»   » పాతొక రోత... కొత్తొక వింత: ఎన్టీఆర్ డిసైడ్ అయ్యాడా? (ఫోటోస్)

పాతొక రోత... కొత్తొక వింత: ఎన్టీఆర్ డిసైడ్ అయ్యాడా? (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ పెళ్లయిన దగ్గర నుండి ఖరీదైన బ్లక్ కలర్ రేంజ్ రోవర్ కారు వాడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇపుడు ఎన్టీఆర్ ఈ కారును అమ్మేద్దామనే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం ఎన్టీఆర్ కొత్తగా బిఎండబ్ల్యూ సెవెన్ సిరీస్ కారు కొనుగోలు చేసారు. ఇటీవల ఆయన ఎక్కడ చూసినా ఈ కారులోనే తిరుగుతూ కనిపిస్తున్నారు.

కొత్తకారు సరే... పాత కారు అమ్ముకోవాల్సిన అవసరం ఏమిటి? అనే దానిపై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. రేంజి రోవర్ కారు తనకు అంతగా కలిసి రావడం లేదని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. ఈ మధ్య వరుస ప్లాపులు కూడా కారు మారుద్దామనే ఆలోచనకు దారి తీసిందట. అందుకే ఎన్టీఆర్ కొత్తకారు కొన్నాడని టాక్.

అయితే తనకు అంతగా కలిసి రాని పాత కారును ఇంట్లో మూలన పెట్టుకోవడం కూడా ఇష్టం లేక అమ్ముదామని డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ కారు అద్దాలకు నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ ఫిల్మ్ వాడినందుకు ఇటీవల ట్రాఫిక్ పోలీసులు చాలానాలు కూడా వేసిన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ పాత కారును ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. గతంలో చిరంజీవి పాత కారును రవితేజ దక్కించుకున్నట్లు ఎన్టీఆర్ కారును కూడా సినీ రంగానికే చెందిన ఎవరైనా దక్కించుకుంటారో చూడాలి.

ఇదే ఆ కారు

ఇదే ఆ కారు


ఎన్టీఆర్ అమ్మదలుచుకున్న రేంజ్ రోవర్ కారు ఇదే. దీనికి ఫ్యాన్స్ నెంబర్ ప్లేటు కూడా ఉంది.

కలిసి రాని కారణంగానే

కలిసి రాని కారణంగానే


తనకు అంతగా కలిసి రాని కారణంగానే ఈ కారును అమ్మాలని ఎన్టీఆర్ డిసైడ్ అయ్యాడు.

కొత్త బిఎండబ్ల్యు రూ. 1.25 కోట్లు

కొత్త బిఎండబ్ల్యు రూ. 1.25 కోట్లు


ఎన్టీఆర్ కొత్తగా 1.25 కోట్లు విలువ చేసే బిఎండబ్ల్యూ సెవెన్ సిరీస్ కారు కొనుగోలు చేసారు.

ఫ్యాన్సీ నెంబర్ కోసం 10 లక్షల ఖర్చు

ఫ్యాన్సీ నెంబర్ కోసం 10 లక్షల ఖర్చు


తనకొత్త కారు కోసం రూ. 10.5 లక్షలు ఖర్చు చేసి వేలంలో ఉన్న టిఎస్ 09 ఇలెల్ 9999 నెంబర్ దక్కించుకున్నారు ఎన్టీఆర్. రవాణా శాఖ చరిత్రలో ఇంత మొత్తానికి ఫ్యాన్స్ నెంబర్ అమ్ముడు పోవడం ఓ రికార్డ్.

English summary
Reports say that NTR felt that that his old car 'Range Rover' was a bit unlucky as he faced so many flops all these years. Now, NTR is trying to sell his old car.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu