»   »  'హరే రామ్' కి ఎన్టీఆర్ హెల్ప్ ?

'హరే రామ్' కి ఎన్టీఆర్ హెల్ప్ ?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Jr Ntr
కళ్యాణ్ రామ్, ప్రియమణి జంటగా హర్షవర్ధన్ దర్శకత్వంలో రూపొందిన 'హరేరామ్ ' నిన్న అంతటా రిలీజైంది. 'అతనొక్కడే' సినిమా తర్వాత తమ స్వీయ బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్ పై కళ్యాణరామ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ చిత్రం పబ్లిసిటి ని ఎన్టీఆర్ తో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. భాక్సాఫీసు వద్ద పెద్ద స్ధాయిలో హిట్ గా చిత్రాన్ని నిలిపేందుకు ఎన్టీఆర్ తన సోదరుడుకి ఈ సాయం చేస్తున్నట్లు సమాచారం. ఆ ప్రొమోలలో ఎన్టీఆర్ ఈ చిత్రం గురించి, మేకింగ్ లో పడ్డ కష్టం గురించి చెప్పబోతున్నారని చెప్పుకుంటున్నారు. ఆడియో ఫంక్షన్ కి ఫ్యామిలీ మొత్తం అటెండవటం, ఇలా పబ్లిసిటిలో ఒకరుకి ఒకరు సాయం చేసుకోవటం నందమూరి ఫ్యామిలీ అభిమానులకు సంతోషాన్నిస్తోంది. అలాగే ఇంతకు ముందు కూడా ఎన్టీఆర్ తమ బాబయ్య బాలయ్య 'పాండురంగడు' చిత్రానికి పభ్లిసిటీ ప్రోమోలలో కనపడ్డారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X