»   » మహేష్ బాబు ఐటం సాంగ్, బాక్సాఫీసు వద్ద బోల్తా (ఫోటోలు)

మహేష్ బాబు ఐటం సాంగ్, బాక్సాఫీసు వద్ద బోల్తా (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బ్యాగ్రౌండ్ అంతా మహేష్ బాబు ఫోటోలు, మహేష్ బాబును పొగుడుతూ హాట్ అండ్ సెక్సీగా హీరోయిన్ నిషా కొఠారి ఐటం సాంగ్. ఇదంతా ఈ మధ్య టీవీల్లో హల్ చల్ చేస్తున్న 'నువ్వే నా బంగారం' సినిమా ట్రైలర్. సాయికృష్ణని హీరోగా పరిచయం చేస్తూ, బిందాస్ ఫేం షీనా హీరోయిన్ గా నటించిన సినిమా 'నువ్వే నా బంగారం'.

రామ్ వెంకీ దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన ఈ సినిమాని పి. కృష్ణంరాజు నిర్మించారు. యాజమాన్య సంగీతం అందించిన ఈ చిత్రం మర్చి 7న విడుదలైంది. మహేష్ బాబు పేరుతో ఐటం సాంగు ఉండటం ద్వారా థియేటర్లు జనాలు పరుగెత్తుకొస్తారని అనుకున్నారో? ఏమో? తెలియదు కానీ...ఈ ఒక్క పాటతోనే ప్రచార కార్యక్రమాల అదరగొట్టారు నిర్మాతలు.

అయితే మహేష్ బాబు పేరుతో ఐటం సాంగు చేసినా పెద్దగా ఫలితం లేక పోయింది. తొలి రోజే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

కథేంటి?

కథేంటి?

సూర్య (సాయికృష్ణ) మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన విద్యార్థి. తన కాళ్లమీద తాను నిలబడాలనుకొనే మనస్తత్వం కలవాడు. స్వేచ్ఛగా బతకడం అంటే ఇష్టం. అందుకే ఇంట్లో వాళ్లకు దూరంగా ఉంటాడు. హారిక (షీనా) ఇంజనీరింగ్‌ చదువుతుంటుంది. అమ్మానాన్న అంటే గౌరవం. 'మీరు చూపించిన అబ్బాయినే పెళ్లిచేసుకొంటా' అని ఇంట్లోవాళ్లకు మాటిస్తుంది. కానీ అనుకోకుండా సూర్య, హారిక ప్రేమలో పడతారు. ఆ తరవాత ఏమైంది? సూర్య, హారిక ఇద్దరూ తల్లిదండ్రుల మాట తప్పారా? స్వేచ్ఛను దుర్వినియోగం చేశారా? అనేది తెరపై చూడాలి.

కాన్సెప్టు ఇదీ..

కాన్సెప్టు ఇదీ..

ప్రేమని, కెరీర్‌ని ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకూడదు. జీవితం బాగుండాలంటే రెండూ లైట్‌ తీసుకోకుండా ముందుకు సాగాలి. అదే సమయంలో తల్లిదండ్రులకు పిల్లలపై నమ్మకం ఉండాలి. తల్లిదండ్రులకు పిల్లలు బంగారంలానే కనిపిస్తారు. పిల్లలకూ వాళ్ల తల్లిదండ్రులు బంగారమే. అనే కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

నటీనటుల

నటీనటుల

శ్రీధనలక్ష్మి మూవీస్‌ సంస్థపై నిర్మించిన ఈ చిత్రంలో సాయికృష్ణ, షీనా, నిషాకొఠారి, సుమన్‌, తనికెళ్ల భరణి, సన, రాజశ్రీ నాయర్‌, ప్రవీణ్‌, శ్రావణ్‌, మహేశ్వరి తదితరులు నటించారు.

ఇతర వివరాలు

ఇతర వివరాలు

ఈ చిత్రానికి కథ, మాటలు: లంకపల్లి శ్రీనివాస్, ఛాయాగ్రహణం: రామ్. సంగీతం: యాజమాన్య నిర్మాత: పేరిచర్ల కృష్ణంరాజు దర్శకత్వం: రామ్‌ వెంకీ

English summary
'Nuvve Naa Bangaram' box office talk. Everything about the film has an outdated look and feel. The script is flawed. Many scenes make absolutely no sense. The emotions don't work either because of which the love story in its entirety fails to make much impact.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu