జూ ఎన్టీఆర్ భార్య లక్ష్మిప్రణతి ఫోటో వైరల్..... కారణం ఇదే!
వరుస విజయాలు అందుకుంటున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అటు కెరీర్ పరంగా దూసుకెళుతున్నాడు. ఇటు పర్సనల్ లైఫ్ పరంగానూ ఈ నందమూరి హీరో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లో మూవీ అభిమానుల్లో ఆనందాన్ని మరింత పెంచింది. అయితే త్వరలో ఇంతకంటే సంతోషకరమైన విషయాన్ని అభిమానులు వినబోతున్నారు.

ఆ సంతోషకరమైన విషయం ఏమిటంటే...
యంగ్ టైగర్ నుండి త్వరలో శుభవార్త వినబోతున్నాం అంటూ ఫిల్మ్ నగర్లో ఓ ప్రచారం మొదలైంది. ఎన్టీఆర్-ప్రణతి దంపతులు మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారట. కొన్ని రోజుల క్రితం ఈ వార్త వెలుగులోకి వచ్చినా.... తాజాగా ఓ ఫోటో సాక్షం కూడా చక్కర్లు కొడుతోంది.

లక్ష్మి ప్రణతి ఫోటోవైరల్
ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతికి చెందిన ఓ ఫోటో ఇంటర్నెట్లో వైరల్ అయింది. ఈ ఫోటోలో ఆమె గర్భవతిగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఇది లేటెస్ట్ ఫోటోనా? లేక పాత ఫోటోనా? అనే విషయంలో క్లారిటీ లేదు.

అభయ్ రామ్
ఎన్టీఆర్-లక్ష్మి ప్రణతి దంపతులు 2011లో మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బాబుకి అభయ్ రామ్ అని పేరు పెట్టుకున్నారు. ఈ మధ్య నాన్నతో కలిసి సినిమా ఫంక్షన్లకు హాజరవుతూ అభయ్ రామ్ సందడి చేస్తున్నాడు.
Recommended Video


మరో బిడ్డ కోసం
ఎన్టీఆర్ దంపతులు త్వరలో మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారనే వార్తలు అభిమానుల్లో సంతోసాన్ని కలిగిస్తోంది. అదే సమయంలో ఈ విషయంలో అఫీషియల్ సమాచారం లేక పోవడంతో అయోమయానికి గురవుతున్నారు.

ఎన్టీఆర్ మేకోవర్
ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలోని పాత్ర కోసం జిమ్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ సమక్షంలో మేకొవర్ మార్చుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ నెలలోనే ఈ చిత్రం సెట్స్ పైకి తీసుకెళుతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











