంది. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. కాగా ఆడియో వేడుకకు భారీగా అభిమానులు తరలి రానున్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేసారు.


గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకుని...ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా నకిలీ పాస్‌లకు చెక్ పెట్టేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాసులను చెక్ చేసి లోనికి అనుమతించబోతున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఇదే అత్యంత గ్రాండ్‌గా జరిగే ఆడియో వేడుక అని నిర్వాహకులు చెబుతున్నారు. శ్రేయాస్ మీడియా వారు ఈ ఈవెంటును నిర్వహిస్తున్నారు. ఇది వారి 400వ ఈవెంటు కావడంతో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసారు.


Ntr Temper Audio Live streaming

ఆడియో వేడుక చూసేందుకు అభిమానులు భారీగా తరలి వస్తున్నారు. 7 గంటలకు ఆడియో వేడుక ప్రారంభం కానుంది.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

English summary
The much awaited audio of the movie "Temper" is almost here. The audio release of the Jr. NTR starrer is scheduled to be held at 7pm at Shilpa Kala Vedhika, Madhapur in Hyderabad on Wednesday.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu