»   » ఈ సారి ఎన్టీఆర్ యూట్యూబ్ రికార్డ్

ఈ సారి ఎన్టీఆర్ యూట్యూబ్ రికార్డ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోల క్రేజ్ ని యూ ట్యూబ్ లో కొలుస్తున్న సంగతి తెలిసిందే. హీరోల నటించిన చిత్రాల పాటలు లేదా టీజర్ యూ ట్యూబ్ లో విడుదల చేసి అవి ఎంత మంది చూసారో అన్నదాన్ని రికార్డ్ గా చెప్తున్నారు. ఇప్పుడు ఆ వంతు ఎన్టీఆర్ కు వచ్చింది. రెండు రోజుల క్రితం ఎన్టీఆర్ హీరోగా చేసిన 'రామయ్యా వస్తావయ్యా'చిత్రంలోని జాబిల్లి నువ్వే చెప్పమ్మా పాట ని విడుదల చేసారు. ఆ పాట ఇప్పుడు యూ ట్యూబ్ లో రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. ఈ రెండు రోజుల్లో 637,772 వ్యూస్ వచ్చాయి.

Ramaya Vastavaya

''ఎన్టీఆర్ కథ అంటే మాస్ మెచ్చాలి. మా సంస్థ నుంచి వచ్చే సినిమా కథంటే... అన్ని వర్గాలవారికీ నచ్చాలి. అందుకు తగ్గట్టే 'రామయ్యా వస్తావయ్యా' కథ ఉంటుంది. 'బృందావనం' ఎన్టీఆర్‌కి ఎంత మంచి పేరు తెచ్చిందో.... అంతకు పదింతలు పేరు తెచ్చే సినిమా ఇది. హరీష్‌శంకర్ అద్భుతం అనిపించే స్థాయిలో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు. ఎన్టీఆర్ పాత్రను ఆయన మలిచిన తీరు చాలా బాగుంది. కచ్చితంగా ఈ సినిమాతో హరీష్ హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందన లభిస్తోంది. తమన్ శ్రావ్యమైన స్వరాలందించాడు. త్వరలో పాటలను, సినిమాను విడుదల చేస్తాం'' అని దిల్ రాజు చెప్పారు.

అలాగే ... ప్రేమించిన అమ్మాయి అలిగితే.. ఆ అలకని తీర్చడానికి ప్రేమికుడు అమ్మాయినే బతిమలాడుతాడు. కానీ మా సినిమాలో హీరో జాబిల్లిని బతిమలాడుతాడు. ఆ భామకి నచ్చజెప్పమని అడుగుతాడు. చిరుగాలినే ఉయ్యాలగా చేసి అమ్మాయిని బుజ్జగించాలని కోరుతాడు. ఆ సంగతేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్‌లో కొత్త లుక్‌, నూతన సంభాషణ శైలి చూస్తారు. యువతరానికి నచ్చే కుటుంబ కథాచిత్రంగా నిలుస్తుంది. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో పాటల్ని విడుదల చేస్తాము''అంటున్నారు దిల్‌రాజు.


దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతోన్న చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'. ఎన్టీఆర్‌, సమంత జంటగా నటిస్తున్నారు. శ్రుతిహాసన్‌ మరో కీలక పాత్రలో నటిస్తోంది. హరీష్‌ శంకర్‌ దర్శకుడు. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఎన్టీఆర్‌తో తనకిది హ్యాట్రిక్ హిట్ అవుతుందని తమన్ నమ్మకం వ్యక్తం చేశారు. సానుకూల దృక్పథాన్ని పెంపొందించే పాట రాశానని అనంతశ్రీరామ్ చెప్పారు. ఇందులో కొత్త ఎన్టీఆర్‌ని చూస్తారని స్క్రీన్‌ప్లే రచయిత రమేష్‌రెడ్డి అన్నారు. కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, ముఖేష్‌రుషి, రవిశంకర్, రావురమేష్, అజయ్, ప్రగతి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: చోటా కె.నాయుడు, కూర్పు: గౌతంరాజు, కళ: బ్రహ్మ కడలి, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.

English summary

 Jnr NTR is coming with his new movie ‘Ramaya Vastavaya’ directed by Harish Shankar and produced by Dil Raju. Recently a song from the movie was released. The lyrics go on as ‘jabilli nuvve cheppamma’. its a record crossed 637,772 views . We all know that Thaman is famous for repeated tunes but he framed this song very well that it is attracting everyone including the antifans. This song is creating hype on the movie. Lets hope that this movie will also be included in the blockbuster list of NTR.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu